Go to full page →

లైసెన్స్ చట్టాలు MHTel 293

తాగుడు దురభ్యాసాన్ని నియంత్రించేందుక తోడ్పడే చర్యగా సారా వ్యాపారానికి లైసెన్స్ ని అనేకులు ప్రబోధిస్తున్నారు. ఆ వ్యాపారానికి లైసెన్స్ ఇవ్వటం ద్వారా దాన్ని చట్టం పరిరక్షణ కింద ఉంచుతుంది. ప్రభుత్వం దాని ఉనికిని ఆమోదించి ఆ చెడును నియంత్రిస్తానంటూ దాన్ని పెచుతుంది. లైసెన్సు చట్టాల పరిరక్షణ కింద సారా, వైన్ తయారు చేసే బట్టీలు దేశమంతటా వెలశాయి. అమ్మే వాడు మన ఇంటి పక్కనే తన వ్యాపారం సాగిస్తాడు. MHTel 293.1

తాగి ఉన్న వ్యక్తికి లేక తాగుబోతుగా తెలిసిన వ్యక్తికి మత్తు పానీయాలు అమ్మకూడదనే ఆంక్ష తరుచు అతడిపై ఉంటుంది. కాని యువతను తాగుబోతుల్ని చేసే పని నిదానంగా సాగుతూనే ఉన్నది. యువత సారా పట్ల ఆకలి కలిగించటం పై సారా వ్యాపారం ఆస్తికతే ఆధారపడి ఉంటుంది. యువత మెట్టు తరువాత మెట్టు ఎక్కుతూ వెళ్ళి చివరికి సారా అలవాటులో కూరుకుపోతారు. సారాకు దాహం సృష్టించబడింది. అరునూరైనా అది తృప్తి పర్చబడాలి. పుష్పిస్తున్న మన యువతను ఈ భయంకర అలవాటు ద్వారా నాశనానికి ఆకర్షించేకన్నా ఎవరి నాశనం నిర్ధారించబడిందో ఆ తాగుబోతకు సారా ఇష్టం తక్కువ హనికరం. MHTel 293.2

సారా వ్యాపారానికి లైసెన్స్ ఇవ్వటం వలన దిద్దుబాటు చేసుకోవటా నికి ప్రయత్నిస్తున్న వారి ముందు నిత్యం శోధన ఉంచటంలా అయ్యింది. అనుచితాహార వాంఛ విషయంలో అమితానుభ బాధితులను సంస్కరిం టానికి తోడ్పడే సంస్థలు స్థాపితమాయ్యయి. ఇది ఉదాత్తమైన సేవ. కాని సారా అమ్మకం చట్టసమ్మతమైనంతకాలం అమితానుభవ ప్రేమికులు ఈ సంస్థల నుండి ఎలాంటి లబ్ది పొందలేరు. వారు నిత్యం అక్కడే ఉండలేరు. వారు సమాజంలో తమ స్థానాన్ని మళ్ళీ అక్రమించాలి. మత్తు పానీయ వాంఛ అదుపులో ఉన్నపూర్తిగా దినిని నశించదు. అన్ని పక్కలా పొంచి ఉన్న శోధన దాడిచేసినప్పుడు వారు తరుచు సులువుగా పడిపోతారు. MHTel 293.3

ఓ దుష్ట జంతవు గల వ్యక్తి దాని దుష్టత్వం ఎరిగి ఉండి కూడా దాన్ని స్వేచ్చగా విడిచి పెడితే అది చెయ్యగల కీడుకి దేశ చట్టాల ప్రకారం అతడు బాధ్యుడు. ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మాటల్లో దుష్టమైనదిగా తెలిసి ఉన్న ఓ జంతువు ఓ మనిషి మరణానికి కారణమైతే ఆ జంతవు సొంతదారుడు దాని దుష్టతకు లేక అజాగ్రత్తగకు తన ప్రాణంతో మూల్యం చెల్లించాలని ప్రభువు ఆజ్ఞాపించాడు. అదే నియమం ప్రకారం, సారా విక్రయదారుడికి లైసెన్స్ ఇచ్చే ప్రభుత్వం ఆ వ్యాపార పర్యవసానాలకు బాధ్యత వహించాలి. ఓ దుష్ట జంతవుకు స్వేచ్చ ఇవ్వం మరన దండనకు అర్హమైన నేరమైతే, సారా వ్యాపారి నేరం మరెంత ఘోరమైనది. MHTel 294.1

లెసెన్సులు ప్రభుత్వ ఖజానాలోకి అదాయాన్ని తెస్తాయన్న విజ్ఞాపనతో వాటిని ఇవ్వటం జరుగుతున్నది. కాని సారా వ్యాపార ఫలమైన నేరగాళ్ళు పిచ్చి వాళ్ళు బిచ్చగాళ్ళు నిమిత్తం అయ్యే విస్తారమైన ఖర్చుతో పోలిస్తే ఈ ఆదాయం ఏపాటిది! సారా మత్తులో ఉన్న వ్యక్తి నేరం చేస్తాడు. అతణ్ణి న్యాయస్థానంలో హజరుపరుస్తారు. సారా అమ్మకాన్ని చట్టబదం చేసినవారు తమ చర్య ఫలితాలను గురించి చర్య చేపట్టటానికి వత్తిడికి లోనవుతారు. అమ్మకానికి వారు అనుమతించిన ఓ పానీయ బాగా ఉన్న ఓ మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది. ఇప్పుడు వారు అతణ్ణి ఖైదుకి లేక ఉరికంబానికి పంపటం అవసరమౌతుంది. అతడి భార్య పిల్లలు అనాధలై తాము నివసించే సమాజం పై ఆధారపడి జీవిస్తారు. MHTel 294.2

ఈ సమస్యకు సంబంధించిన ఆర్ధిక కోణాన్ని మాత్రమే పరిగణించి సారా వ్యాపారాన్ని సహించటం ఎంత బుద్దిహీనం! అయితే మానవుడి జ్ఞానం నాశనం చేసేందుకు మానవుడిలో ఉన్న దేవుని స్వరూపాన్ని వికృతం విరూపం చేసినందుకు, పేదరికానికి భ్రష్టత్వానికి తెచ్చే పిల్లల్ని నాశనం చేసేందుకు పిల్లల్లో తమ తాగుబోతు తండ్రలు ప్రవృత్తులను శాశ్వతం చేస్తున్నందుకు ఏ నష్టపరిహారం పరిహరిస్తుంది? MHTel 294.3