Go to full page →

చివరి దినాల్లో COLTel 223

ఈ ధనవంతుడి చరిత్ర లోక చరిత్ర చివరి దృశ్యాల ముగింపు భాగాల్ని వివరిస్తున్నది. ఈ ధనవంతుడు తాను అబ్రాహము బిడ్డనన్నాడు. అయినా అబ్రాహాముకి అతడికి మధ్య దాటలేని అగాధం ఉంది. తప్పు మార్గంలో వృద్ధి చెందిన ప్రవర్తన. అబ్రాహాము దేవుని వాక్యాన్ని విశ్వాసంతో ఆచరిస్తూ దేవుని సేవ చేసాడు. ఈ ధనవంతుడైతే దేవున్ని మర్చిపోయాడు. బాధిత, పీడిత మానవాళి అవసరల్ని విస్మరించాడు. అబ్రాహాముకి అతడికి మధ్య ఉన్న అగాధం అవిధేయతా అగాధం. అనేకులు నేడు అదే మార్గాన్ని అవలంభిస్తున్నారు. సంస్తులైనా వారికి మారుమనసు లేదు. వారు సంఘ రాధనలో పాలు పంచుకోవచ్చు. “దుప్పి నీటవాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది” (కీర్త 42:1) అంటూ వారు పాడవచ్చు. కాని వారిది అబద్ద సాక్ష్యం. దేవుని దృష్టిలో వారు ఘోర పాపికన్నా ఎక్కువ నీతిమంతులు కారు. లోక భాగోలతో తుళ్ళిపడటానికి తహతహలాడే ఆత్మ. ఆడంబారిన్న ప్రదర్శనను ప్రేమించే మనసు దేవున్ని సేవించలేదు. COLTel 223.2

ఉపమానంలోని ధనవంతుడిలాగ శరీరాశకు వ్యతిరేకంగా పోరాడ టానకి అతడికి ఇష్టముండదు. రుచిగల భోజనం తినాలని ఆశిస్తాడు. పాప వాతావరణాన్ని ఎంపిక చేసుకుంటాడు. అతడు హఠాత్తుగా మరణిస్తాడు. జీవితకాంమంతా సాతాను దూతల భాగస్వామ్యంతో పనిచేసిన కాలంలో ఏర్పడ్డ ప్రవర్తనతో అతడు సమాధిలోకి వెళ్తాడు. సమాధిలో అతడ దేన్ని ఎంపిక చేసుకోలేడు. అది మంచిదేగాని చెడ్డదే గాని మనషుడు మరణించినవాడే అతడి తలంపులు నశిస్తాయి. (కీర్తనలు) 146:4, ప్రసంగి 9:5,6) COLTel 223.3

నేడు మన ప్రపంచం స్వనీతిపరులైన ఒక తరగతి ప్రజలున్నారు. వారు తిండిబోతులు, తాగుబోతులు, నాస్తికులు కారు.కాని తమకోసమే నివసంచే స్వార్ధపరులు, దేవుని కోసం నివసించరు. వారి తలంపుల్లో ఆయన ఉండడం కాబట్టి వారు అవిశ్వాసుల తరగతికి చెందుతారు. వారు దేవుని పట్టణ గుమ్మాలు దాటటం సాధ్యపడితే వారికి జీవవృక్ష ఫలలు పొందటానికి హక్కుండదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞల్ని వాటి నిర్బంధ విధుల్ని తమ ముందు పెట్టినప్పుడు వారు వాటిని నిరాకరించారు. కనుక వారు ఆయనకి ఇక నుంచి సేవ చెయ్యరు. ఆయన సముఖంలో వారు నివసించలేరు. వారికి పరలోకం ససేమిరా నచ్చదు. ఇంకోచోట ఉండాలని కోరుకుంటారు. COLTel 224.1

క్రీస్తుని గూర్చి నేర్చుకోటమంటే ఆయన కృపను అందుకోవటం ఆయన కృప అంటే ఆయన ప్రవర్తన. అయితే లోకంలో తమకు అనుగ్రహించబడిన విలువైన తరుణాల్ని, పవిత్ర ప్రభవాల్ని అభినందించి వినియోగించుకోని వారు పరలోక అభివృద్ధిలో పాలు పొందానికి పాత్రులు కారు. వారి ప్రవర్తనలు దేవుని మాదిరి ప్రకారం నిర్మితం కాలేదు. తమ ఆశ్రద్ధ వలన వారు కలపలేని ఒక అగతాధాన్ని సృష్టించుకుంటారు. వారికి నీతిమంతులికి మధ్య గొప్ప ఆగాధం ఏర్పడింది. COLTel 224.2