Go to full page →

సేనిటేరియాలు, పాఠశాలల సహకారం CDTel 469

ఉత్తరం 82, 1908 CDTel 469.2

777. ఎక్కడ సాధ్యపడితే అక్కడ విద్యా సంస్థలు మన సేనిటేరియాలతో అనుసంధానపడి ఉండాలని నాకు విస్పష్టమైన వెలుగు వచ్చింది. ఈ రెండు సంస్థలు కలిసి పనిచెయ్యాలి. లోమలిండాలో మనకో విద్యాలయం ఉన్నందుకు కృతజ్ఞురాలిని. సేవ చెయ్యటానికి వైద్యమిషనెరీ సువార్తికుల్ని తర్బీతు చెయ్యటానికి సమర్థులైన వైద్యుల విద్యాబోధనా ప్రతిభ అవసరం. పాఠశాలల్లోని విద్యార్ధులుకి ఆరోగ్య సంస్కర్తలుగా పని చెయ్యటానికి శిక్షణనివ్వాలి. వ్యాధిని గురించి, దానికి కారణాల్ని గురించి వ్యాధిని ఎలా నివారించాలి అన్నదాన్ని గురించి, రోగులకు చికిత్స చెయ్యటానికి అవసరమైన శిక్షణను గురించి ఇచ్చే ఉపదేశం..... అంతా విలువైన విద్య. ఇది మన పాఠశాలల్లోని విద్యార్థులందరూ నేర్చుకోవాల్సిన విద్య, CDTel 469.3

మన పాఠశాలల్ని సేనిటేరియాల్ని ఇలా కలపటం అనేక విధాలుగా మేలుకరం. సేనిటేరియాలిచ్చే ఉపదేశం వలన విద్యార్థులు తినటం విషయంలో అమిత త్వపు అలవాట్లను నివారించటం విషయంలో నేర్చుకుంటారు. CDTel 470.1