Go to full page →

తినటానికి సరికాని పరిస్థితులు MHTel 260

ఎక్కువ వేడిగా ఉన్న భోజనాన్ని గాని ఎక్కువ చల్లగా ఉన్న భోజనాన్ని గాని తినకూడదు. ఆహారం చల్లగా ఉంటే జీర్ణక్రియ ప్రారంభం కాకముందు దాన్ని వేడి చెయ్యటానికి జీర్ణ కోశానికి సంబంధించిన జీవశక్తి వినియుక్త మౌతుంది. ఈ కారణం వల్లనే చల్లని పానీయాలు హానికరం. ఇక వేడి పానీయల కోస్తే అవి దుర్బలతను పుట్టిస్తాయి. వాస్తవమేంటంటే, ఆహారంతో ఎంత ఎక్కువ ద్రవం తీసుకుంటే ఆహారం జీర్ణమవ్వటం అంత కష్టమౌతుంది. ఎందుకంటే జీర్ణక్రియ ప్రారంభం కాకముందు ద్రవం ఆరిపోవాలి. ఉప్పు ఎక్కువ వాడకండి, పచ్చళ్ళు కారంగా ఉన్న ఆహారాలు పదార్థాలు ఉపయోగించకండి. పండ్లు పుష్కలంగా తినండి, పానీయాన్ని ఎక్కువగా కోరే మంట చాలామేరకు తగ్గుతుంది., MHTel 260.1

ఆహారాన్ని బాగా నమిలి నెమ్మదిగా తినాలి. ఆహారంతో లాలాజలం సరిగా మిళితమవ్వటానికి, జీర్ణరసాలు వాటి చర్చకు పూనుకోవటానికి ఇది అవసరం. MHTel 260.2

ఇంకో తీవ్రమైన చెడు అలవాటు కఠిన వ్యాయామం. తరువాత ఎక్కువ అలసిపోయినప్పుడు లేక వేడి ఎక్కువగా ఉన్నప్పుడు వంటి అనుచిత సమయాల్లో తినటం. తినటం అయిన వెంటనే నరాల శక్తులపై బలమైన భారం పడుతుంది. తినటానికి ముందు లేక తిన్న వెంటనే మనసు గాని శీరీంరగాని తీవ్ర శ్రమకు గురి అయినప్పుడు జీర్ణక్రియకు అటంకం కలుగుతుంది. ఓ వ్యక్తి ఉద్రేకంతో గాని అందోళనతో గాని నిండి ఉన్న ప్పుడు లేక హడావుడిగా ఉన్నప్పుడు విశ్రాంతి లభించే వరకు లేక ఉప శమనగం కలిగే వారకు తినకుండా ఉండటం మంచిది. MHTel 260.3

జీర్ణకోశానికి మెదడకు మధ్య చాల దగ్గర సంబంధము ఉంది. జీర్ణకోశం వ్యాధిగస్తమైనప్పుడు బలహీనమైన జీర్ణావయవాలకు సహాయం చెయ్యటానికి మొదడు నుండి నరాల శక్తి వినియోగమౌతుంది. ఇలా తరుచుగా జరిగినప్పుడు, మెదడు కిక్కిరిసిపోతుంది. మెదడుకు నిత్యం అధిక శ్రమ ఉంటూ శరీరానికి వ్యాయామం లేకుంటే, సామాన్య ఆహరం సయితం చాలా తక్కువ తినాలి. భోజన సమమయంలో చింత ఆందోళనలకు దూరంగా ఉండండి తొందర తొందరగా గాక నెమ్మదిగా, సంతోషంగా ఆయన దీవెనలన్నిటి నిమిత్తం దేవునికి కృతజ్ఞతతో నిండిన హృదయంతో తినండి. MHTel 260.4

మాంసాహారం ఇతర అనుచిత, హానికర ఆహర పదార్థాల్ని విడిచి పెట్టిన అనేకులు తమ ఆహారం సామాన్యం ఆరోగ్యకరం గనుక ఎక్కువ తినవచ్చునని కొన్నిసార్లు తిండి బోతుల్లా కూడా భావిస్తారు. ఇది పొరపాటు. వ్యవస్థ ఉపయోగించుకోలేని ఆహార పరిమాణంతో గాని నాణ్యతతో గాని జీర్ణావయవాలు ఎక్కువ పని పెట్టకూడదు. MHTel 261.1

