Go to full page →

మిత భోజనం అయినా సముచితాహారం CDTel 508

(1870) 2T 373,374 CDTel 508.5

7. నేను నా శరీరావసరాలు తీర్చటానికి సరిపోయేంత ఆహారం తీసుకుంటాను. కానీ భోజనానికి ముందు ఎంత ఆకలి ఉందో అంత ఆకలితో భోజనం ముగిస్తాను. తర్వాతి పూట నా భాగం భోజనాన్నే తీసుకుంటాను, ఎక్కువ తీసుకోను. భోజనం కమ్మగా ఉన్నందుకు అప్పుడప్పుడు రెండంతలు తింటే తిండిబోతుతనం వల్ల ఒక్క భావాన్ని కూడా ఆలోచించలేని స్థితిలో ఉన్నప్పుడు నా రాత పనిలో సహాయం చెయ్యమని నేను మోకరించి దేవున్ని ఎలా అడగగలను? నా కడుపుమీద ఉన్న ఆ అనుచిత భారాన్ని నివారించమని అడగగలనా? అది ఆయన్ని అగౌరవపర్చటమౌతుంది. నా కామాన్ని హరించమని కోరటమౌతుంది. ఇప్పుడు నేను నాకు మంచిదిగా తోచినంత తింటాను. అప్పుడు తాను నాకిచ్చిన పనిని చెయ్యటానికి శక్తినివ్వమని ఆయన్ని అడగగలుగుతాను. ఈ మనవి చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన విని ఫలం అనుగ్రహించటం నేనెరుగుదును. CDTel 508.6