Go to full page →

మసాలాలు MHTel 278

వేగం ప్రధానమైన ఈ యుగంలో ఆహారం ఎంత తక్కువ ఉద్రేకాన్ని కలిగించేదైతే అంత మంచిది. అవాలు, మిరియాలు మసాలాలు, పచ్చళ్ళు ఇలాంటి ఇతర పదార్థాలు కడుపులో మంట పుట్టించి రక్తాన్ని వేడేక్కించి మలినం చేస్తాయి. తాగుబోతు తాలూకు క్షోభించిన పొట్టను సారాయి ఫలితాలకు ఉదాహరణంగా చెబుతుంటారు. అలాంటి పరిస్థితినే మంటపుట్టించే మసాలాలు ఉత్పత్తి చేస్తాయి. త్వరలో సామాన్యాహారం ఆకలి తీర్చదు. శరీరం ఎదో కొరతగా ఉన్నట్లు భావిస్తుంది. మరింత ఉత్తేజాన్ని పుట్టించే పదార్ధాన్ని కోరుతుంది. MHTel 278.2