అనేక రకాల వంటకాలతో ఆహారాన్ని భోజన బల్లపై పెట్టాలని ఆచారం శాసిస్తుంది. తరువాత ఏమి వస్తుందో తెలియకుండా ఓ వ్యక్తి బహుశా తనకు సరిపడని ఆహారాన్ని చాలినంత తినవచ్చు. చివరి వంటకం తెచ్చినప్పుడు అతడు తరుచు హద్దులు దాటటానికి సాహసించి, ఆ తీపి పదార్ధాన్ని తీసకుంటాడు అది అతడికి ఏమాత్రం మంచిది కాదు. భోజనానికి ఉద్దేశించిన ఆహారంమంతా మొదట్లోనే బల్ల మీద పెడితే ఓ వ్యక్తి ఉత్తమ తీర్మానాన్ని చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అతి తిండి పర్యవసానం వెంటనే కనిపిస్తుంది. ఇతర సందర్భాల్లో నొప్పి అనిపించదు. కానీ జీర్ణావయవాలు వాటి జీవ శక్తిని కోల్పోతాయి. శారీరాక శక్తి పునాది బలహీనమౌతుంది. MHTel 261.2

అదనపు ఆహారం వ్యవస్థపై భారం మోపి అనారోగ్య పరిస్థితిని జ్వర పరిస్థితిని కలిగిస్తుంది. అది జీర్ణకోశంలోకి అధిక రక్తాన్ని రప్పిస్తుంది. అందువల్ల కాళ్ళు చేతులు త్వరితంగా చల్లబడతాయి. జీర్ణావయవాల పై తీవ్ర భారం పడుతుంద. ఈ అవయవాలు వాటి పనిని ముగించిన తరువాత బలహీనత భావం కలుగుతంది. నిత్యం అతి తిండికి అలవాటు పడ్డవారు దీన్ని “అంతా పోయిన ఆకలి” అని పిలుస్తారు. అయితే ఇది జీర్ణావయవాలకు అధిక శ్రమ వలన ఏర్పడ్డ పరిస్థితి. కొన్నిసార్లు మెదడు తిమ్మిరెక్కి మొద్దుబారుతుంది. మానసికమైన లేక శారీరకరమైన కృషికి ఆసక్తి ఉండదు. MHTel 261.3

అప్రియమైన ఈ సూచనలు కనిపిస్తాయి. ఎందుకంటే ప్రకృతి జీవశక్తిని అనవసరంగా వెచ్చించి తన పనిని పూర్తి చేసి పూర్తిగా అలసిపోయింది. “నాకు విశ్రాంతినివ్వండి” అంటుంది జీర్ణకోశం. కాని అనేకుల విషయంలో ఈ నీరసం ఇంకా ఎక్కువ ఆహారానికి డిమాండులా భావించబడుతుంది. కనుక పొట్టకు విశ్రాంతినిచ్చే బదులు దానిపై మరింత భారం మోపటం జరగుతుంది. ఫలితంగా జీర్ణావయవాలు మంచి పని చెయ్యటానికి సామార్ధ్యం కలిగి ఉండాల్సినప్పుడు తరుచు అరిగపోయి శిధిలమౌతాయి. MHTel 262.1

ఇతర రోజులకన్నా ఎక్కువ ఆహారం లేక ఎక్కువ రకాల ఆహారం సబ్బాతు రోజున సరఫరా చెయ్యకూడదు. దీనికి బదులు ఆరోజు మనము నిర్మలంగాను ఆధ్యాత్మిక విషయాల్ని గ్రహించటానికి చురుకుగాను ఉండేందుకు ఆహారం మరింత సామాన్యంగా ఉండాలి. తక్కువ తినాలి. కిక్కిరిసిన పొట్ట అంటే కిక్కిరిసిన మెదడు అని అర్ధం. విలువైన మాటలు వినిపించవచ్చు గాని అనుచిత ఆహారం వల్ల మనసు అస్తవ్యస్తమైనందున వాటిని అభినందించలేదు. సబ్బాతునాడు ఎక్కువ తినటం ద్వారా అనేకమంది అందిన పరిశుద్ధ తరుణాల ఆధ్యాత్మిక ఉపకారాన్ని పొందటానికి తమని తాము అనర్హుల్ని చేసుకుంటారు. MHTel 262.2

