Go to full page →

22—దుస్తులు MHTel 244

దుస్తుల విషయంలో మర్యాద పాటించాలని బైబిలు ఉద్బోదిస్తున్నది. “మరియు స్త్రీలును తగు మాత్రపు వస్త్రముల చేత... తమ్మును తాము అలంకరించుకొనవలెను.”1 తిమోతి 2:9 ఇది వస్త్రధారణలో ఆడంబారిన్ని డంబమైన రంగుల్ని విస్తారమైన ఆభరణాలను నిషేదిస్తుంది. ధరించే వ్యక్తి దృష్టిని ఆకర్షించటానికి లేక మెచ్చుకోలు పొందటానికి ఉద్దేశించిన ఏ సాధనాన్నయినా దేవుని వాక్యం ఆదేశిస్తున్న “తగుమాత్రము వస్త్రధారణ” తోసిపుచ్చుతుంది. MHTel 244.1

మన దుస్తులు “బంగారముతో నైనను ముత్యములతోనైనను మిగులవెలగల వస్త్రములు” కాకూడదు 9వ వచనం MHTel 244.2

ద్రవ్యం దేవుడు మనకు అప్పగించిన ట్రస్టు నిధి. మన అహంకారాన్ని లేక కోరికల్ని తృప్తిపర్చుకోవటానికి వ్యయం చేసేందుకు అది మనది కాదు. దేవుని బిడ్డల చేతుల్లో అది ఆకలిగా ఉన్నవారికి ఆహారం, వస్త్రాలు, పీడితులను ఆదుకోవటానికి రక్షణ, వ్యాధిగ్రస్తుల ఆరోగ్యానికి , బీదలకు సువార్త ప్రకటించటానికి ఓ సాధనం. ఇప్పుడు ఆడంబరానికి వ్యయం చేస్తున్న ద్రవ్యం తెలివిగా ఉపయోగిచటం ద్వారా మీరు అనేకమందిలో ఆనందాన్ని నింపవచ్చు. క్రీస్తు జీవితాన్ని పరిగణించండి. ఆయన ప్రవర్తను అధ్యయనం చేసి ఆయన ఆత్మత్యాగ స్పూర్తిలో పాలుపంచుకోండి. MHTel 244.3

క్రైస్తవులమని చెప్పుకుంటున్న క్రైస్తవ ప్రపంచంలో ఆభరణాలకు, ఖరీదైన బట్టలకు వ్యర్ధం చేసే డబ్బుతో ఆకలి బాధితులందరికి ఆహారం పెట్టవచ్చు. బట్టలు లేనివారందరికి బట్టలివ్వవచ్చుయ. బీదలను బాధల్లో ఉన్నవారిని ఆదుకోవటానిక ఉపయోగించగల ద్రవ్యాన్ని ఫ్యాషన్ ఆడంబరం హరించివేస్తున్నాయి. రక్షకుని ప్రేమా సువార్తమానం లోకానికి అంటకుండా చెయ్యటం ద్వారా అవి లోకాన్ని దోచుకుంటున్నాయి. మిషన్లు నీరసించిపోతున్నాయి. క్రైస్తత్వ బోధ లేనందు వల్ల జనులు పెద్ద సంఖ్యలో నశించిపోతున్నాయి. స్వదేశంలోనే గాక విదేశాల్లో కూడా అన్యులకు బోధలేని కారణంగా అనేకులు రక్షణవార్త వినకుండానే మరణిస్తున్నారు. దేవుడు తన ఈవవులను సమృద్ధిగా ఇచ్చి జీవిత సుఖాలు అందించే వస్తువులతో కొట్లను భండాగారాలను నింపితే, రక్షణ కూర్చే తన సత్య జ్నానాన్ని మనకు అనుగ్రహిస్తే విధవరాండ్రు, ఆనాధలు, వ్యాధిగ్రస్తులు, బాధల్లో ఉన్నావారి సువార్త బోధ వినని వారి రక్షణ పొందని వారి, ఏడ్పులు ఆకాశంలోకి ఎగసిపోవటానికి మనం ఏ కారణం చెప్పగలం? లేమిలో ఎన్నో అవసరాలతో బాధపడుతున్న ఈ ఆత్మల కోసం తన ప్రాణాన్నిచ్చిన ఆ ప్రభువును దేవుని ఆ మహాదినమందు ముఖాముఖి కలిసినప్పుడు దేవుడు నిషేదించిన వ్యసనాల్లో తమ సమాయాన్ని ద్రవ్యాన్ని వ్యర్ధం చేస్తున్నవారు ఆయనకు ఏ సాకు చెప్పుతారు? అలాటి వారితో క్రీస్తు ఈ మాటలు ఆనడా? “నేను ఆకలిగొటిని మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పిగొంటిని మీరు నాకు దాహమియ్యలేదు... దిగంబరినైయుంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదు. ” మత్తయి 25:42,43. MHTel 244.4

