Go to full page →

పాపం ఒప్పుకోలు MHTel 190

తమ ఆరోగ్యాన్ని తిరిగి పొందటానికి ప్రార్ధన కోరేవారికి అది ప్రకృతి చట్టమే గాని ఆధ్యాత్మిక చట్టమే గాని దేవుని చట్టాన్ని అతిక్రమించటం పాపమని, ఆయన దీవెన పొందటానికి తమ పాపాన్ని ఒప్పుకొని విసర్జించటం అవసరమని వారికి స్పష్టం చెయ్యాలి. MHTel 190.2

“మీ పాపములు ఒకనితో నొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్ధన చేయుడి” (యాకోబు 5:16) అని లేఖనం ఆదేశిస్తున్నది. ప్రార్ధనను కోరుతున్న వ్యక్తికి ఇలాటి ఆలోచనల్ని సమర్పించండి; “మేము హృదయాల్ని చదవలేం. లేక నీ జీవితంలోని రహస్యాలు ఎరుగం, అవి నీకు దేవునికి మాత్రమే తెలుసు. నీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపం పొందితే వాటిని ఒప్పుకోవటం ఓ విధి. వ్యక్తిగతమైన పాపం దేవునికి మానవుడికి మధ్య మధ్యవర్తి అయిన క్రీస్తుతో మాత్రమే ఒప్పుకోవాలి.. ఎందకంటే “ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతు డైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు” 1 యోహాను 2:1. ప్రతీ పాపం దేవునికి వ్యతిరేకంగా చేసే నేరం. దాన్ని క్రీస్తు ద్వారా దేవునితో ఒప్పుకోవాలి. ప్రతీ బహిరంగ పాపాన్ని బహిరంగంగానే ఒప్పుకోవాలి. సాటి మనుషుడిపట్ల చేసిన నేరం ఎవరిపట్ల నేరం జరిగిందో అతడితో ఒప్పుకోవాలి. ఆరోగ్యం పొందాలని భావిస్తున్నవారు ఇతరుల్ని గురించి చెడ్డగా మాట్లాడటంలో నేరస్తులైతే. గృహంలో తమ పరిసరాల్లో, సంఘంలో అసమ్మతి బీజాలు నాటి విడదీస్తే ఏ దురభ్యాసం ద్వారానైనా వారు ఇతరుల్ని పాపంలోకి నడిపిస్తే వీటిని దేవునితోను వారు ఎవరి పట్ల వాటిని చేసారో వారితోను ఒప్పుకోవాలి. “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతీ నుండి మనలను పవిత్రులనుగా చేయును”. 1 యోహాను 1:9 MHTel 190.3

తప్పుల్ని సరి చెయ్యటం జరిగినప్పుడు ఆయన ఆత్మ సూచించిన ప్రకారం మనం నిశ్శబ్దమైన విశ్వాసంతో వ్యాధిగ్రస్తుల్ని ప్రభువకు సమర్పించాలి. పేరు పేరు చొప్పున ఆయనకు ప్రతీ వ్యక్తి తెలుసు. తన ప్రియ కుమారుణ్ణి ఆ ఒక్క ఆత్మ కోసమే అర్పించాడో అన్నట్లు ఆయన ప్రతి వ్యక్తిని పట్టించుకుంటాడు. దేవుని ప్రేమ అంత గొప్పది యధార్ధమైనది. గనుక ఆయన్ని విశ్వసించి రోగుల్ని సంతోషంగా ఉండటానికి ప్రోత్సహిం చాలి. తమను గూర్చి తాము ఆందోళన చెందటం వారిని బలహీనపర్చి వ్యాధి కలిగించటానికి దారి తీస్తుంది. వారు నిరుత్సాహానికి చింతకు అతీతంగా ఉంటే స్వస్థపడే అవకాశాలు మెరుగుగా ఉంటాయి. ఎందుకంటే “కీర్త 33:19. MHTel 191.1

వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్ధన చేసేటప్పుడు “మనము యుక్తముగా ఏలాగు ప్రార్ధన చేయవలెనో మనకు తెలియదు” అని మనం గుర్తుంచుకోవాలి. రోమా 8: 26 మనం కోరుతున్న దీవెన శ్రేష్టమైనదో కాదో మనం ఎరుగం, కనుక మన ప్రార్ధనలో “ప్రభువా, ఆత్మలోని ప్రతీ రహస్యం నీకు తెలుసు. ఈ వ్యక్తులు నీకు తెలుసు. తమ ఉత్తరవాది యేసు వారి నిమత్తం తన ప్రాణాన్ని అర్పించాడు. వారి పట్ల ఆయనకున్న ప్రేమ మా ప్రేమకన్నా గొప్పది. కనుక అది నీ మహిమ కోసం బాధితుల మేలు కోసం అయినట్లయితే ప్రభువా, నీ నామం పేరిట వారికి మళ్ళి ఆరోగ్యాన్ని అనుగ్రహించు. వారు తిరిగి ఆరోగ్యం పొందటం నీ చిత్తం కాకపోతే, నీ కృప వారిని ఓదార్చి నీ సన్నిది వారిని తమ బాధల్లో ఆదు కొనును గాక” ఆన్ని తలంపును మన ప్రార్ధనలో వ్యక్తం చేయ్యాలి. MHTel 191.2

దేవునికి ఆది నుడి అంతం తెలుసు. ఆయన మనుషుల హృదయాల్ని ఎరిగినవాడు. ఆత్మలోని ప్రతీ రహసం, ఆయన చదవగలడు. ప్రార్ధన ఎవరి కోసం చేస్తున్నామో ఆ వ్యక్తులు జీవించి ఉన్నట్లయితే వారి జీవితాలు తమకుగాని లోకానికి గాని దీవెనగా ఉంటాయో లేదో ఆయనకు తెలుసు. ఇందుచేతనే మన మనవులను ఆతరుతగా సమర్పించేటప్పుడు, “అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధుంచును గాక” అంటూ సమర్పించాలి. లూకా 22:42 గెత్సెమనే తోటలో, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. “అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము” అంటూ దేవుని వివేకానాకి చిత్తానికి ఆయన తనను తాను సమర్పించుకున్నాడు. మత్తయి 26: 39, ఆ మాటలు దేవుని కుమారుడైన ఆయనకు యుక్తమైనవైతే, పరిమితులు గల, తప్పులు చేసే మానవులమైన మనకు అవి మరెంత యుక్తం! MHTel 192.1

అనుసరిచాల్సిన పద్దతి ఏమిటంటే మన కోరికలను సర్వజ్ఞడైన మన పరలోకపు తండ్రికి సమర్పించుకొని, అప్పుడు పరిపూర్ణ విశ్వాసంతో అన్నీ ఆయనకు విడిచి పెట్టటం . ఆయ చిత్త ప్రకారం అడిగితే దేవుడు మన మానవులు వింటాడని మనకు తెలుసు. కాని ఆయన చిత్తానికి సమర్పించుకోని స్వభావం మంచిది కాదు. మన ప్రార్ధనలు అజ్ఞలు కాక విజ్ఞాపనలై ఉండాలి. MHTel 192.2

దేవుడు తన దివ్య శక్తి ద్వారా ఆరోగ్యాన్ని పునరుద్దరించానికి నిర్ణయాఆత్మకంగా పనిచేసే సందర్భాలున్నాయి. కాని వ్యాధిగ్రస్తులందరూ స్వస్థతపొందరు. అనేకమంది యేసులో నిద్రిస్తారు. ఆత్మాను ద్వీపం నుండి యెహోవారాస్తున్నాడు. “ఇప్పటి నుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి యెక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తన ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును. “ప్రకటన 14:13 వ్యక్తుల ఆరోగ్యం పునరుద్ధరించబడకపోతే, ఆ కారణంగా వారికి విశ్వాసం కొరవడిందని తీర్పు చెప్పకూడదని దీని నుండి తెలుసుకుంటున్నాం. MHTel 192.3