సబ్బాతునాడు వంటను మానాలి. అయినా చల్లని ఆహారం తినాల్సిన అవసరం లేదు. చలి దినాల్లో ముంద రోజు తయారు చేసుకున్న ఆహారాన్ని వేడి చేసుకోవాలి. ఆహారం ఎంత సామన్యంగా ఉన్నా అది రుచిగాను ఆకర్షణీయంగాను ఉండాలి. ముఖ్యంగా పిల్లలున్న కుటుంబాల్లో సబ్బాతు రోజున విందుగా ఉండే ప్రతీరోజూ ఉండని ఏదో ప్రత్యేకమైన వంటకం ఉండాలి. MHTel 262.3

ఆహార విషయంలో ఎక్కడ దురభ్యాసాలున్నాయో అక్కడ జాప్యం లేకుండా సంస్కణ జరగాలి. జీర్ణకోసం దుర్వినియోగం వల్ల అజీర్తి వ్యాధి వచ్చినప్పుడు, అధిక భారాన్ని మోపుతున్న ప్రతీదాన్ని తొలగించటం ద్వారా మిగిలన శక్తిని కాపాడుకోవటానికి జాగ్రత్తగా కృషి చెయ్యాలి. దీర్ఘకాలం దుర్వినియోగం అనంతరం జీర్ణకోసం ఆరోగ్యాన్ని పని పూర్తిగా తిరగి పొందటం జరగకపోవచ్చు. కాగా సరియైన ఆహార నియమాల అదనపు దుర్బలత బారిన పడకుండా కాపాడుతుంది. అనేకమంది ఇంచుమించుగా పూర్తిగా స్వస్తత పొందుతారు. ప్రతీ సందర్భానికి సరిపడే నియమాల్ని నిర్దేశించడం సులభం కాదు. కాని ఆహారం విషయంలో సరియైన నియమాల్ని జాగ్రత్తగా ఆచరిస్తు అనేక దిద్దుబాట్లు చోటుచేసుకుంటాయి. రుచిని శోధించటానికి వంటగాడు లేక వంటగత్తె నిత్యం కృషి చెయ్యాల్సిన అవసరం ఉండదు. MHTel 262.4

ఆహారం విషయంలో మితం ఇచ్చే వరం మానసికమైన నైతికమైన శక్తి అది ఉద్రేకాల్ని నియమంత్రించటంలో తోడ్పడుతుంది. మంద కోడితత్వం గల గలవారికి అమితాహరం ముఖ్యంగా హానికరం. వీరు అతి తక్కువగా తిని ఎక్కువ శరీర వ్యాయయామం చెయ్యాలి. గొప్ప సహజ ప్రతిభగల పురుషులు స్త్రీలు ఉన్నారు. రుచిని ఉపేక్షించడంలో ఆత్మనిగ్రహాన్ని పాటిస్తే సాదించగలిగి ఉండే దానిలో సగంకూడ కృషి చెయ్యాల్సిన అవసరం ఉండదు. MHTel 263.1

అనేకమంది రచతలు వక్తలు ఇక్కడే విఫలమౌతురు పుష్టుగా భోజనం చేశాక వారు నీడను కూర్చుని చదవటం లేక రాయటం వంటి తమ వృత్తి పనుల్లో నిమగ్నమౌతారు. శరీర వ్యాయామానికి ఏమి సమయం పెట్టరు. పర్యవసానంగా ఆలోచనలు మాటల స్వేచ్చా ప్రవహానికి అడ్డుకట్ట పడుతుంది. హృదయాన్ని చేరటానికి అవసరమైన శక్తితో ప్రగాఢతతో రాయలేరు, మాట్లాడలేదు. వారి కృషి నాసికరంగాను నిష్ఫలంగాను ఉంటుంది. MHTel 263.2

ముఖ్యమైన బాద్యతలు ఎవరిపై ఉంటాయో, ఆధ్యాత్మిక ఆసక్తులను ఎవరు పరిరక్షించాల్సినవారో వారు నిశితమైన మనోభావాలు త్వరిత అవగాహన కలిగి ఉండాలి. ఇతరులకన్నా వారు ఆహారం విషయంలో మితానుభవం పాటించాలి. వారి భోజన బల్ల మీద విలాసవంతమైన ఆహారానికి స్థానం ఉండకూడదు. MHTel 263.3

