Go to full page →

25—తలాంతులు COLTel 273

ఆధారం : మత్తయి 25:13-30

తన రెండో రాకడ గురించి క్రీస్తు తన శిష్యులతో ఒలీవల కొండ మీద మాట్లాడాడు. తన రాకడ సామీప్యాన్ని సూచించే కొన్ని సూచనల్ని పేర్కొని, మెలకవగా ఉండి కని పెట్టవలసిందిగా, క్రీస్తు తన శిష్యుల్ని కోరాడు. మళ్ళీ ఆయన ఇలా హెచ్చరించాడు. “ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.”అప్పుడు తన రాకకు కనిపెట్టమంటే ఏమిటో ఆయన వివరించాడు. వేచి ఉండటంలో కాదు జాగ్రత్తగా పని చెయ్యటంలో ఆ సమాయాన్ని గడపాల్సి ఉంది. ఈ పాఠాల్ని తలాంతుల ఉపమానం ద్వారా బోధించాడు. COLTel 273.1

ఆయన అన్నాడు.“పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతర మునకు ప్రయాణమైన తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్పగించి నట్లుండును అతడు ఒకనికి అయిదు తలంతులను ఒకనికి రెండు,ఒకనికి ఒక టియు, ఎవని సామర్ధ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను”. దూరదేశానికి ప్రయాణమై వెళ్తున్న మనుషుడు క్రీస్తుని సూచిస్తున్నాడు. ఈ ఉపమానాన్ని చెప్పిన సమయంలో ఆయన త్వరలో లోకం నుంచి పరలోకానికి వెళ్ళనై ఉన్నాడు. ఉపమానంలోకి “వెట్టి పనివాడు” (ఆర్.వి.) లేక దాసుడు క్రీస్తు ఆనుచరుల్ని సూచిస్తున్నాడు. మనం మన సొంతం కాదు. “జీవించువారిక మీదట తమ కొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరగి లేచిన వాని కొరకే జీవించుటకు” (2 క ఒరి 5:15) మనం “విలువ పెట్టి కొనబడిన” వారం (1 కొరి 6:20) “వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత” కాక నిర్దోషమును నిష్కంళకమునగు .... క్రీస్తు రక్తముచేత” కొనబడ్డవారం. COLTel 273.2

మనుషులందరిని ఈ గొప్ప మూల్యంతో కొనటం జరిగింది. పరలోక ధనాగారాన్ని ఈ లోకంలోకి దిమ్మరించటం ద్వారా క్రీస్తుతో పరలోకమం తటిని మన కోసం ధారాపొయ్యటం ద్వారా ప్రతీ మానవుడి చిత్తాన్ని, అనురాగాల్ని మనసును, ఆత్మను, దేవుడు కొన్నాడు. విశ్వాసులేకాని విశ్వాసులు కాని వారే కాని అందరూ దేవుని సొత్తు. అందరూ ఆయన సేవకు పిలుపొందుతున్నారు. ఈ పిలుపుకి తాము స్పందించే తీరుకు ఆ మహా తీర్పుదినాన అందరూ లెక్క అప్పజెప్పాల్సి ఉన్నారు. COLTel 273.3

అయితే దేవుని హక్కుల్ని ఎవరూ గుర్తించటం లేదు. క్రీస్తు సేవను అంగీకరించినట్లు చెప్పుకుంటున్న వార్నే ఉపమానంలో ఆయన దాసులుగా సూచించటం జరిగింది. క్రీస్తు అనుచరులు సేవకోసం విమోచించబడతారు. జీవిత పరమావధి సేవ అని మన ప్రభువు బోధిస్తున్నాడు. క్రీస్తు తానే పనివాడు. తన అనుచరులందరికి ఆయన సేవానియామాన్నిస్తున్నాడు. దేవునికి మానవుడికి సేవ చెయ్యటం. క్రీస్తు ఇక్కడ జీవితాన్నే గూర్చి లోకం ఎన్నడూ ఎరుగని ఉన్నతాభిప్రాయాన్ని లోకానికి సమర్పిస్తున్నాడు. ఇతరులికి సేవ చెయ్యటానికి నివసించటం ద్వారా మానవుడుకి క్రీస్తుతో అనుసంధానం ఏర్పడుతుంది. సేవానియం మనల్ని దేవునితోను సాటి మనుషులతోను జతపర్చే లింకు అవుతుంది. COLTel 274.1

క్రీస్తు “తన ఆస్తిని” అప్పగిస్తున్నాడు. అది ఆయన కొరకు వినియోగించే నిమిత్తం ఇచ్చింది. ఆయన “ప్రతివానికి వాని వాని పని” నియమిస్తాడు. దేవుని నిత్య ప్రణాళికలో ప్రతి వారికి వారి వారి స్థానం ఉంటుంది. మానవాత్మల రక్షణలో ప్రతీవారు క్రీస్తుతో సహకరించి పనిచెయ్యాలి. మనం నివసించటానికి దేవుడు పరలోక భవానల్లో ఎంత నిశ్చయంగా స్థానాలు ఏర్పాటు చేశాడో అంతే నిశ్చయంగా తన కోసం పని చెయ్యటానికి భూమి పై మనకోస్థానాన్ని ఆయన ఏర్పాటు చేసాడు. COLTel 274.2