అయితే మన దుస్తులు నిరాడంబరంగాను, సామాన్యంగాను ఉండగా, అవి నాణ్యత, ఉచితమైన రంగులు, చేసేపనికి సరిపడేవిగా ఉండాలి. చూపునుబట్టికాక నాణ్యతను బట్టి వాటిని ఎంపిక చేసుకోవాలి. అవి వెచ్చదనాన్ని సరియైన రక్షణు ఇవ్వాలి., సామెతల గ్రంథములో ఉదహరించబడ్డ గుణవతి అయిన స్త్రీ” తన ఇంటివారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటివారందరు రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు” సామెతలు 31:21 MHTel 245.1

అన్ని విధాలుగాను దుస్తులు ఆరోగ్యవంతంగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు.. శరీర సంబంధమైన ఆరోగ్యం, ఆత్మ సంబంధమైన ఆరోగ్యం శరీరాత్మలు రెండింటి ఆరోగ్యానికి మనం దేవునితో కలసి పనిచెయ్యాల్సి ఉన్నాం. ఆరోగ్యవంతమైన వస్త్రధారణ ఈ రెండింటిని వృద్ధి పర్చుతుంది. MHTel 245.2

వస్త్రధారణలో మర్యాద, చక్కదనం, సహజ సామాన్యత, సముచితత్వం ఉండాలి. క్రీస్తు జీవిత డంబం గురించి మనల్ని హెచ్చరించాడు. కాని దాని మర్యాద, చక్కదనం, సహజసౌందర్యం గురించి కాదు. ఆయన పొలాల్లోని పువ్వుల్ని గురించి ప్రస్తావించాడు. వికసిస్తున్న పువ్వు గురించి మాటలడుతూ ఆయనన్నాడు. “అయినను ఈ సమస్త వైభముతో సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింప బడలేదు”. మత్తయి 6:29 సామన్య చక్కదనం, సామాన్యత, పవిత్రత, సమంజసత్వం గల మన వస్త్రధారణ తనకు ఆనందాన్నిస్తుందని క్రీస్తు ఇలా ప్రకృతి విషయాల సాదృశ్యం ద్వారా వివరిస్తున్నాడు. MHTel 245.3

ఆత్మ పై మిక్కిలి సుందరమైన వస్త్రం ధరించాల్సిందిగా ఆయన మనల్ని ఆదేశిస్తున్నాడు. “సాధువనైనట్టియు, మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారుము” విలువతో ఏ వెలపటి అలంకారమూ పోల్చదగింది కాదు 1 పేతురు 3:4. MHTel 246.1

రక్షకుని నియామాల్ని తమ మార్గదర్శిగా చేసుకునేవారికి ఆయన వాగ్దానంలోని మాటలు ఎంత ప్రశస్తమైనవి; MHTel 246.2

“వస్త్రములను గూర్చి మీరు చింతించనేల?... నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించని యెడల.. మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయునుగదా;.. కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని తింతించకుడి... ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్య మును నీతిని మొదట వెదకుడి అప్పుడన్నియు మీకనుగప్టాంపడును”. మత్తయి 6:28-33 MHTel 246.3

