Go to full page →

వెనుతిరగవలసిందిగా పిలుపు CDTel 75

(1890లో రాసింది) E. from U.T. 5,6 CDTel 75.1

113. తన ప్రజల్ని తిరిగి పండ్లు, కూరగాయలు, ధాన్యాలకు తీసుకురావాలని ప్రభువు ఉద్దేశిస్తున్నాడు.... మన మొదటి తల్లిదండ్రులకు సహజ స్థితిలోని పండ్లను దేవుడు ఏర్పాటు చేశాడు. CDTel 75.2

(1902) 7T125, 126 CDTel 75.3

114. దేవుడు తన ప్రజల పక్షంగా పనిచేస్తాడు. వారు వనరులు లేకుండా ఉండాలని ఆయన కోరటం లేదు. ఆదిలో మానవుడికి తానిచ్చిన ఆహారానికే వారిని ఆయన తిరిగి తీసుకువస్తున్నాడు. తాను సమకూర్చిన ఆహార దినుసుల నుంచి వారు తమ ఆహారాన్ని తయారు చేసుకోవాలన్నది ఆయన ఉద్దేశం. ఈ ఆహార పదార్థాల్లో వారు ఉపయోగించవలసినవి పండ్లు, ధాన్యాలు గింజలేగాక వివిధ రకాల దుంపలు కూడా. CDTel 75.4

ఉత్తరం 3,1884 CDTel 75.5

115. దేవుడు తన ప్రజల్ని తన మొదటి ఉద్దేశానికి అనగా చచ్చిన జంతువుల మాంసం తినకూడదన్న తన ఉద్దేశానికి తిరిగి తీసుకు వస్తున్నాడని నేను పదేపదే దర్శనంలో చూశాను. మనం ప్రజలకు మెరుగైన మార్గం బోధించాలని ఆయన కోరుతున్నాడు... CDTel 75.6

మాంసాన్ని విసర్జించి, మాంసంపట్ల రుచిని అభిరుచిని మార్చుకుని, పండ్లు ధాన్యాల వాడకంపట్ల అభిరుచి పెంచుకుంటే, కొద్దికాలంలోనే అది ఆదిలో దేవుడు ఎలా ఉండాలని సంకల్పించాడో అలా ఉంటుంది. ఆయన ప్రజలు మాంసం తినరు. CDTel 75.7

[తొలి ఆహారానికి తిరిగి వచ్చిన ఇశ్రాయేలు-644] CDTel 75.8

[ఇశ్రాయేలు ఆహారాన్ని నియంత్రించటంలో దేవుని ఉద్దేశం-641,643,644] CDTel 75.9