Go to full page →

25—ఆహార అతివాదం MHTel 272

ఆహార సంస్కరణను నమ్ముతున్నట్లు చెప్పేవారందరూ వాస్తవంలో సంస్కర్తలు కారు. కొందరు వ్యక్తులతో సంస్కరణ అంటే కొన్ని అనారోగ్యకరమైన ఆహారాల్ని విడిచి పెట్టటం. ఆరోగ్య సూత్రాల్ని వారు స్పష్టంగా అవగాహన చేసుకోరు. వారి భోజన బల్ల ఇంకా హానికరమైన ఆహార పదార్థాలతో నిండి ఉండటంతో క్రైస్తవ మితానుభవానికి, మితానికి అవి ఏమాత్రం ఆదర్శం కాదు. MHTel 272.1

మరో తరగతి ప్రజలు సరియైన ఆదర్శాన్ని చూపించాలన్న కోరికతో ఇంకో అమితానికి పోతారు. కొందరు తాము ఎక్కువగా కోరుకునే ఆహారాల్ని పొందలేరు. తమకు లభించి పదార్థాలకు మారుగా దొరికే వాటిని ఉ పయోగించే బదులు నాసిరకం ఆహారాన్ని ఉపయోగిస్తారు. మంచి రక్తం తయారు చెయ్యటానికి అవసరమైన పదార్ధాల్ని వారి ఆహారం సరఫరా చెయ్యదు. కనుక వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. వారి ప్రయోజకత్వం తగ్గుతుంది. వారి ఆదర్శం ఆహార సంస్కరణకు అనుకూలంగా గాక ప్రతికూలంగా సాక్ష్యమిస్తుంది. MHTel 272.2

ఆరోగ్యానికి సామాన్యఆహారం అవసరం కాబట్టి ఆహారాన్ని ఎంపిక చెయ్యటంలో గాని తయారు చెయ్యటంలో గాని ఎక్కువ శ్రద్ధ అసరంలేదని కొందరు భావిస్తారు. ఇంకా కొందరు శరీర వ్యవస్థ అవసరాల్ని సరఫరా చెయ్యటానికి చాలినన్నీ రకాలను సరఫరా చెయ్యని చాలా తక్కువ ఆహారంతో సరిపుచ్చుకుంటారు. పర్యవసానంగా బాధకు గురి అవుతారు. MHTel 272.3

సంస్కరణ నియమాల పై పాక్షిక అవగాహన మాత్రమే ఉన్నవారు తమ అభిప్రాయాల్ని ఆచరణలో పెట్టటంలోనే కాక వాటిని తమ కుటుంబాలపై ఇరుగు పొరుగు వారి పై రుద్దటంలోనూ కఠిన వైఖరి అవలంభిస్తారు. వారు తప్పుగా అవగాహన చేసుకున్న సంస్కరణలు తమ అనారోగ్యంతో కనిపిస్తున్నట్లు ఆహార సంస్కరణ విషయంలో అనేకులకు తప్పు అభిప్రాయాల్ని కలిగించి దాన్ని పూర్తిగా నిరాకరించటానికి వారిని నడిపిస్తుంది. MHTel 272.4

ఆరోగ్య సూత్రాల్ని అవగాహన చేసుకున్నవారు నియమాలకు బద్దులైన వారు అతిగా తినటం అతి తక్కువ తినటం రెండు అతివాదుల్ని తిరస్కరిస్తారు. వారు తమ ఆహారాన్ని రుచిని తృప్తిపర్చుకోవటానికి కాక శరీరాన్ని వృద్ధిపర్చుకోవటానికి ఎంపిక చేసుకుంటారు. దేవునికి మానవుడికి ఉన్నత సేవ చెయ్యటానికి ప్రతీ శక్తిని కాపాడుకోవటానికి వారు ప్రయత్నిస్తారు. ఆహార వాంఛ స్వబుద్ధి, మనస్సాక్షి అదుపులో ఉంటుంది. దానికి ప్రతిఫలంగా వారికి శరీరారోగ్యం మానసికారోగ్యం లభిస్తాయి. వారు తమ దృక్పధాలను ఇతరుల పై అభ్యంతకరకరంగా రుద్దకపోగా వారి ఆదర్శం సరియైన నియమాల పక్షంగా సాక్ష్యమిస్తుంది. ఈ వ్యక్తుల ప్రభావం వల్ల విశాలమైన మేలు జరుగుతుంది. MHTel 273.1