“ఎవని మనస్సు నీ మీద అనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదవు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు”. యోషయా 26:3 MHTel 246.4

“కాబట్టి మీరు ఆయన రాజ్య మును నీతిని మొదట వెదకుడి అప్పుడున్నియు మీకనుగ్రహింపబడును”. మత్తయి 6:33. MHTel 246.5

ఫ్యాషన్పోలన వల్ల కలిగే ఆయాసానికి, అశాంతి ఇక, వ్యాధికి, దౌర్భాగ్యానికి ఇది ఎంత వ్యత్యాసంగా ఉంది! ఫ్యాషన్ విధించే అనేక వస్త్రధారణ రీతులు లేఖనంలో నియమాలకు ఎంత విరుద్ధంగా ఉన్నాయి? గత కొన్ని శతాబ్దాలుగా ఆ మాటకొస్తే కొన్ని దశాబ్దాలుగా ప్రబలుతున్న శైలుల గురించి ఆలోచించండి. ఫ్యాషన్లో లేకపోయినప్పుడు వాటిలో ఎన్ని అసభ్యంగా పరిగణించబడతాయి? సంస్కారం, దైవ భీతి, ఆత్మాభి మానం గల స్త్రీలకు వాటిలో ఎన్ని అసమంజసంగా కనిపిస్తాయి? MHTel 246.6

కేవలం ఫ్యాషన్ కోసం వస్త్రాల విషయంలో మార్పులు చెయ్యటాన్ని దైవ వాక్యం అనుమతించదు. మారుతున్న శైలులు, ఖరీదైన ఆభరణాలు ధనవంతుల సమయాన్ని ద్రవ్యాన్ని మానిసకమైనా ఆత్మ సంబంధమైన శక్తుల్ని వ్యర్ధం చేస్తున్నాయి. మధ్య తరగతి ప్రజల మీద, పేద ప్రజల మీద అని పెను భారం మోపుతున్నాయి. జీవనోపాధి సపాదించుకోవటం కష్టముగా ఉన్న అనేకులు, సామన్యమైన నమూనాలో తమ సొంత దుస్తులు తయారు చేసుకోగలిగినవారు, శైలుకు పోయి డ్రెస్సులు తయారు చేసే వ్యక్తి వద్దకు విధిగా వెళ్తారు. అనేకమంది పేద అమ్మాయిలు శైలులో ఉన్న గౌను కోసం వెచ్చటి లోపలి దుస్తుల్ని త్యాగం చేసి అందుకు తమ ప్రాణంతో జరిమానా చెల్లిస్తున్నారు. అనేక ఇతరులు, భాగ్యవంతుల హంగు ఆర్బాటాన్ని ప్రేమించి నిజాయితీ లేని , సిగ్గుమాలిన చెడు మార్గాలకు ఆకర్షితులవుతున్నారు. భార్యలు లేక పిల్లలు దుబారా వల్ల అనేక గృహాలకు సదుపాయాలు లేవు. అనేకమంది పురుషులు దొంగతానికి పాల్పడుతన్నారు లేక దివాలా తీస్తున్నారు. MHTel 247.1

ఫ్యాషన్ డిమాండ్ల వత్తిడి వల్ల తమకు గాని తమ పిల్లలకు గాని ఖరీదైన దుస్తులు తయారు చేసిన అనేకమంది స్త్రీలు అంతులేని శ్రమతో కూడిన పనికి బానిసలవుతుంటారు. అనేకమంది తల్లులు ఆరోగ్యానికి గాని, సౌకర్యానికి గాని, నిజమైన సౌందర్యానికి గాని సహాయపడని అందాలు తమ బిడ్డల దుస్తులకు దిద్దటానికి దడదడలాడుతున్న గుండెతో వణుకుతున్న చేతులతో అర్ధరాత్రి వరకు అపసోపాలు పడుతుంటారు. ఫ్యాషన్ గురించి ఆరోగ్యాన్ని తమ బిడ్డలను సరిగా నడిపించటానికి అవసరమైన మానసిక ప్రశాంతతను వారు త్యాగం చేస్తారు. మనసుకు హృదయానికి సంబంధించిన సంస్కృతిని నిర్లక్ష్యం చేస్తారు. వారి ఆత్మ మరుగుజ్జి దవుతుంది. MHTel 247.2

