Go to full page →

ధనం కోసం అన్వేషణ COLTel 79

మనం దైవ వాక్యాన్ని అధ్యయనం చెయ్యాలి. బైబిల్ లో ఉన్న సత్యాలపై మన పిల్లల్ని చైతన్యపర్చాలి. అది తరగని ధన నిధి. అది తమకు దొరికే వరకు అన్వేషించరు. గనుక మనుషులు ఈ ధనాన్ని కనుగొనటంతో పరాజయం పొందుతున్నారు. అనేకులు సత్యం విషయంలో ఊహాగానాలతో తృప్తి చెందుతున్నారు. వారు పై పనితోనే తృప్తి చెంది తమకు అవసరమైందంతా ఉన్నదని భావిస్తారు. వాక్యంలో దాచబడ్డ ధనం కోసం తవ్వటం సూచిస్తున్న రీతిగా, శ్రద్దగా నమ్మకంగా శ్రమ చెయ్యటానికి బద్దకించి వారు ఇతరుల సూక్తుల్ని సత్యంగా స్వీకరిస్తారు. అయితే మానవుడి ఆవిష్కరణలు విశ్వసనీయుత లేనివే కాదు ప్రమాదకరమైనవి కూడా. ఎందుచేతనంటే అవి మానవుణ్ణి దేవుడుండాల్సిన స్థానంలో పెడుతున్నాయి. మనుషుల మాటల్ని “అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.’ స్థానంలో ఉంచుతున్నాయి. COLTel 79.1

క్రీస్తే సత్యం ఆయన మాటలు సత్యం. పైకి కనిపించే అర్ధంకన్నా వీటికి లోతైన భావం ఉంది. క్రీస్తు మాటలన్నింటికి అవి సామాన్యంగా కనిపించేదానికి మించిన విలువ ఉన్నది. పరిశుద్దాత్మ చైతన్యం పొందిన మనస్సున్నట్లయితే ఈ మాటల విలువను గ్రహిస్తాయి. ఈ సత్యముత్యాలు దాచబడ్డధనం అయినా వారు దాన్ని గ్రహిస్తారు. అనునది సిద్దాంతాలూ ఊహా కల్పనలు దైవ వాక్యాన్ని అవగాహన చేసుకోవడానికి నడిపించవు. తమకు తత్వజ్ఞానం ఉందని భావించే వారు జ్ఞాన,ధన రహస్యాల్ని విప్ప టానికి,సంఘంలోకి సిద్ధాంత వ్యతిరేక ప్రవేశించకుండా అడ్డుకట్ట వెయ్య టానికి తమ వివరణలు అవసరమని భావిస్తారు. తమకు సమస్యాత్మాక లేఖనాలుగా కనిపించిన లేఖనాల్ని విశదం చెయ్యటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. కాని వారు ఏది విశదం చెయ్యటానికి ప్రయత్నిస్తారో దాని తరుచు మరింత అస్పష్టం అస్తవ్యస్థం చేస్తారు. COLTel 79.2

యాజకులు పరిసయ్యులు దైవ వాక్యానికి తమ సొంత భాష్యం చెప్పడం ద్వారా ఉపదేశకులుగా గొప్ప కార్యాలు చేస్తున్నట్లుగా భావించారు. అయితే వారినుద్దేశించి “మీరు లేఖనములను గాని, దేవుని శక్తిని గాని యెరుగక పోవుట వలననే పొరపబడుచున్నారు” అని క్రీస్తు అన్నాడు. మార్కు 12:24 వారు “మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు” చున్నారని నేరారోపణ చేశాడు. మార్కు 7:7 దైవ వాక్యోపదేశకులైన దైవవాక్యాన్ని అవగాహన చేసుకోవలసియున్న వారు వాక్యానుసారంగా నివసించలేదు. దాని వాస్తవిక భావాన్ని చూడకుండా సాతాను వారికి అంధత్వ కలిగించాడు. COLTel 80.1