ఆహార సంస్కరణలో చాలా లోకజ్ఞానం ఉంది. ఈ అంశాన్ని విస్తృతంగా లోతుగా అధ్యయనం చెయ్యటం అవసరం. ఏ వ్యక్తి అన్ని విషయాల్లోను ఇతరుల ఆచరణ తన అచరణలా లేనందుకు వారిని విమర్శించకూడదు. ప్రతీ వ్యక్తి అలవాట్లును క్రమపర్చటానికి ఏకరూప నిబంధనను చెయ్యటం ఆసాధ్యం. ఏ వ్యక్తి తాను అందరికి ప్రమాణమని భావించకూడదు. అందర అవే పదార్థాల్ని తినలేరు. ఒక వ్యక్తికి రుచిగాను ఆరోగ్యకరంగాను ఉన్న ఆహారాలు ఇంకొకరికి చప్పగాను హానికరంగా కూడా ఉండవచ్చు. కొందరికి పాలు పడవు. కొందరు పాల మీదే బతుకుతారు. కొందరికి బఠాణీలు చిక్కుళ్లు జీర్ణం కావు. ఇతరులకు వాటిని ఉపయోగించలేరు. MHTel 273.2

కొత్త గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారిని లేక పండ్లు పప్పులు చాలా గుడ్డులను ఉపయోగించవద్దని కోరకూడదు. బాగ కండ కలవారు, ఎవరిలో పాశవిక ఉద్రేకాలున్నాయో వారు ఉత్తేజపర్చే ఆహారాల్ని తీసుకోకూడదు. ఇంద్రియ సంబంధమైన అలవాట్లున్న పిల్లలు గల కుటుంబాల్లో గుడ్లు వాడకూడదు. కాని రక్తం తయారు చేసే అవయవాలు బలహీనంగా ఉన్న వారి విషయంలో ముఖ్యంగా అవసరమైన పదార్ధాల్ని సరఫరా చేసే ఇతర పదార్థాలు లభించకపోతే పాలు గుడ్లు ఉపయోగించటం పూర్తిగా మానకూడదు. ఆరోగ్యంగా ఉన్న ఆవు పాలు, బాగా మేత పెట్టిన బాగా పెంచిన ఆరోగ్యంగా ఉన్న కోడి పెట్టల గుడ్లు వాడటానికి జాగ్రత్త వహించాలి. అతి సులువుగా జీర్ణమయ్యేలా గుడ్లను ఉడకబెట్టాలి. MHTel 273.3

ఆహార సంస్కరణముందుకు సాగుతుండాలి. జంతువుల్లో వ్యాధి పెరిగే కొద్ది పాలు గుడ్లు వాడకం క్షేమం కాదు. వాటి స్థానాన్ని ఆరోగ్యకరమైన చౌక అయిన ఇరత ఆహార పదార్థాలు ఆక్రమించాలి. పాలు గుడ్లు లేకుండా అదే సమయంలో ఆరోగ్యకరంగాను రుచికరంగాను ఆహారం ఎలా తయారు చెయ్యాలో సాధ్యమైనంత మేరకు ప్రజలకు నేర్పించాలి. MHTel 274.1

“అన్నపానములు పుచ్చుకొనుటకంటెను తన కష్టార్జితము చేత సుఖపడుటకంటెను. నరునికి మేలురకమైనదేమియు లేదు.” ప్రసంగి 2:24 MHTel 274.2

రోజుకి రెండుసార్లు భోజనం చేసే అలవాటు ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుంది. అయినా కొన్ని పరిస్థితుల్లో వ్యక్తులకు మూడో భోజనం అగత్యమవ్వవచ్చు. తీసుకోవటం జరిగితే ఇది చాలా తేలికగా ఉండాలి. అది సులువుగా జీర్ణమయ్యే ఆహారమై ఉండాలి “క్రేకర్స్ - ఇంగ్లీష్బిస్కెట్స్- జ్విక్ బేక్, పండు లేక సీరియల్ కాఫీ ఇవి సాయంత్రం భోజనంగా ఉత్తమం. MHTel 274.3

