Go to full page →

నైతిక నియంత్రణకు ఆశనిగ్రహం చేయూత CDTel 60

(1870) 2T 404,405 CDTel 60.2

95. మీ ఆహారం ఉత్తమ రకమైన రక్తాన్ని తయారుచేసేంత సామాన్యత ఆరోగ్యవంతమైన నాణ్యత గలది కాదు. చెడు రక్తం నైతిక, మానసిక శక్తుల్ని మసకబార్చి మీ స్వభావపు తుచ్ఛ ఆవేశాల్ని బలపరుస్తుంది. అవేశం పుట్టించే ఆహారం మీకు మీ మానసిక వ్యవస్థకు మంచిది కాదు. అది మీ శరీరారోగ్యానికి మీ ఆత్మలకు మీ పిల్లల ఆత్మలకు తీవ్రనష్టం కలిగిస్తుంది. జీర్ణావయవాల పై భారం మోపి, పాశవిక ఉద్రేకాల్ని రెచ్చగొట్టి నైతిక, మానసిక శక్తుల్ని బలహీన పర్చే ఆహారాన్ని మీరు మీ భోజన బల్ల పై పెట్టుకుంటున్నారు. వేపుళ్ళు మొదలైన సంపన్న ఆహారం, మాంస పదార్ధాలు మీకు మేలు చెయ్యవు..... CDTel 60.3

మీ గృహాన్ని, మీ హృదయాల్ని చక్కబర్చుకోవాల్సిందిగా క్రీస్తును బట్టి మిమ్మల్ని నేను బతిమాలు తున్నాను. పరలోక సంబంధమైన సత్యం మీ ఆత్మను శరీరాన్ని, స్వభావాన్ని ఉన్నత పర్చి పరిశుద్ధ పర్చనివ్వండి. “ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను” విసర్జించండి. సహోదరుడు జీ నీవు తినే ఆహారం తుచ్చమైన ఆవేశాల్ని బలపర్చే స్వభావం కలది. దేవుని భయంతో పరిశుద్ధతను పరిపూర్తి చేసుకోటానికి నీవు నీ శరీరాన్ని నియంత్రించటం లేదు. అది చెయ్యటం నీ విధి. సహన శీలాన్ని కలిగి నివసించటానికి నీవు ఆహార విషయంలో మితం పాటించటం అవసరం CDTel 61.1

(1876) 4T 35,36 CDTel 61.2

96. లోకం మనకు ప్రామాణికం కాకూడదు. అస్వాభావిక ప్రేరణను బలపర్చి తద్వారా పాశవిక ప్రవృత్తుల్ని పుట్టించి, నైతిక శక్తుల పెరుగుదలను వృద్ధిని కుంటుబర్చే విలాసవంతమైన వంటకాలతో కూడిన భోజనం ఆరగించటం ఫ్యాషన్‌గా మారింది. ఆదాము కుమారులు కుమార్తెలు అన్ని విషయాల్లోనూ ఆశనిగ్రహం పాటించటానికి నడుం బిగించకపోతే క్రైస్తవ పోరాటంలో విజయం సాధించటానికి వారిలో ఎవరికీ ప్రోత్సాహం ఇవ్వటం జరగదు. ఇది గనుక చేస్తే వారు గాలిని కొట్టే మనిషిలా వ్యర్థంగా పోరాడతాడు. క్రైస్తవులు తమ శరీరాల్ని లోబర్చుకుని, ఆరోగ్యానికి జీవితానికి సంబంధించిన చట్టాల్ని ఆచరించటం దేవుని పట్ల తమ పొరుగువారి పట్ల తమ బాధ్యత అని భావిస్తూ తమ తిండిని ఆవేశాల్ని వికాసంగల మనస్సాక్షి అదుపుకింద ఉంచుకుంటే, వారికి శారీరక, మానసిక శక్తి సామర్థ్యాల దీవెన ఉంటుంది. సాతానుకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో పాలుపొందటానికి నైతిక శక్తి వుంటుంది. తమ తరఫున ఆహార వాంఛలు జయించిన ప్రభువు నామంలో వారు స్వయంగా అత్యధిక విజయులు కావచ్చును. పాలు పొందటానికి సమ్మతంగా ఉన్నవారందరికీ ఈ పోరాటం తెరవబడి వుంది. CDTel 61.3

[నైతిక శక్తి పై మాంసాహార ప్రభావం-658,683,684,685,686,687] CDTel 61.4

[గ్రామ, సీమ గృహం-ఆహారానికి నైతికతకు దాని సంబంధం-711] CDTel 61.5

[చిన్నపిల్లలు ఆహారపానాలు యధేచ్చగా తీసుకోటం వల్ల నైతిక శక్తి కొదవ-347] CDTel 61.6

[కోపాన్ని పిరికితనాన్ని పుట్టించే ఆహారపదార్థాలు-556,558,562,574] CDTel 61.7

[యథేచ్ఛగా తినటం నైతిక శక్తుల్ని బలహీన పర్చుతుంది-231] CDTel 61.8