Go to full page →

చల్లని ఆహారం జీవశక్తిని ఖర్చుచేస్తుంది CDTel 101

(1905) M.H. 305 CDTel 101.6

165. ఆహారాన్ని ఎక్కువ వేడిగా గానీ, ఎక్కువ చల్లగా గానీ తినకూడదు. ఆహారం చల్లగా ఉంటే జీర్ణక్రియ చోటుచేసుకోక ముందు దాన్ని వెచ్చగా చెయ్యటానికి అన్నకోశంలోని జీవశక్తి ఉపయుక్తమౌతుంది. చల్లని పానీయాలు ఇందుమూలంగానే హానికరం. ఇకపోతే వేడిపానీయాలు మనిషిని బలహీనపర్చుతాయి. CDTel 101.7

ఎక్కువ చల్లని ఆహారాన్ని అన్నకోశంలో వెచ్చగా చెయ్యటానికి జీవశక్తి వినియోగమతుంది-124] CDTel 102.1

[C.T.B.H.51] (1890) C.H.119,120 CDTel 102.2

166.అనేకమంది భోజనంతో చల్లని నీళ్లు తాగుతారు. అది తప్పు. ఆహారాన్ని కిందికి కడగకూడదు. ఆహారంతో తాగే నీళ్లు లాలాజల స్రావాన్ని తగ్గిస్తాయి. నీళ్ళు ఎంత చల్లగా ఉంటే అన్నకోశానికి అంత ఎక్కువ హాని జరుగుతుంది. ఐసు నీళ్లు లేదా ఐసు లెమనేడ్ ఆహారంతో తీసుకుంటే, అన్నకోశం జీర్ణక్రియను చేపట్టటానికి అగత్యమైన వెచ్చదనాన్ని శరీర వ్యవస్థ దానికి సమకూర్చి ఆ క్రియను అది చేపట్టేవరకు జీర్ణక్రియ నిలిచిపోతుంది. ఆహారం లాలాజలంతో కలిసేందుకు దాన్ని నిదానంగా, నమలాలి. CDTel 102.3

ఆహారంతో ఎంత ఎక్కువ ద్రవపదార్థం కడుపులోకి తీసుకుంటే ఆహారం జీర్ణమవ్వటం అంత కష్టమౌతుంది. ఎందుకంటే ద్రవపదార్థం ముందు విలీనం కావాలి. CDTel 102.4

[భోజనంతో నీళ్ళు తాగటం-731) CDTel 102.5