భాధ్యయుత స్థానాల్లో ఉన్నవారు ప్రతీరోజూ ఎంతో ప్రాముఖ్యమైన ఫలితాలు ఆధారపడి ఉన్న తీర్మానాలు చెయ్యాల్సి ఉంటుంది. వారు చురుకుగా ఆలోచించాల్సి ఉంటుంది. ఈ పని ఎవరు నిష్కర్ష అయిన మితానుభవం పాటిస్తారో వారే చెయ్యగలరు. శారీరక మానసిక శక్తులను సరిగా ప్రోది చేసినప్పుడే మనసు బలం పొందుతుంద. ప్రయాస ఏమంతా ఎక్కువ కాకపోతే, ప్రతీ శ్రమతోను నూతన శక్తి వస్తుంది. కాని ప్రాముఖ్యమైన ప్రణాళికలు వారి పనిని అనుచిత ఆహారం ఫలితాలు దెబ్బతీస్తాయి. అస్తవ్యస్తమైన పొట్ట కలత చెందిన అనిశ్చితమైన మానసిక స్థితిని పుట్టినిస్తుంది. అది తరుచు కోపానికి, కఠినత్వానికి లేక అన్యాయానికి దారి తీస్తుంది. లోకానికి మేలురకంగా ఉండి ఉంటే అనేక ప్రణాళజకలు తోసిపుచ్చటం, లేక అన్యాయపు , కఠినమైన క్రూరమైన చర్యలు అనుచిత ఆహార అలవాట్లు ఫలితంగా రోగ గ్రస్తమైన పరిస్థితిలో చేపటట్టం జరుగుతుంటుంది. MHTel 263.4

ఆఫీసుల్లో పనిచేసేవారికి లేక మెదడుతో పనిచేసేవారికి ఓ సలహా చాలినంత నైతిక ధైర్యం ఆత్మనిగ్రహం ఉన్నవారు దీన్ని చెయ్యటానికి ప్రయత్నించినివ్వండి. ప్రతీ భోజనంలో రెండు లేక మూడు రకాల సామన్య ఆహారాన్ని తీసుకోనివ్వండి. ఆకలిని తీర్చుకోవటానికి మాత్రమే తిననివ్వండి. రోజు చురుకుగా వ్యాయామం చెయ్యనివ్వండి. ఉపకారం కలుగుతుందో లేదో చూడండి.చురుకైన శారీరక శ్రమ చేసే బలమైన మనుషులు ఆహార పరిమాణంలో గాని నాణ్యతలో గాని ఆఫీసుల్లో పనిచేసేవారంతా జాగ్రత్తగా ఉండనవసరంలేదు. కాని వీరు కూడా తినటంలోను, తాగటంలోను ఆత్మ నిగ్రహం పాటిస్తే ఇంకా మెరుగైన ఆరోగ్యాన్ని ఆనందించవచ్చు. MHTel 264.1

తమ ఆహారానికి ఖచ్చితమైన ఓ నిబంధన నియమిస్తే బాగుటుందని కొందరు అభిప్రాయపడతారు. వారు అతిగా తింటారు ఆ మీదట విచారపడతారు. అలా ఏమి తినాలి ఏమి తాగాలి అని వారు ఆలోచి స్తుంటారు. ఈ స్థితి మంచిదికాదు. ఓ వ్యక్తి మరో వ్యక్తికి ఖచ్చితమైన నిబంధనను చెయ్యలేడు. ప్రతీ వ్యక్తి తినటం తాగటంలో తన జ్ఞానాన్ని ఆత్మ నిగ్రహా శక్తిని ఉపయోగించాలి. MHTel 264.2

మన శరీరాలు క్రీస్తు కొనుక్కున్న ఆస్తి. వాటితో మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటానికి మనకు హక్కులేదు. ఆరోగ్య చట్టాల్ని అవగాహన చేసుకునేవారందరూ దేవుడు తమలో స్థాపించిన చట్టాలకు విధేయులై ఉండాల్సిన విధిని గుర్తించాలి. ఆరోగ్య చట్టాలకు విధేయత వ్యక్తిగత విధి కావాలి. చట్ట ఉల్లంఘన ఫలితాల్ని మనమే అనుభవించాలి. మన అలవాట్లు ఆచారాలకు మనం వ్యక్తిగతంగా జవాబుదారులం. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం “లోక ఆచారం ఏమిటి” అన్నది కాదు. “దేవుడు నాకు అప్పగించిన నివాసాన్ని నేను ఎలా చూసుకోవాలి” అన్నది. MHTel 264.3

*****