Go to full page →

సంస్కరించే సాధనం CDTel 494

(1902) 7T 113,114 CDTel 494.4

812. అనేక స్థలాల్లో వంట పాఠశాలలు స్థాపితమవ్వాలి. ఇవి సామాన్యంగా చిన్నవిగా ప్రారంభం కావచ్చు. కాని ఇతరులికి నేర్పించటానికి ప్రతిభ గల వంటగత్తెలు తమ శక్తి కొలది ప్రయత్నిస్తే ప్రభువు వారికి నిపుణతను అవగాహనను ఇస్తాడు. ప్రభువంటున్నాడు, “వారిని ఆటంకపర్చవద్దు. తమ శిక్షకుడిగా వారికి నన్ను నేను బయలు పర్చుకుంటాను.” తన ప్రణాళికల్ని నెరవేర్చే వారితో ఆయన పనిచేస్తాడు. ఆరోగ్యకరమైన, చౌక అయిన ఆహారపదార్థాల్ని తయారు చేసుకోటం ద్వారా తమ ఆహారంలో దిద్దుబాటు ఎలా సాధించాలో ప్రజలకు ఆయన నేర్పిస్తాడు. ఆరోగ్యసంస్కరణ నియమాల్ని అనుసరించటానికి బీదవారికి ఇలా ప్రోత్సాహం లభిస్తుంది. కష్టపడి పనిచెయ్యటానికి, సొంత కాళ్లమీద నిలబడటానికి వారు సమర్ధులవుతారు. CDTel 494.5

ఆరోగ్యకరమైన ఆహారపదార్థాల్ని రుచికరంగా, ఆమోదయోగ్యంగా తయారు చెయ్యటానికి స్త్రీ పురుషులికి దేవుడు సమర్థతల్ని ఇస్తాడని దేవుడు నాకు బయలు పర్చాడు. వీరిలో పలువురు యువజనులు, కొందరు పరిణత వయస్కులూ ఉంటారు. వైద్యమిషనెరీ సేవ జరుగుతున్న స్థలాల్లో వంట పాఠశాలల నిర్వహణను ప్రోత్సహించాల్సిందిగా నాకు ఉపదేశం వచ్చింది. ప్రజల్ని దిద్దుబాటుకి నడిపించటానికి ప్రతీ ప్రోత్సాహాన్ని ప్రజల ముందు పెట్టాలి. సాధ్యమైనంత వెలుగు వారిమీద ప్రకాశింపజెయ్యాలి. ఆహారం తయారీలో తాము సాధించగల వృద్ధిని సాధించటం వారికి నేర్పించండి. తాము ఏమైతే నేర్చుకుంటారో దాన్ని ఇతరులుకి నేర్పించటానికి వారిని ప్రోత్సహించండి. CDTel 495.1

మన మహా నగరాల్లో దైవ సేవ పురోగతికి మన శక్తిమేరకు మనం కృషి చెయ్యవద్దా? మన పరిసరాల్లో నివసిస్తున్న వేల ప్రజలకు వివిధ రీతుల్లో చేయూత అవసరం. “మీరు లోకమునకు వెలుగైయున్నారు. కొండమీద నుండు పట్టణము మరుగైయుండనేరదు” అని “మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును?” అని యేసు క్రీస్తు ప్రభువు అన్నాడని సువార్త పరిచారకులు గుర్తుంచుకొందురు గాక. మత్త. 5:14, 13. CDTel 495.2