Go to full page →

సామాన్య జీవనానికి ప్రోత్సాహకాలు CDTel 77

దేవునికి పరిపూర్ణమైన సేవ చెయ్యటానికి ఆయన న్యాయ విధుల్ని గురించి మీకు స్పష్టమైన అభిప్రాయం ఉండాలి. సున్నితమైన మెదడు నరాలు బలహీనమై, చచ్చుపడి, స్తంభించిపోయి తద్వారా పరిశుద్ధ విషయాన్ని గుర్తించటం, క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్తాన్ని, క్రీస్తు చిందించిన అమూల్యమైన రక్తాన్ని గుర్తించ కుండటం జరగ కుండేందుకు, అతిసామాన్యంగా తయారు చేసిన మిక్కిలి సామాన్యాహారాన్ని మీరు తీసుకోవాలి. “పందెపు రంగమందు పరిగెతు వారందరును పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరచుకొనుచున్నాను.” CDTel 77.1

తాము ఆశించిన దాని ఫలంగా మనుషులు ఓ పూలమాలను లేదా క్షయమైన కిరీటాన్ని ఆకాంక్షించి తమను తాము లోపరచుకుని అన్ని విషయాల్లో మితంగా ఉంటే అనంత మహిమా కిరీటమేగాక, యెహోవా సింహాసనం ఎంత స్థిరమైందో అంత శాశ్వతమైన జీవితాన్ని, నిత్య భాగ్యాన్ని అక్షయ ఘనతను, నిత్యమహిమను అన్వేషిస్తున్నట్లు చెప్పుకునేవారు మరెంత గొప్ప ఆత్మత్యాగం చెయ్యటానికి సంసిద్ధంగా ఉండాలి? CDTel 77.2

క్రైస్తవ పందెంలో పరుగెత్తుతున్నవారి ముందున్న ప్రోత్సహకాలు, తమ పాశవిక ప్రవృత్తులు, ఆహారవాంఛ, శరీరేచ్చల్ని అదుపులో ఉంచుకునేందుకు అన్ని విషయాల్లోనూ, తమను తాము ఉపేక్షించుకుని మితంగా ఉండటానికి వారిని నడిపించవా? అప్పుడు వారు దురాశను అనుసరించటం వలన లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకుని దేవస్వభావంలో పాలివారవుతారు. CDTel 78.1