(1900) T 6372 CDTel 7.3
12. ఆరోగ్యం విషయం భోగట్టా చేసినప్పుడు వ్యక్తులు తరచు “క్రితంలోకన్న మాకు ఎక్కువ తెలుసు” అని స్పందిస్తారు. తమ శారీరక సంక్షేమానికి తాము దేవునికి జవాబుదారులమని, ప్రతీ అలవాటు దేవుని తనిఖీకి బట్టబయలేనని గుర్తించరు. శారీరక జీవితాన్ని ప్రమాదవశాత్తు వచ్చిన దానిగా పరిగణించకూడదు. దేహంలోని ప్రతీ అంగాన్ని, ప్రతీ నరాన్నీ దురభ్యాసాలనుంచి కాపాడుకోవాలి. CDTel 7.4