తమ ఆహారం ఎంత సామన్యమైనది అరోగ్యకరమైనది అయినా అది తమకు హానీ చేస్తుందని కొందరు నిత్యం ఆందోళనగా ఉంటారు. వీరికి నేను చెప్పదలచిందేమిటంటే, మీ ఆహారం మీకు హాని కలిగిస్తుందని భావించవద్దు. దాన్ని గురించి అస్సలు తలంచవద్దు. మీరు మంచిదని తలంచినదాని ప్రకారం తినండి. మీ ఆహారాన్ని మీ శరీరారోగ్యానికి తోడ్పడేటట్లు దీవించవలసినదిగా మీరు ప్రభువుకు ప్రార్ధించినప్పుడు ఆయన మీ ప్రార్ధనను వింటాడని నమ్మి విశ్రమించండి. MHTel 274.4

కడుపులో మంట పుట్టించి ఆరోగ్యాన్ని కుంటుపర్చే వాటిని విసర్జించాలని నియమం చెబుతుంది. గనుక పోషణ లేని ఆహారం శక్తి లేని రక్తాన్ని ఉత్పత్తి చేస్తుందని మనం గుర్తుంచుకోవాలి. స్వస్థపర్చటానికి అతి కష్టమైన వ్యాధులు దీని పర్యవసానతంగా వస్తాయి. శరీరానికి చాలినంత పోషణ అందదు. ఫలితంగా ఆజీర్తి వ్యాధి సాధారణ దుర్బలత వస్తాయి. అటువంటి నిస్సార ఆహారం తినేవారు ఎల్లప్పుడూ పేదరికం ఒత్తిడి వల్లే అలా చెయ్యరు కాని తమ అజ్ఞానం వల్లనో లేక తమ నిర్లక్ష్యం వల్లనో లేక సంస్కరణను గూర్చిన తమ తప్పుడు అభిప్రాయాల వల్లనో చేస్తారు. MHTel 274.5

శరీరాన్ని నిర్లక్ష్యంగా చేసినప్పుడు లేక దుర్వినియోగం చేసి తద్వారా దేవుని సేవకు మనల్ని మనం అయోగ్యుల్ని చేసుకున్నప్పుడు దేవున్ని మహిమపర్చం. శరీరానికి హితవైన, శక్తినిచ్చే ఆహారాన్ని సమకూర్చటం ద్వారా దాన్ని సంరక్షించటం గృహ యాజమాని మొదటి విధుల్లో ఒకటి. ఆహార సరఫరాలు తగ్గించటంకన్నా తక్కువ ఖరీదైన బట్టలు, ఇంటి సామాన్లు కలిగి ఉండటం మేలు. MHTel 275.1

కొందరు గృహస్తులు సందర్శకులకు ఖరీదైన భోజన పానాదులు అందించటానికి తమ కుటుంబ భోజన బల్లపై భోజనం లేకుండా చేస్తారు ఇది అవివేకం. అతిథులను సత్కరించుటలో సామాన్యత పాటించాలి. కుటుంబ అవసరాలకు ప్రాధాన్యాన్నివ్వాలి. MHTel 275.2

అతిథ్యం అవసరమైన చోట గొప్ప దీవెనకాగలిగినప్పుడు ఆచరణలో పెట్టటానికి బుద్ధిహీనమైన పొదుపు కృత్రిమ ఆచారాలు అడ్డుతగులుతాయి. ఎదురు చూడని అతిథులు వచ్చినప్పుడు గృహిణికి అదనపు ఆహారం తయారు చేసే భారం లేకుండా చాలినంత సాధారణ ఆహారం మన భోజన బల్లలపై ఉండాలి. MHTel 275.3

ఏమి తినాలి? దాన్ని ఎలా వండాలి? అన్నవాటి గురించి అందరూ నేర్చుకోవాలి. పురుషులు స్త్రీలు ఆహారాన్ని సామాన్యంగా ఆరోగ్యకరంగా తయారు చెయ్యటం నేర్చుకోవాలి. తాము చేసే పని లేక వ్యాపారం తరుచు ఆరోగ్యదాయక ఆహారం దొరకని స్థలాలకు పిలుపు నివ్వవచ్చు. వారికి వంట చెయ్యటం వచ్చి ఉంటే అప్పుడు దాన్ని ఉపయోగించి లబ్ది పొందవచ్చు. మీ ఆహారం గురించి జాగ్రత్తగా పరిగణించండి. కార్యం నుండి కారణాన్ని అధ్యయనం చెయ్యండి. ఆత్మ నిగ్రహాన్ని పెంచుకోండి. ఆహార వాంఛను సుబుద్ధి అదుపులో ఉంచండి. అతి తిడి ద్వారా జీర్ణకోశ దుర్వినియోగానికి పాల్పడకండి. కాని ఆరోగ్యానికి అగత్యమైన ఆరోగ్యకరం రుచికరం అయిన ఆహారం తీసుకోవటం మాని మీకు మీరు అన్యాయం చేసుకోకండి. MHTel 275.4

