Go to full page →

పౌష్టికాహారం అన్ని దేశాల్లో నూ లభిస్తుంది CDTel 90

ఉత్తరం 135,1902 CDTel 90.7

145. మన ఆహారాన్ని సరళీకరించుకోటంలో ముందడుగు వేద్దాం. దేవుని కృపవల్ల, శరీర వ్యవస్థ నిర్మాణానికి అవసరమైన పౌష్టికాహార పదార్థాల్ని ప్రతీ దేశం ఉత్పత్తి చేస్తుంది. వీటిని ఆరోగ్యదాయకమైన, రుచికరమైన వంటకాలుగా తయారుచేసుకోవచ్చు. CDTel 90.8

(1905) M.H.299 CDTel 90.9

146. మనం తెలివిగా ప్రణాళిక తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఏది మిక్కిలి దోహదకరంగా ఉంటుందో దాన్ని దాదాపు ప్రతీ దేశంలోను సంపాదించవచ్చు. వరి, గోధుమ, కార్న్, ఓట్స్ వంటి తృణ ధాన్యాలు బీన్స్, పీస్, అపరాలతో తయారుచేసిన పదార్థాలు విదేశాలనుంచి రవాణా అవుతున్నాయి. ఇవీ ఇంకా స్వస్థలంలో లభించే లేక దిగుమతి అయ్యే పండ్లు, ప్రతీ స్థలంలో పెరిగే రకరకాల కూరగాయలు మాంసం వంటకాలతో నిమిత్తం లేకుండా సంపూర్ణ ఆహార ఎంపికకు అవకాశం ఇస్తాయి.... ఎండబెట్టిన ద్రాక్ష, ఫ్లమ్స్. ఏపిల్సు, పేర్స్, పీచెస్, ఏప్రికాట్స్ వంటి పండ్లు ఎక్కడ లభ్యమౌతాయో అక్కడ అవి ప్రధాన ఆహార వస్తువులుగా కొంచెం ఎక్కువగా వినియోగించుకోటం జరుగుతుంది. ఈ ఆహారం అన్ని వర్గాల శ్రమ జీవులికి ఆరోగ్యాన్ని శక్తిని సమకూర్చుతుంది. CDTel 90.10