Go to full page →

సంస్కరణ ప్రబోధకుల్లారా, ముందుకి సాగండి CDTel 477

(1909) 9T 112,113 CDTel 477.6

788. లోకంలోని బాధను తగ్గించటానికి, తన సంఘాన్ని పవిత్రపర్చటానికి ఆరోగ్యసంస్కరణ సేవ దేవుడు ఉపయోగిస్తున్న సాధనం. శారీరక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పునరుద్ధరించటంలో ఆ అపూర్వ కార్యకర్తకు సహకరించటం ద్వారా దేవునికి సహాయకులు కావచ్చునని ప్రజలకు బోధించండి. ఈ సేవపై దేవుని ఆమోదముద్ర ఉంటుంది. విలువైన సత్యాలు ప్రవేశించేందుకు ఇది తలుపు తెరుస్తుంది. ఈ సేవను విజ్ఞతతో చేపట్టే వారందరూ పని చెయ్యటానికి చోటుంటుంది. CDTel 477.7

ఆరోగ్యసంస్కరణ సేవను ముందుంచండి అన్నదే ప్రకటించమని దేవుడు నాకిచ్చిన వర్తమానం. కనుక దాని విలువను ఎత్తి చూపించండి. అప్పుడు ప్రజలు దాని అవసరాన్ని విశేషంగా గుర్తిస్తారు. హానికరమైన ఆహార పానాల నిరాకరణ యదార్ధమతం ఉత్పత్తి చేసే ఫలం. సంపూర్ణ హృదయ పరివర్తన గల వ్యక్తి హానికరమైన ప్రతీ అలవాటును తిండిని విడిచిపెడ్తాడు. సంపూర్ణ నిరాకరణ ఆచరించటం ద్వారా అతడు హానికరమైన శరీరాశలకు దూరంగా ఉంటాడు. CDTel 478.1

ముందుకి సాగండి అని ఆరోగ్య సంస్కరణ ప్రబోధ కుల కు చెప్పాల్సిందిగా ప్రభువు నన్ను ఆదేశిస్తున్నాడు. పోటెత్తుతున్న నైతిక దుఃఖాన్ని వెనక్కి నెట: --నికి ప్రపంచం పై మీరు చూపగల ప్రభావమంతా అవసరం. మూడో చూత వర్తమానాన్ని ప్రకటిస్తున్నవారందరూ తాము నమ్ముతున్నట్లు చెప్పే సత్యంలో ధృఢంగా నిలబడాలి. CDTel 478.2