Go to full page →

నేర్పు, మర్యాద వినియోగం CDTel 480

(1905) M.H.156,157 CDTel 480.2

792. మీ సేవ అంతటిలోను మీరు క్రీస్తుతో జతపడి ఉన్నారని విమోచన ప్రణాలికలో మీరో భాగమని గుర్తుంచుకోండి. క్రీస్తు జీవితం స్వస్తపర్చే, జీవమిచ్చే, ప్రవాహమై మీ జీవితం ద్వారా ప్రవహించాలి. ఆయన ప్రేమ పరిధిలోకి ఇతరుల్ని ఆకర్షించటానికి ప్రయత్నించేటప్పుడు మీ భాష స్వచ్చంగా, మీ సేవలు నిస్వార్ధంగా ఉండనివ్వండి. మీ నడవడి తాలూకు ఆనందం ఆయన కృపా శక్తికి సాక్షి కానివ్వండి. మనుషులు ఆయన సౌందర్యాన్ని వీక్షించేందుకు, ఆయన్ని పవిత్రంగా నీతివంతంగా మీలో లోకానికి చూపించండి. CDTel 480.3

తప్పుడు అలవాట్లుగా మనం భావించే వాటి పై దాడి చెయ్యటం ద్వారా ఇతరుల్ని సంస్కరించటానికి ప్రయత్నించటం వ్యర్ధం. అట్టి ప్రయత్నాలు మేలు కన్నా ఎక్కువ కీడు చేస్తాయి. తన సంభాషణలో సమరయ స్త్రీతో యాకోబు బావిని గురించి చులకనగా మాట్లాడే బదులు క్రీస్తు అంతకన్నా ఉత్తమమైన ఇంకోదాన్ని సమర్పించాడు. “నీవు దేవుని వరమును-నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమునిచ్చును” అన్నాడు. తాను ఇవ్వదలచిన మహదైశ్వర్యం పైకి సంభాషణను తిప్పి ఆమెకున్న దానికన్నా మెరుగైనది-జీవజలం, సువార్తానందం, నిరీక్షణ ఆమెకు ఇవ్వజూపాడు. CDTel 481.1

మనం పనిచెయ్యాల్సిన రీతికి ఇది ఓ ఉదాహరణ. తమకున్నదానికన్నా మెరుగైన దాన్ని, అనగా సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు సమాధానం మనం మనుషులకివ్వాలి. దేవుని ప్రవర్తన నకలు - తాము ఏమి కావాలని ఆయన ఆశిస్తున్నాడో దాని వివరణ - అయిన పరిశుద్ధ ధర్మశాస్త్రం గురించి మనం ప్రజలకు చెప్పాలి...... CDTel 481.2

సంస్కర్తలు లోకంలోని ప్రజలందరిలోను మిక్కిలి నిస్వార్ధపరులు, మిక్కిలి దయగలవారు, మిక్కిలి మర్యాదగలవారు అయి ఉండాలి. వారి జీవితాల్లో నిజమైన మంచితనం స్వార్ధరహిత క్రియలు కనిపించాలి. మర్యాద చూపించని పనివాడు, ఇతరుల అజ్ఞానం విషయంలోను, మూర్ఖత విషయంలోను అసహనం కనపర్చేవాడు, దుందుడుకుగా మాట్లాడేవాడు లేక ప్రవర్తించే వాడు హృదయ ద్వారాల్ని మూసివేయవచ్చు. వాటిని అతడెన్నడూ చేరలేకపోవచ్చు. CDTel 481.3