Go to full page →

యేసు నావాడన్న హామీ MHTel 221

యేసు నావాడని నమ్ముదున్
భాసిల్లు దివ్యసౌభాగ్యము
దాసుండనౌచు పాల్పొందెదన్
నాశంబులేని సౌఖ్యంబును
ఇదే నా పాట నా సుకథ
యేసుని సదా స్తుతించుట
ఇదే నా పాట నా సుకథ
యేసుని నిత్యం ధ్యానించుట
సంపూర్ణ భక్తితో నుండెదన్
పెంపార యేసున్ ధ్యానించెదన్
సొంపౌన దూతల్ పాడుచుండన్
ఇంపైన పాటల్ నే విందును
నిండైన భక్తియే నెమ్మది
గెల్చునదేమి యేసుండగా
మెండైన దీప్తిన్ భ్రార్ధించుచు
దండిగ బ్రోమన్ సుఖింతును - ఫేనీక్రాస్ బీ అను : ఫ్రాన్సెస్ జె.అషీన్ MHTel 221.1

*****