తన బిడ్డల ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించాలో తెలుసుకోవటానికి శరీరాభివృద్ధి నియామల్ని అధ్యయనం చెయ్యటానికి తల్లికి సమయం లేదు. వారి మానసిక లేక శారీరక అవసరాలకు పరిచర్య చెయ్యటానికి, తమ చిన్న చిన్న ఆశాభంగాల్లో వారికి సానుభూతి చూపించటానికి లేక వారి ఆసక్తులు పనుల్లో పాలు పంచుకోవటానికి ఆమెక సమయం లేదు. MHTel 248.1

పిల్లలు దాదాపు లోకంలోకి వచ్చినప్పటి నుండి ఫ్యాషన్ ప్రభావానికి లోనువుతారు. తమ రక్షకుని గురించి కన్నా బట్టల గురించి ఎక్కువ వింటారు. తమ పిల్లలు బైబిలుకన్నా ఎక్కువగా శ్రద్ధగా ఫ్యాషన్ పుస్తకాలను చదవటం వారు చూస్తారు. ప్రవర్తనాభివృద్ధికన్నా దుస్తుల ప్రదర్శనను ఎక్కువ ప్రాముఖ్యమైనదిగా పరిగణిస్తారు. జీవితంలో ఏవి ఉత్తమమో ఆనం దాయకమో వాస్తవమో అవి తల్లితండ్రుల నుండి బిడ్డల నుండి దోచబడుతునానయి. ఫ్యాషన్‌కు సమయం పడుతున్నందుకు రానున్న జీవితానికి సిద్ధపడటానికి వారికి సమయం ఉండలేదు. MHTel 248.2

నిత్యం మారుతున్న ఫ్యాషన్లు కనుగొనటానికి ప్రోత్సహించేవాడు మంచికి మేలుకి విరోధి అయిన సాతానే. మానవులకు దు:ఖం నాశనం కలిగించటం ద్వారా దేవునికి ఆపకీర్తిని తేవటమే అతడి ప్రగాఢ వాంఛ. దీన్ని సాధించటానికి అతడు ఉపయోపడే అతి శక్తివమంతమైన సాధనాల్లో ఒకటి శరీరాన్ని మనసును బలహీనపర్చి ఆత్మకు కించపర్చే ఫ్యాషన్. MHTel 248.3

స్త్రీలు తీవ్రమైన రుగ్మతలకు లోనవుతుంటారు. తమ వస్త్రధారణ తీరు వల్ల వారి బాధలు మరింత ఎక్కువవుతాయి. తమకు తప్పక వచ్చేయ అత్యవసర పరిస్థితులకు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేకన్నా వారు తమ చెడ్డ అలవాట్ల వల్ల తరుచుగా తమ ఆరోగ్యమే కాదు తమ ప్రాణాన్నే పొగొట్టుకొని, తమ బిడ్డలకు బలహీన శరీరాతత్వాన్ని, వక్ర అలవాట్లను జీవితాన్ని గూర్చి తప్పుడు అభిప్రాయాల్ని వారసత్వంగా విడిచి పెడతారు. MHTel 248.4

