Go to full page →

స్వచ్ఛమైన గాలి సహాయం CDTel 99

(1868) 1T 702 CDTel 99.7

159. శరీరమంతటా ఆరోగ్యవంతంగా రక్తం ప్రసరించేటట్లు చెయ్యటానికి స్వచ్చమైన, నిర్మలమైన గాలి ప్రభావం అవసరం. గాలి శరీరానికి తాజా తనాన్ని ఇస్తుంది. దాన్ని బలపర్చి ఆరోగ్యవంతం చేస్తుంది. అదేసమయంలో దాని ప్రభావం మనసు పై పడి మనసుకు నెమ్మదిని ప్రశాంతతను ఇస్తుంది. ఆకలి పుట్టించి, ఆహారం సంపూర్ణంగా జీర్ణమవ్వటానికి తోడ్పడి, ప్రశాంతమైన నిద్ర పుట్టిస్తుంది. CDTel 99.8

(1905) M.H. 272,273 CDTel 99.9

160. ఊపిరితిత్తులికి సాధ్యమైనంత స్వేచ్ఛ ఉండాలి. స్వేఛ్చా చర్యవల్ల వాటి సామర్థ్యం వృద్ధి అవుతుంది. ఊపిరితిత్తులు ఇరుకై కుంచించుకుపోతే వాటి సామర్థ్యం క్షీణిస్తుంది. కనుక ముఖ్యంగా ఆఫీసుల్లో బల్లల మీదకు వంగి చేసే పనుల్లో ఈ దుష్ఫలితాలు సామాన్యంగా కనిపిస్తాయి. ఈ స్థితిలో దీర్ఘంగా గాలిపీల్చుకోటం అసాధ్యమౌతుంది. త్వరలో లోతులేని శ్వాసక్రియ అలవాటుగా మారుతుంది. ఊపిరితిత్తులు వ్యాకోచించే శక్తిని పోగొట్టుకుంటాయి. బిగువుగా కట్టుకట్టడంవల్ల కూడా ఇలాంటి దుష్పలితాలే సంభవిస్తాయి.... CDTel 99.10

ఇలా చాలినంత ప్రాణవాయువు సరఫరా జరగదు. రక్తం మందకొడిగా ప్రవహిస్తుంది. ఊపిరితిత్తులు శ్వాసవిడిచేటప్పుడు నెట్టివేయబడాల్సిన వ్యర్థ పదార్థాలు, విషపదార్థాలు అలాగే ఉండి పోటంతో రక్తం మలినమౌతుంది. ఊపిరితిత్తులేకాదు అన్నకోశం, కాలేయం, మెదడు కూడా ప్రభావిత మౌతాయి. చర్మం పసుపురంగులో ఉంటుంది. జీర్ణక్రియ మందగిల్లుతుంది. నిరుత్సాహం మనసును నింపుతుంది. మెదడు మసకబారుతుంది. తలంపులు అస్తవ్యస్తమౌతాయి. విచారం అలము కుంటుంది. శరీర వ్యవస్థ మొత్తం నిస్పృహకు గురిఅయి, క్రియాశూన్యమై, వ్యాధి బారిన పడుతుంది. CDTel 99.11