Go to full page →

ద్రవ్యం COLTel 299

దేవుడు మనుషులికి ద్రవ్యం కూడా అప్పగిస్తాడు. ధనం సంపాదించటానికి శక్తి సామర్ధ్యాలిస్తాడు. భూమిని మంచుతోను సేద తీర్చే వర్షధారాలతోను తడుపుతాడు. భూమికి వేడినిచ్చే సూర్యరిశ్ళి నిస్తాడు. అది ప్రకృతిని మేల్కొల్పి దానిని సమస్తం వృద్ధి చెంది ఫలాలు ఫలించేటట్లు చేస్తుంది. తనది కొంత తనకు తిరిగి ఇవ్వమని ఆయన అడుగుతున్నాడు. COLTel 299.1

మనల్ని మనం ఘనపర్చుకొని అతిశయించేందుకు కాదు మనకు దేవుడు ధనమిచ్చేది. ఆయనకు నమ్మకమైన గృహనిర్వాహకులుగా ఆయన ఘనత మహిమలకోసం దాన్ని మనం వినియోగించాల్సి ఉన్నాం. తమ ఆదాయంలో కొంత భాగం మాత్రమే దేవునిదని కొందరి భావన. COLTel 299.2

మత కార్యక్రమాలికి ధార్మిక కార్యాలికి కొంత భాగం కేటాయించి నపుడు మిగిలింది. తమ ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకోవ చ్చునని వారు తలస్తారు. కాని ఇందులో వారు పొరబడుతున్నారు. మనకున్నదాన్ని ప్రభువుదే. మనకున్నదాన్ని మనం ఎలా వినియోగిస్తున్నా మన్న దానికి మనం దేవునికి జవాబుదారులం. ప్రతీ పైసాను వినియో గించటంలో మనం దేవున్ని సర్వోన్నతంగా ప్రేమిస్తున్నామో లేదో వెల్లడవుతుంది. డబ్బు వలన గొప్ప మేలు జరగగలదు గనుక దానికి గొప్ప విలువ ఉంది. దేవుని పిల్లల చేతుల్లో అది ఆకలిగా ఉన్నవారికి ఆహారం, దప్పికతో తప్పిస్తున్న వారికి నీళ్ళు, బట్టలు లేనివారికి బలు. అది హింస అనుభవిస్తున్న వారకి రక్షణ, వ్యాధిగ్రస్తులికి మందులు సహాయం, జీవితావసర వస్తువులు సరఫరా చెయ్యటంలో ఇతరులికి మేలు చేయ్యటంలో క్రీస్తు పరిచర్యను వృద్ధిచెయ్యటంలో వినయోగినమైప్పుడు మాత్రమే డబ్బుకి విలువ ఉంది. లేకపోతే దానికి ఇసుకకన్నా ఎక్కువ విలువ ఉండదు. COLTel 299.3

దాని ఉంచిన ధనం నిరూపయోగమే కాదు శాపం కూడ. ఈ జీవితంలో అది ఆత్మకు ఉచ్చువంటిది. అది అభిమానాన్ని ఆసక్తుల్ని పరలోకం ధనం నుంచి పక్కకు ఆకర్షిస్తుంది. ఉయోగించని తలాంతులు, నిర్లక్ష్యం చేసిన అవకాశాల్ని గురించిన దాని సాక్ష్యం ఆ గొప్ప తీర్పునాడు దాని సొంతదారుణ్ణి అపరాధిగా ప్రకటిస్తుంది. లేఖనం ఇలా హెచ్చరిస్తుంది. “ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చెడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి యేడువుడి.మీ ధనము చెడిపోయెను.మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అన్నవలె మీ శరీరములను తిని వేయును.అంత్య దినములయందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగబట్టిన కూలి మొట్ట పెట్టుచున్నది. మీ కోసత వారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి”.యాకో 5:1-4 COLTel 299.4

ద్రవ్యాన్ని అమితంగా లేక అజాగ్రత్తగా వ్యయం చెయ్యటాన్ని దేవుడు ఆమోదించడు. పొదుపు విషయంలో తన అనుచరులందరికి ఆయన హితువు ఇది, “ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడి” (యెహా 6:12) తన డబ్బును దేవుడిచ్చిన తలాంతుగా గుర్తించే వ్యక్తి దాన్ని పొదుపుగా ఉపయోగిస్తూ ఇతరులకు ఇచ్చేందుకు దాన్ని అదా చేస్తాడు. COLTel 300.1

ప్రదర్శనకు స్వార్ధ కోరికలకు ఎంత డబ్బు వ్యయం చేస్తే ఆకలిగి ఉన్నవారికి భోజనం పెట్టటానికి, బట్టలు లేనివారికి బట్టలివ్వటానికి అంత తక్కువ డబ్బు మన వద్ద ఉంటుంది. అనవసరంగా ఖర్చు చేఉసే ప్రతీ పైసా మేలు చెయ్యటానికి ఉన్న విలువైన అవకాశాన్ని ఖర్చు చేసే ఆ వ్యక్తికి లేకుండా చేస్తుంది. దేవుడు అప్పగించిన తలాంతుల్ని అభివృద్ధి పర్చటం ద్వారా ఆయనకు చెందాల్సిన ఘనతను మహిమను ఆయనకు చెందకుండా దోచుకోటమౌతుంది. COLTel 300.2