ఫ్యాషన్ తాలూకు వ్యర్ధమైన ఉపాయాల్లో ఒకటి నేలను తాకే స్కర్ట్ ధరించటం, శుభ్రత, సౌకర్యం లేని , ఆరోగ్యవంతం కాని.. ఇవన్నీ ఇంకా ఎక్కువ.. నేలను పోరాడే ఈ స్కర్ట్ ని గురించి ఉంది. అదనంగా కావలసిన బట్ట విషయంలోను, పొడవు పరంగా ధరించాల్సిన అవసరం లేని కారణంగాను అది వ్యర్ధం. నేలను తాకే స్కర్ట్ ధరించి చేతుల్లో పొట్లాలు పట్టుకొని, మెట్లు పైకి కిందకో వెళ్ళటానికి బస్ ఎక్కటానికి మనుషులతో నిండిన వీధిలో నడవటానికి, వర్షంలో నడవటానికి లేక బందంగా ఉన్న రోడ్డు మీద నడవటానికి ప్రయత్నించటం చూసిన ఎవరికైనా అది సౌకర్యవంతంగా కాదనటానికి వేరే రుజువు అవసరంలేదు. MHTel 248.5

మరో తీవ్రమైన కీడు స్కర్ట్ బరువు నడుం భరించాలన్నట్లు తుంటిపై ధరించటం. లోపలి అవయువాలను నొక్కుతున్న బరువు వారిని కిందికి లాగుతుంది. అది పొట్టను బలహీనం చేస్తుంది. బడలిక కలిగిన భావం ఏర్పడి దాన్ని ధరించే వ్యక్తిని కుంగేటట్లు చేస్తుంది. అది ఊపిరితిత్తులను మరింత అటంకపర్చి సరియైన శ్వాస క్రియను కష్టతరం చేస్తుంది. MHTel 249.1

నడుమును నొక్కటం వల్ల సంభవించే ప్రమదాల్ని గురించి ఇటీవల సంవత్సరాల్లో క్షుణ్ణంగా చర్చించటం జరగటంతో వాటిని గురించి తెలియన వారు బహుశా ఎవరూ ఉండరు. అయినా, ఫ్యాషన్ శక్తి ఎంత గొప్పదంటే ఆ చెడు కార్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ దురాచారం వల్ల స్త్రీలు యువతులు చెప్పలేని హాని తమకు తాము కలిగించుకుంటున్నారు. ఊపిరితిత్తులు సంపూర్ణంగా శ్వాస తీసుకోవటానికి తోడ్పడేందుకు ఛాతి పూర్తి మేరకు విశాలమవ్వటం ఆరోగ్యానికి అత్యవసరం. ఊపిరితిత్తులు పరిమితైనప్పుడు వాటికి వచ్చే ప్రాణ వాయువు నాణ్యత తగ్గుతుంది. రక్తం సరిగా జీవ శక్తిని పొందలేదు. ఊపిరితిత్తుల ద్వారా విసర్జితం కావలసిన వ్యర్ధాళు విష పదార్థాలు మిగిలి ఉంటాయి. ఇదీ గాక రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది లోపలి అవయవాలు పనిచెయ్యటానికి ఇరుకిరుకుగా ఉండి అవి తమ విధులను సరిగా నిర్వర్తించటులేదు. MHTel 249.2