నేడు అనేకుల పని ఇదే. అనేక సంఘాలు ఈ పాపానికి పాల్పడు తున్నాయి.నేడు జ్ఞానులు చెలామణిఔతున్న మనుష్యులు యూదు బోధకుల దోషాలనే పునరావృతం చేసే ప్రమాదం ఉంది. వారు దైవ లేఖనాలికి తప్పుడు భాష్యం చెప్పుతారు. దేవుని సత్యం గురించి వారి దుర్భావాన కారణంగా ఆత్మలు గందరగోళంలోపడి చీకటిలో కొట్టుమిట్టాడున్నాయి. లేఖనాల్ని సంప్రదాయపు అస్పష్టమైన వెలుగులోనో లేక మానవ ఊహగాన కాంతిలోనో పఠించాల్సిన అవసరం లేదు. మానవ సంప్రదాయం లేక ఊహాగానం సహాయతో లేఖనాల్ని విశదం చేయటం సూర్యుణ్ణి దివిటీతో వెలిగించటానికి ప్రయత్నించటంలాగ ఉంటుంది. దేవుని పరిశుద్ద వాక్య మహిమల్ని ప్రత్యేకంగా వేర్పాటుగా చూపించటానికి మినుకు మినుకుమనే లోకం సంబంధపు దివిటీ అవసరంలేదు. వాక్యమే స్వతసిద్ధమైన వెలుగు. అది ప్రకటితమైన దైవ మహిమ. దాని సరసన ప్రతీ ఇతర వెలుగూ కాంతిహీనమౌతుంది. COLTel 80.2

అయితే పట్టుదల గల అధ్యయనం, పరిశోధన అవసరం. సత్యం తాలూకు నిశితమైన స్పష్టమైన అవగాహన సోమరితనంగా ఆషామాషీగా కృసి చేయటం వల్ల లభించదు. ఓర్పుతో పట్టుదలతో కృషి సల్పకుడా ఐహికమైన ఏ ఉపకారమూ లభించదు. మనుషులు వ్యాపారంలో రాణించాలంటే, సాధించాలన్న పట్టుదల ఫలితాల కోసం ఎదరు చూస్తూ విశ్వాసం ఉండాలి. చిత్తశుద్ధితో కూడిన శ్రమ లేకుండా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించటానికి ఎదురు చూడలేం. సత్యసిరులను కనుక్కోవాలని ఆశించేవారు గాని కార్మికుడు భూమిలో దాగిన ఖనిజ సంపదకోసం తవ్వేటట్లు సత్యం కోసం తవ్వాలి. అరకొర, ఉదాసీన కృషి నిరర్థకం. పెద్దలు పిన్నలు దైవ వాక్యాన్ని పఠించటమే కాదు, దాన్ని పూర్ణ హృదయంతో అధ్యయనం చేయటం సత్యం గురించి ప్రార్ధన చేసి దాచబడ్డ ధనం కోసం వెదకేటట్లు సత్యం కోసం వెదకటం అవసరం. ఇది చేసేవారు ప్రతిఫలం పొందుతారు. క్రీస్తు వారి అవగాహనను చైతన్యపర్చుతారు. COLTel 81.1

లేఖనాల్లో ఉన్న సత్యాన్ని గూర్చి మన జ్ఞానం పై రక్షణ ఆధారపడి ఉంది. మన ఈ జ్ఞానాన్ని కలిగి ఉండాలన్నది దేవుని చిత్తం. ఆకలిగొన్న హృదయాలతో పరిశుద్ద, ప్రశస్త బైబిలుని పరిశోధించండి. మరల మరల పరిశోధించండి గని కార్మికుడు బంగారం కోసం భూగర్భాన్ని పరిశోధించే రీతిగా దైవ వాక్యాన్ని పరిశోధించండి. మీ విషయంలో ఆయన చిత్తాన్ని తెలుసుకునే వరకు మీ పరిశోధనను విరమించుకోకండి. క్రీస్తు ఇలా అన్నాడు.“మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచుబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.” యోహా 14:13, 14. COLTel 81.2

భక్తిపరులు ప్రతిభావంతులు అయిన మనుష్యులు నిత్య సత్యాల్ని చూస్తారు. కాని తరుచు వాటిని అవగాహన చేసుకోరు. ఎందుచేతనంటే దృశ్యమైనవి అదృశ్యమైనవాటి మహిమను కప్పివేస్తాయి. దాచబడ్డ ధనం కోసం విజయవంతంగా అన్వేషించగోరే వ్యక్త ఈ లోక విషయాలకన్నా ఉ న్నత విషయాల్ని అనుసరించటానికి పైకి లేవాలి. అతడి అనురాగాలు అతడి సమర్ధతలు సమస్తం ఈ అన్వేషణకు అంకితమివ్వాలి. COLTel 81.3

