Go to full page →

ఆహారం MHTel 183

నర్సు విధిలో ఓ ముఖ్యమైన భాగం రోగి ఆహారాన్ని గూర్చిన జాగ్రత్త. రోగి బాధపడరాదు లేక పౌష్టికత లేనందు వల్ల అనుచితంగా బలహీనుడవ్వ రాదు. లేక అతడి బలహీన జీర్ణశక్తులకు అధిక శ్రమ కలిగించరాదు. ఆహారాన్ని రుచిగా తయారు చేసి వడ్డించటానికి జాగ్రత్త తీసుకోవలి. కాగా నాణ్యతాయుతముగాను, సరైన మోత దిలోను రోగి అవసరాలకు సరిపడేటట్లు తయారు చేయ్యటంలో జ్ఞానయుక్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కోలుకుంటున్న సమయంలో ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు, జీర్ణావయవాలు బలాన్ని పూర్తిగా పొందక మందు, ఆహారం విషయంలో జరిగే తప్పిదాల వల్ల గొప్ప హాని సంభవిస్తుంది. MHTel 183.4