ప్రార్ధనలకు వెంటనే ప్రత్యక్ష సమాధానాల్ని మనమందరం కోరతాం. సమాధానం ఆలస్యమైనా లేదా ఎదురుచూసిన దానికన్నా వేరుగా వచ్చినా నిరుత్సాహపడటానికి శోధన కలుగుతుంది. కాని దేవుడు మహా జ్ఞాని. భహు మంచివాడు. మనం కోరిన సమయంలో మనం ఆశించిన రీతిగా మన ప్రార్ధనలకు సమాధానం ఇవ్వడు. మన కోరికలన్నీ నెరవేర్చటం కాన్న ఇంకా ఎక్కువ చేస్తాడు. మేలు కరంగా సమయంలో మనం ఆశించిన రీతిగా మన ప్రార్ధనలకు సమాధానం ఇవ్వడు. మన కోరికలన్నీ నెరవేర్చటం కన్నా ఇంకా ఎక్కువ చేస్తాడు. మేలు కరంగా చేస్తాడు. ఆయన వివేకాన్ని ప్రేమను మనం విశ్వసిస్తాం. కాబట్టి ఆయన మన ఇష్టానికి కట్టుబడి ఉండాలని కోరకుండా ఆయన ఉద్దేశాన్ని తెలుసుకొని దాని నెరవేర్చుటకు కృషి చేస్తాం. మన కోరికలు ఆసక్తులు ఆయన చిత్రానికి లొంగాలి. మన విశ్వాసాన్ని పరీక్షించే ఈ అనుభవాలు మన మేలుకే దోహదపడుతాయి. మన విశ్వాసం యధార్ధమైనదో కాదో, దేవుని వాక్యం మీద ఆధారపడిందో లేక పరిస్థితులను బట్టి అనిశ్చితమైనదీ మార్పుచెందేదో వాటి వలన వెల్లడవుతుంది. ఆచరణ వల్ల విశ్వాసం బలో పేతమౌతుంది. విశ్వాసంతో వేచి ఉండేవారికి విలువైన వాగ్దానాలున్నాయని. జ్ఞాపకముంచుకొని విశ్వాసం తన సంపూర్ణమైన పనిని చెయ్యనివ్వాలి. MHTel 193.1

ఈ నియామాలను అందరూ అవగామన చేసుకోలేరు. ప్రభువు స్వస్థత కృపను వెదకుతున్న అనేకులు తమ ప్రార్ధనకు ప్రత్యక్ష. సత్వర సమధానం రావాలని రాకుంటే తమ విశ్వాసంలో లోపం ఉన్నదని భావిస్తారు. ఈ కారణంగా, వ్యాధివల్ల బలహీనులైన వారికి విజ్ఞతతో వ్యవహరించాలని సూచించటం అవసరం. తమ తర్వాత మిగిలి ఉండే తమ ఆప్తుల పట్ల తమ విధిని వారు మర్చిపోకూడదు. లేక తమ ఆరోగ్య పునరద్దురణకు నర్సు సేవా సంస్థలను నియమించటం ఆశ్రద్ధ చెయ్యకూడదు. MHTel 193.2

తరుచు ఇక్కడ పొరపాటు జరిగే ప్రమాదముంది. ప్రార్ధనకు జవాబుగా స్వస్థత పొందుతామని నమ్మికొందరు విశ్వాం కొరవడినట్లు సూచించే ఏ పని చెయ్యటనాకి భయపడతారు. కాని మరణించటానికి ముందు తాము చెయ్యాల్సిన కార్యాలు చెయ్యటంవారు ఆశ్రద్ధ చేయ్య కూడదు. మరణించటనాకి ముందు తమ ప్రియులు ఆప్తులకు చెప్పాల్సిన మాటలు సలహాలు చెప్పటానికి భయపడకూడదు. MHTel 193.3

ప్రార్ధన ద్వారా స్వస్థతను కోరేవారు తమ అందుబాటులో ఉన్న పరిహారాత్మక సాధనాలను నిర్లక్ష్యం చెయ్యకూడదు. భాధ తగ్గించటానికి తన పునురద్దరణ పనిలో ప్రకృతికి సహాయం చెయ్యటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఇటువంటి సాధనాలకు ఉపయోగించటం విశ్వాసాన్ని ఉపేక్షించటం కాదు. దేవునితో సహకరిస్తూ కోలుకోవటానికి తమను తాము అనుకూల పరిస్థితుల్లో ఉంచుకోవటం విశ్వాసాన్ని ఉపేక్షించటం కాదు. జీవిత చట్టాల జ్ఞానాన్ని సంపాదించే శక్తిని దేవుడు మనలో పెట్టాడు. ఈ జ్ఞానం మనం ఉపయోగించటానిక దేవుడు మనకు శక్తి సామర్ధ్యాలిచ్చాడు. ప్రకృతి చట్టాలకు అనుగుణంగా పనిచేస్తూ ఆరోగ్య పునరుద్ధరణకు మనం మన ప్రతీ మానసిక శక్తిని ఉపయోగిరచి లబ్ధిపొందాలి. రోగుల స్వస్థతకు ప్రార్ధన చేసేటప్పుడు దేవునితో పని చెయ్యటానికి మనకున్న తరుణాన్ని గూర్చి ఆయన ఏర్పాటు చేసిన సాధనాను గూర్చి కృజయేతలు తెలుపుతూ, మరింత శక్తితో మనం పని చెయ్యవచ్చు. MHTel 194.1