ఆరోగ్య సంస్కర్తలు కాగోరుతున్న కొందరి సంకుచిత భావాలు ఆరోగ్య సంస్కరణకు తీవ్ర హాని కలిగిస్తున్నాయి. చాలా మేరకు ఆరోగ్య సంస్కరణకు తమ భోజన బల్లలపై ఆహారానికి చేసుకునే ఏర్పాట్లను బట్టి ఆరోగ్య సంస్కరణ నిర్ధారించబడుతుందని జ్ఞాపకముంచుకోవాలి. దానికి చెడ్డ పేరు తెచ్చే కార్యాలు చేసేకన్నా నిజాయితీ పరుల మనసులకు దాన్ని సిఫార్సు చేసేటట్లు వారు సంస్కరణ నియమాలను ఆచరణలో పెట్టి చూపించాలి. అది ఆహారం పై ఆంక్ష విధిస్తే అది ఎంత సహేతకమైన చర్య అయినా సంస్కరణోద్యమాన్ని వ్యతిరేకించి వారి సంఖ్య హెచ్చుగానే ఉంటుంది. వారు హేతువును లేక ఆరోగ్య చట్టాలను గాక రుచిని సంప్రదిస్తారు. ఈ తరగతికి చెందినవారు అందరూ నడిచే సాంప్రదాయ మార్గాన్ని విడిచి పెట్టి సంస్కరణను ప్రబోధించేవారిని వారి మార్గం ఎంత స్థిరమైనదైనా తీవ్ర వాదులుగా ముద్ర వేస్తారు. విమర్శించటానికి వీరికి తావు లేకుండేటట్లు ఆరోగ్య సంస్కరణ వాదులు ఇతరులకన్నా తామ ఎంత MHTel 276.1

“మరియు పందెమునందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీలమును పొందుటకును మితముగా ఉన్నాము” 1 కొరింథీ 9:25 MHTel 276.2

వ్యత్యాసంగా ఉండగలరో చూపించుకోటానికి ప్రయత్నించేకన్నా నియమానికి నీళ్లోదలకుండా వారికి ఎంత సమీపంగా రాగలరో అంత సమీపంగారావాలి. MHTel 276.3

ఆరోగ్య సంస్కరణ ప్రబోధకులు తీవ్ర భావాలు వ్యక్తం చేసే వీరిని ఆరోగ్య నియమాలకు ప్రతినిధులుగా పరిగణించే అనేకులు సంస్కరణను పూర్తిగా నిరాకరించటంలో ఆశ్చర్యం లేదు. ఈ తీవ్ర భావాలు కొద్ది కాలంలో చేసే హానిని జీవిత కాలమంతా సంస్కరణకు నమ్మకంగా జీవించిన జీవితం సరి చెయ్యలేదు. MHTel 276.4

ఆరోగ్య సంస్కరణ విశాలమైన దీర్ఘకాలికమైన నియమాల పై అధారితమయ్యింది. సంకుచిత భావాలు ఆచారాలను బట్టి దాన్ని చిన్న చూపు చూడకూడదు. వ్యతిరేకత గాని ఎగతాళిగాని ఇతరుల్ని సంతోషపర్చ టానికి లేక ప్రభావితం చెయ్యటానికి కలిగే కోరిక గాని తనను వాస్తవ నియమాలనుంచి మరల్చటానికి లేక వాటిని కొరగానివిగా పరిగణించ టానికి ఎవరు అనుమతించకూడదు. నియమాలకు నిబద్దులైన వారు న్యాయానికి ధృడంగాను నిర్ణయాత్మకంగాను నిలబడతారు. అయినా తమ స్నేహలన్నిటిలోను వారు ఉదారమైన క్రీస్తును పోలిన స్వభావాన్ని యదార్ధమైన మితాన్ని ప్రదర్శిస్తారు MHTel 277.1

*****