లేఖనాల నుంచి పొంచి ఉండగల విస్తారమైన జ్ఞానానికి అవిధేయత ద్వారా మూసివేస్తుంది. మనుషుల రాగద్వేషాలకు ఈర్ష్యి అసూయాలకు లేఖనాల్ని మలుచుకోకూడదు. ఎవరు సత్యాన్ని ఆచరించేందుకు సత్య జ్ఞానం కోసం వినయంగా అన్వేషిస్తారో వారే లేఖనాల్ని అవగాహన చేసుకోగలుగుతారు. COLTel 82.1

రక్షణ పొందటానికి నేనేమి చెయ్యాలి? అని మీరు అడుగుతున్నారా? మీరు మీ పూర్వ నిశ్చితాభిప్రాయాల్ని మీ అనువంశిక అభిప్రాయాల్ని పెరుగుదలలో నేర్చుకున్న అభిప్రాయాల్ని విడిచి పెట్టి పరిశోధించాలి. మీ సొంత అభిప్రాయాల్ని సమర్ధించుకోవటానికి మీరు లేఖనాల్ని పరిశోధిస్తుంటే సత్యాన్ని కనుక్కోలేరు. ప్రభువు ఏమి చెబుతున్నాడో తెలుసుకోవడానికి పరిశోధించండి. లేఖన పరిశోధన చేసే తరుణంలో ధృడనమ్మకం కలిగితే మీకు ప్రియమైన అభిప్రాయాలు లేఖనాలకు అనుగుణంగా లేనట్లు మీరు తెలుసుకుంటే మీ నమ్మకాలతో ఏకీభవించే విధంగా లేఖనాలికి భాష్యం చెప్పక వచ్చిన వెలుగును అంగీకరించండి, దేవుని వాక్యం నుంచి అద్భుత విషయాలు చూసేందుకు మనసును హృదయాన్ని తెరవండి. COLTel 82.2

లోక విమోచకుడుగా క్రీస్తు పై విశ్వాసం పరలోక ఐశ్వర్యాన్ని గ్రహించి అభినందించగల హృదయం అదుపులో ఉండే ప్రతిభ గుర్తింపును కోరుతుంది. ఈ విశ్వాసాన్ని పశ్చాత్తాపం నుంచి ప్రవర్తన పరివర్తన నుంచి వీడదియ్యలేం. విశ్వాసం కలిగి ఉండటమంటే సువార్త ధనాన్ని కనుక్కొని దాని విధులన్నిటితోను దాన్ని అంగీకరించడం. COLTel 82.3

“ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను”. యోహా 3:3 అతడు ఊహించుకోవచ్చు ఆలోచన చేయవచ్చు. విశ్వాసనేత్రం లేకుండా ఆధ్మాత్మిక ధనాన్ని చూడలేడు. ఊహకు అంచనాకు అతీతమైన ఈ ధనాన్ని మనకివ్వటానికి క్రీస్తు తన ప్రాణాన్నిచ్చాడు. కాని ఆయన రక్తం పై విశ్వాసం ద్వారా పునరుజ్జీవం లేకుండా పాప క్షమాపణ కలుగదు. నశించే ఆత్మకు ధనం ఉండదు. COLTel 82.4

దైవ వాక్యంలోని సత్యాల్ని చూడటానికి మనకు పరిశుద్దాత్మ ఉత్తేజం అవసరం. చీకటిని పారదోలే సూర్యకాంతి వచ్చేవరకు ప్రకృతిలోని సుందర జగత్తును చూడలేం. అలాగే నీతి సూర్యుడు ప్రకాశవంతమైన కిరణాలు ప్రసరిస్తేనే గాని దైవ వాక్యంలోని ధననిధుల్ని అభినందించలేం. COLTel 83.1

అనంత ప్రేమామయుడైన దేవుడు పరలోకం నుంచి పంపిన పరిశు ద్దాత్మ క్రీస్తుని విశ్వసించే ప్రతీ ఆత్మకు దేవుని సంగతుల్ని బయలుపర్చుతాడు. ఆత్మకు రక్షణ ఏ సత్యాలపై ఆధారపడి ఉంటుందో వాటిని ఆత్మపై తన శక్తి చేత ముద్రిస్తాడు. అప్పుడు జీవిత మార్గం స్పష్టమవుతుంది. ఆ మార్గంలో ఎవరూ తప్పు చెయ్యాల్సిన పని ఉండదు. మనం దైవ వాక్యాన్ని పఠించేటప్పుడు వాక్య ధన నిధిని చూసి అభినంధించేందుకు దానిపై పరిశుద్దాత్మ వెలుగు ప్రసరించాల్సిందిగా ప్రార్ధించాలి. COLTel 83.2