Go to full page →

వాక్య పరిచారకులు సంస్కరణ సూత్రాల్ని బోధించాలి CDTel 471

[C.T.B.H.117] (1890)C.H.449 CDTel 471.1

780. ఆరోగ్య చట్టాలకు అనుగుణంగా నివసించటానికే కాకుండా ఇతరులుకి మెరుగైన మార్గం చూపించటానికి మనం జ్ఞానం సంపాదించాలి. ఈ కాలానికి దేవుడిచ్చిన ప్రత్యేక సత్యాల్ని నమ్ముతున్నట్లు చెప్పేవారిలో అనేకులు ఆరోగ్యం గురించి మిత భోజన పానాల గురించి అజ్ఞానులు. వారు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం చదివి జ్ఞానం సంపాదించాలి. ఈ అంశం నిత్యం వారి ముందుండాలి. ప్రాముఖ్యం లేనిదిగా భావించి దీన్ని విడిచి పెట్టకూడదు. ఎందుకంటే ఈ అంశం పై దాదాపు ప్రతీ కుటుంబం కలవరం చెందాలి. యదార్ధమైన సంస్కరణ సూత్రాల్ని ఆచరించే విధినిర్వహణకు మనస్సాక్షిని మేల్కొల్పటం అవసరం. తన ప్రజలు అన్ని విషయాల్లోను మితంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వారు నిజంగా మితానుభవం పాటిస్తే తప్ప సత్యం తాలూకు పరిశుద్ధీకరణ ప్రభావానికి వారు లోబడరు. CDTel 471.2

మన బోధకులు ఈ అంశం పై జ్ఞానం కలిగి ఉండాలి. వారు దాన్ని • అలక్ష్యం చేయకూడదు. లేక తమని తీవ్రవాదులంటున్న వారి ఒత్తిడి వలన పక్కకు తప్పుకోకూడదు. వాస్తవమైన ఆరోగ్య సంస్కరణలో ఉన్నదేంటో వారినే తెలుసుకోనిచ్చి, ఉచ్చరణ ఆచరణల ద్వారా దాని సూత్రాల్ని వారికి బోధించండి. మనం జరిపే పెద్ద పెద్ద సమావేశాల్లో ఆరోగ్యం గురించి మితానుభవం గురించి ఉపదేశం ఇవ్వాలి. మేధను మనస్సాక్షిని CDTel 471.3

మేల్కొల్పటానికి ప్రయత్నించండి. మీ ప్రతిభాపాటవాలన్నింటిని సేవలో వినియోగించి, ఆ అంశం పై ప్రచురణల ద్వారా సేవను పటిష్టం చెయ్యండి. “బోధించు, బోధించు, బోధించు” అన్నదే నాకు వచ్చిన వర్తమాన సారాంశం. CDTel 471.4

(1900) 61 112 CDTel 471.5

781. మనం చివరికాలాన్ని సమీపించే కొద్దీ ఆరోగ్యసంస్కరణను క్రైస్తవ మితానుభవాన్ని మరింత ధృఢంగా, నిర్ణయాత్మకంగా సమర్పిస్తూ ఉన్నతంగా లేవాలి. ప్రజలకు బోధించటానికి నేర్పించటానికి మనం నిత్యం కృషి చెయ్యాలి. మాటల ద్వారానే కాదు. ఆచరణ ద్వారా కూడా. ఉఛ్ఛరణ, ఆచరణల సంయుక్త ప్రభావం తిరుగులేనిది. CDTel 471.6