Go to full page →

తీవ్ర భావాల్ని ఎదుర్కోటం-ఓ చరిత్రాత్మక ప్రకటన * CDTel 489

(1870) 3T 18D21 CDTel 489.3

803. 1870 శరత్కాలంలో మేము కేన్సన్ నుంచి తిరిగి వచ్చినప్పుడు సోదరుడు బి. జ్వరంతో ఇంట్లో ఉన్నాడు..... అతడి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.... CDTel 489.4

మాకెంతో అవసరమైన విశ్రాంతి లేకపోయింది. ది రివ్యూ, ది రిఫార్మర్, ది ఇన్‌స్ట్రక్టర్ పత్రికల్ని సరిదిద్దాలి. ఆ సమయంలో వాటి సంపాదకులందరూ ఒకేసారి జబ్బుగా ఉన్నారు..... నా భర్త తన పని ప్రారంభించారు. నేను ఆయనకు నా శక్తి మేరకు సహాయం చేశాను.... CDTel 490.1

ది రిఫార్మర్ ఆగిపోటానికి సిద్ధంగా ఉంది. సోదరుడు బి డా. ట్రాల్ తీవ్రభావాల్ని సమర్థించాడు. పాలు, పంచదార, ఉప్పు వాడకూడదంటూ రిఫార్మర్ పత్రిక ద్వారా బలంగా నిలబడటానికి ఇది ఆ వైద్యుణ్ని ప్రభావితం చేసింది. వీటి వాడకాన్ని పూర్తిగా మానెయ్యాలన్న వాదన మంచిదే కావచ్చు. కాని ఈ అంశాలపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకోటానికి సమయం ఇంకా రాలేదు. పాలు, వెన్న, పంచదార వాడకాన్ని పూర్తిగా మానెయ్యాలన్న తీర్మానానికి వచ్చి దాన్ని ప్రబోధించేవారు వాటిని తమ భోజన బల్లల మీద ఉంచకూడదు. డా. ట్రా తో గళం కలిపి ఉప్పు, పాలు, పంచదార వాడకాన్ని వ్యతిరేకిస్తూనే సోదరుడు బి తాను ప్రబోధిస్తున్న విషయాల్ని ఆచరణలో పెట్టలేదు. వీటిని తన భోజన బల్లపై ఉంచుకుని ప్రతీ దినం వాడుతూనే ఉన్నాడు. CDTel 490.2

మన ప్రజల్లో అనేకమంది రిఫార్మర్ పత్రికపట్ల ఆసక్తి కోల్పోయారు. “దయచేసి నాకు రిఫార్మర్ పంపటం ఆపుచెయ్యండి” అంటూ ప్రతీ దినం ఉత్తరాలు రావటం జరిగింది. హెల్త్ రిఫార్మర్ పత్రిక కు చందారారుల్ని ఆకర్షించటం పశ్చిమాన అసాధ్యమయ్యింది. రిఫార్మర్ పత్రికకు రచనలందించే వారు ప్రజలకు దూరమౌతున్నట్లు మేము గుర్తించాం. నిజంగా సంస్కర్తలైన మనస్సాక్తిగల క్రైస్తవులు సంస్కరణను ఆచరించలేరన్న వాదనను మనం చేపడితే, ఆరోగ్య విషయాల ద్వారా మాత్రమే చేరగల జా వర్గాన్ని మనం ఎలా చేరగలం? CDTel 490.3

[ * జేమ్స్ వైట్ ఇచ్చిన అదనపు సమాచారానికి అనుబంధం || చూడండి] CDTel 490.4