పరిహరాత్మక సాధనాల వినియోగానికి మనకు దైవవాక్య ఆమోదం ఉన్నది. ఇశ్రాయేలే రాజు హిజ్కియా వ్యాధి గ్రస్తుడయ్యాడు. తాను మరణిస్తాడని దైవ ప్రవక్త తనకు వర్తమానం తెచ్చాడు. అతడు దేవునికి మొర పెట్టుకోగా దేవుడు అతడు మనవిని విని తనకు పదిహేను సంవత్సరాలు పొడిగించానని అతడికి దేవుడు వర్తమానం పంపించాడు. దేవుని దగ్గర నుండి ఒక్క మాట హిజ్కియాను తక్షణమే స్వస్థపర్చి ఉండేది కాని ఆయన ఈ ప్రత్యేక సూచనిలచిచ్చాడ. “అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టు కట్టవలెను. అప్పుడు అతడు బాగుపడును”. యెషయా 38:21 MHTel 194.2

“ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్న దాచును. తన గూడా రము మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను పట్టుకొనియున్ననా శత్రువలకంటే ఎత్తుగా నా తల యెత్తబడి ఆయన గుడారములో నేను ఉత్సాహ ధ్వనిచేయుచు బలలు అర్పించెదను. నేను పాడెదను యెహోవాను గూర్చి స్తుతి గానము చేయుదును”. కీర్తలు 27:5,6. MHTel 194.3

క్రీస్తు ఒక సందర్భంలో ఓ గుడ్డివాడి కళ్ళపై మట్టి పూసి, “నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుమని చెప్పెను.. వాడు వెళ్ళి కడుగకొని చూపు గలవాడై వచ్చెను”. యెహాను 9:7 స్వస్థత ఆ మహా వైద్యుని ద్వారా మాత్రమే సాధ్యం. అయినా క్రీస్తు ప్రకృతి సామన్య సాధనాల్ని ఉపయోగించాడు. మందుల వినియోగాన్ని సమర్ధించకపోగా ఆయన సామాన్యమైన, ప్రకృతి సిద్ధమైన పరిహారార్ధక సాధనాలను అనుమతించాడు. MHTel 195.1

రోగుల స్వస్థత కోసం ప్రార్ధన చేసినప్పుడు ఫలితం ఏదైనా మనం దేవుని పై విశ్వాసాన్ని కోల్పోకూడదు. మరణాన్ని ఎదుర్కోవటానికి పిలుపు వస్తే దాన్ని ఎత్తి పట్టుకొని మన మన పెదవులకు అందిస్తున్న ఓ తండ్రి చెయ్యి అని గుర్తుంచుకొని ఆ చేదు గిన్నెను అంగీకరిద్దాం. అయితే ఆరోగ్య పునరుద్ధణ జరిగితే ఆ కృపా స్వస్థత లబ్దిదారుడు సృష్టి కర్తకు నమ్మకంగా ఉండటానికి నవీకరించబడ్డ వీధ తనుక్నుదని గుర్తుంచుకోవాలి. పదిమంది కుష్టు రోగులు శుద్ధి పొందినప్పుడు వారిలో ఒకడు మాత్రమే తిరగి వచ్చి యేసు మహిమపర్చాడు. దైవకృపా స్పర్శలేని మిగిలిన తొమ్మిది మందిలా మన అకృతజ్ఞలం కాకుందుముగాక “శ్రేష్టమైన ప్రతి యీవియు సంపూర్ణ మైన ప్రతి వరమను, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యెద్ద నుండి వచ్చును; ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయయైనను లేదు”. యాకోబు 1:17. MHTel 195.2

*****