Go to full page →

పరిశుభ్రత MHTel 236

వ్యక్తిగత పరిశుభ్రత అవసరాన్ని గురించి ఇశ్రాయేలీయులకు చాలా చక్కగా బోధించటం జరిగింది. దేవుడు తానే చెయ్యనున్న ధర్మశాస్త్ర ప్రకటన వినటానికి సీనాయి కొండ ముందు సమావేశం కాకముందు, ప్రజలు స్నానం చేసి తమ వస్త్రాలను ఉతుక్కొవాల్సి ఉన్నారు. ఆచరించని వారు మరణిస్తారన్న హెచ్చరికతో ఈ ఆదేశం అమలుపర్చబడింది. దేవుని సముఖంలో అపవిత్రత ఉండరాదు. MHTel 236.3

తమ అరణ్య ప్రయాణ కాలంలో ఇశ్రాయేలీయులు దాదాపు ఎప్పుడు ఆరుబయటే ఉన్నారు. దగ్గర దగ్గరా ఉండే ఇళ్ళల్లో నివసించే ప్రజలకన్నా అక్కడ వారి పై మలినాల ప్రభావం తక్కువ. అయినా తమ గుడారాల లోపల వెలపల వారు పరిశుద్ధతను నిష్టగా పాటించాల్సి ఉన్నారు. శిబిరం లోపల గాని, వెలపల గాని ఎలాంటి చెత్త ఉంచటం నిషిద్ధం. ప్రభువిలా అన్నాడు. “నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపంచుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును కనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను”. ద్వితియోపదేశకాండము23:14 MHTel 236.4

“అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయు నిమితము ఏర్పర్చబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును దేవుని సోత్తయిన ప్రజలునైయున్నారు”. 1 పేతురు 2:9 MHTel 237.1

“కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవా కు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ త్మతోను సేవించుము”. ద్వితియోనదేశకాండము 10:12. MHTel 237.2