Go to full page →

ఆహారానికి నైతికతకు సంబంధం పూర్వదినాల్లో నైతిక కాలుష్యం CDTel 55

(1864) Sp. Gifts IV, 121 CDTel 55.9

87. జల ప్రళయానికి ముందు నివసించిన ప్రజలు తమ దురాశ, దుర్నీతి పాత్ర నిండేవరకు జంతువుల మాంసం భుజంచారు. భూమి మీది నైతిక కాలుష్యాన్ని దేవుడు జల ప్రళయంతో క్షాళన చేశాడు.... CDTel 55.10

మానవ పతనం నాటినుంచి పాపం ప్రబలుతుంది. కొందరు దేవునికి నమ్మకంగా నివసిస్తుండగా ఎక్కువమంది ప్రజలు దేవుని ముందు చెడునడత నడుస్తున్నారు. సొదొమ గొమొర్రా ప్రజలు తమ దుర్మార్గత వల్ల నాశనమయ్యారు. వారు తమ ఆహర వాంఛల్ని తుచ్చ శరీర కోర్కెల్ని విచ్చలవిడిగా తృప్తి పర్చుకుంటూ దుర్మార్గంలో అధోగతికి చేరారు. వారి పాపాలు మిక్కిలి హేయమై వారి దుష్టత పాత్ర నిండటంతో పరలోకం నుంచి అగ్ని వచ్చి వారిని దహించి వేసింది. CDTel 55.11

(1873) 3T 163, 164 CDTel 55.12

88. నోవహు దినాల్లో లోకం మీదికి దేవుని కోపాన్ని తెచ్చిన పాపాలే మన దినాల్లోనూ ప్రబలుతున్నాయి. ఇప్పుడు మనుషుల ఆహార పానాలు తిండిపోతుతనం తాగుడు స్థాయికి చేరుకున్నాయి. విస్తరిస్తున్న వక్ర ఆహార వాంఛ తృప్తి అనే పాపం నోవహు దినాల్లో మనుషుల ఉద్రేకాల్ని రెచ్చగొట్టి సామాన్య భ్రష్టత, దుర్నీతికి దారి తీసింది. వారి దౌర్జన్యం నేరాలు పరలోకానికి చేరాయి. భూమికి అంటిన నైతిక కల్మషాన్ని దేవుడు జల ప్రళయంతో శుభ్రపర్చాడు. CDTel 55.13

తిండిబోతుతనం తాగుబోతుతనం అనే ఈ పాపాలే సొదొమ ప్రజల మానసిక శక్తుల్ని మొద్దుబార్చటంతో ఆ పట్టణ ప్రజలకు నేరాలు సంతోషానందాలు సమకూర్చాయి. క్రీస్తు లోకాన్ని ఇలా హెచ్చరిస్తున్నాడు: “లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచి పోయిన దినమున ఆకాశమునుండి అగ్ని గంధకములు కురిసి వారందరిని నాశనము చేసెను. ఆప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.” CDTel 56.1

క్రీస్తు ఇక్కడ మనకోప్రాముఖ్యమైన పాఠం నేర్పుతున్నాడు. తన బోధలో ఆయన సోమరితనాన్ని ప్రోత్సహించటం లేదు. ఆయన ఆదర్శం దీనికి వ్యతిరేకంగా వుంది. క్రీస్తు కష్టపడి పనిచేసిన కార్మికుడు. ఆయన జీవితం ఆత్మోపేక్ష, జాగరూకత, పట్టుదల, పరిశ్రమ, పొదుపుతో కూడిన జీవితం. తినటం తాగటం ప్రధానంగా భావించటంలోని ప్రమాదాన్ని ఆయన మన ముందుంచుతున్నాడు. ఆహార వాంఛను తృప్తి పర్చుకోటం వల్ల కలిగే ఫలితాన్ని వెల్లడి చేస్తున్నాడు. నైతిక శక్తులు బలహీనమై పాపం పాపంగా కనిపించదు. జనులు నేరాన్ని పట్టించుకోరు. తుఛ్చమైన ఉద్రేకాలు మనసును అదుపుచేయటం ఎంతవరకూ పోతుందంటే భ్రష్టత మంచి నియమాల్ని సదుద్దేశాల్ని నిర్మూలిస్తుంది. మనుషులు దేవ దూషణకు దిగుతారు. ఇదంతా మితం లేకుండా తినటం తాగటం వలన చోటుచేసుకునే దుష్ఫలితాలు. తన రెండో రాకడ సమయంలో ఈ పరిస్థితులే వుంటాయని ఆయన వెల్లడి చేశాడు. CDTel 56.2

జనులు ఈ హెచ్చరికను లెక్కచేస్తారా? వెలుగును ప్రేమించి అనుసరిస్తారా? లేక ఆహార వాంఛ కు తుచ్చమైన ఉద్రేకాలకు బానిసలవుతారా? ఏమి తినాలి? ఏమి తాగాలి? ఏమి ధరించాలి? అన్న విషయాల కన్నా మనం ప్రయాసపడాల్సిన ఓ ముఖ్య విషయం క్రీస్తు మన ముందుంచుతున్నాడు. తినటం తాగటం వస్త్రాలు ధరించటం శ్రుతిమించి రాగాన పడి నేరాలై చివరి దినాల పాపాలుగా క్రీస్తు త్వరితాగమన సూచనగా మారుతున్నాయి. సమయం ద్రవ్యం బలం ప్రభువి. వాటిని ఆయన మనకు అప్పగించాడు. ఈ వనరుల్ని వస్త్రాలకు, విలాసవంతమైన, శక్తిని హరించే, బాధను వ్యాధిని తెచ్చే వక్ర తిండికి వ్యర్థం చేయటం జరుగుతుంది. మన పాప శరీరేచ్చల వలన సంభవించే (భ్రష్టత వ్యాధితో నిండినప్పుడు మన శరీరాల్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించటం అసాధ్యం. CDTel 56.3