శరారాన్ని గట్టిగా బిగించటం వల్ల ఆకృతి మెరుగవ్వదు. సౌందర్యంలోని ముఖ్య భాగాల్లో ఒకటి అనురూపత. బాగాల సమత సామరస్యం. శారీరక వృద్ధికి సరిఅయిన నమూనా ఫ్రెంచి వస్త్ర విక్రయదారులు ప్రదర్శించే బొమ్మల్లో లేదు. అది ప్రకృతిలోని దేవుని చట్టాలకు అనుగుణంగా వృద్ధి పొందిన మావన రూపంలో ఉన్నది. సౌందర్యానికి కర్త దేవుడే. ఆయన ఆదర్శనాకి అనుగుణంగా మనం జీవిస్తేనే గాని యధార్ధమైన సౌందర్య ప్రమాణాన్ని మనం చేరలేం. ఆచారం పెంచి పోషించే కీడు ఇంకొటి వస్త్ర ధారణలో అసమాన పంపిణీ, శరీరంలో కొన్ని భాగాలకు అవసరమైన దానికన్నా ఎక్కువ వస్త్రం ఉంటే తక్కినవాటికి అసలు చాలకపోవటం. పాదాలు చేతుల ముఖ్య అవయవాలకు దూరంలో ఉండటం వల్ల వాటిని బాగా బట్టతో కప్పటం ద్వారా చలి నుంచి కాపాడుకోవాలి. కాళ్ళు చేతులు అలవాటుగా చల్లగా ఉండాలంటే ఆరోగ్యం కలిగి జీవించటం అసాధ్యం ఎందుకంటే వాటిలో చాలా తక్కువ రక్తం ఉంటే శరీరం ఇతర భాగాల్లో ఎక్కువ రక్తం ఉంటుంది. పరిపూర్ణమైన ఆరోగ్యానికి పరిపూర్ణమైన రక్త ప్రసరణ అవసరం. కాని ప్రధానావయవాలు ఏ శరీర భాగంలో ఉన్నయో అక్కడ పాదాలు చేతుల మీద కంటే మూడు లేక నాలుగు రెట్లు ఎక్కువ బట్టలు వినియోగిస్తుంటే ఇది జరగని పని. MHTel 249.3

మంచి రక్తాన్ని ఉత్పత్తి చేసే స్వచ్ఛమైన గాలి పీల్చుకొనందున తమ రక్త నాళాల గుండా రక్తాన్ని వేగంగా ప్రవహింపజేసి జీవాన్ని ఆరోగ్యాన్ని శక్తిని ఇచ్చే స్వేచ్చా విరేచనం లేనందున చాలామంది స్త్రీలు భయంతోను ఆందోళనతోను నిండి ఉంటారు. అనేక మంది స్త్రీలు ఆరోగ్యం కలిగి ఆనందంగా నివసించగలిగినప్పుడు కదలలేని రోగులై మంచాన పడి ఉంటారు. అనేకులు ఆరోగ్య నియామల ప్రకారం వస్త్రాలు ధరించి ఆరు బయట వ్యాయామం చేసి ఉంటే తమకు నిర్దేశించబడ్డ జీవించగలిగి ఉన్నప్పుడు క్షయ ఇంకా ఇతర వ్యాధల బారి నుండి మరణిస్తారు. MHTel 250.1

ఆరోగ్యకరమైన బట్టల్ని ఎంపిక చేసుకోవటానికి శరీరంలోని ప్రతీ భాగం అవసరాల్ని శ్రద్ధగా అధ్యయనం చెయ్యాలి. శీతోష్ణస్తితి స్వాభావం, పరిసరాలు, ఆరోగ్య స్థితి, వయసు, వృత్తి.. వీటన్నిటిని పరిగణలోనికి తీసుకోవాలి. ధరించే ప్రతీ వస్త్రం చక్కగా పట్టాలి. అది రక్తప్రసరణను గాని, ధారాళమైన సంపూర్ణమైన స్వాభావిక శ్వాసక్రియనుగాని అటంకపర్చకూడదు. ధరించే ప్రతీ బట్ట వదులుగా ఉండి చేతులు పైకిత్తినప్పుడు బట్టలు కూడా తగినట్టుగా పైకిలేచేటట్లుండాలి. MHTel 250.2

అంతంతమాత్రం ఆరోగ్యమున్న స్త్రీలు అర్ధవంతగా వస్త్రాలు ధరించటం ద్వారా వ్యాయామం చెయ్యటం ద్వారా తమ కోసం తాము చాలా చేసుకోగలరు. ఆరుబటయ ఆనందించటానికి వస్త్రాలు ధరించేటప్పుడు, ఆరుబటయ గాలిలో వారు ముందు జాగ్రత్తగాను తర్వాత సహనశక్తిని బట్టి పెంచుతూ వ్యాయామం చెయ్యాలి. ఇలా చెయ్యటం ద్వారా అనేకులు తమ ఆరోగ్యాన్ని తిరిగి పొంది తమ వంతు పనిని చెయ్యటానికి జీవించవచ్చు. MHTel 251.1