Go to full page →

గృహంలోని వస్తువుల విషయంలో సామాన్యత MHTel 315

మన కృత్రిమ అలవాట్లు అనేక ఉపాకారలను ఎంతో సంతోషాన్ని లేకుండా చేసి మిక్కిలి ప్రయోజనకర జీవితాలు జీవించటానికి మనల్ని అసమర్ధుల్ని చేస్తున్నాయి. ఖరీదైన విస్తారమైన గృహ సామాగ్రి డబ్బు వషయంలోనే కాదు అంతకన్నా వెయ్యిరెట్లు ఎక్కువ విలువైన విషయాల్లో కూడా వ్యర్ధం. వాటి విషయమైన జాగ్రత్త శ్రమ, ఆందోళనపరంగా గృహంలోకి అవి పెనుభారాన్ని తెస్తాయి. MHTel 315.3

వనరులు పరిమితమై గృహంలోని పని తల్లి మీద ఆధారపడ్డ గృహాల విషయంలో సయితం అనేక గృహాల పరిస్తితులు ఎలాగున్నాయి? మంచి గదుల్లోని సామాన్లు గృహస్తుల సౌకర్యాన్ని ఆనందనాకి అనుకూలంగా ఉండవు. విలువైన తివాచీలు. నగిషీగా చిత్రకారుడి పనితోను చెక్కి విలువైన బట్టతో కప్పిన కుర్చీలు మొదలైన సామాన్లు, సున్నితమైన కర్టెన్లు ఉంటాయి. బట్టలు, కుర్చీలు మొదలైన సామాన్లు అలంకరణ వస్తువులు స్థలం లేక ఒకదాని మీద ఒకటి పడుతూ ఉంటాయి. గోడలనిండా పటాలతో ఆ దృశ్యం కంటికి ఆయాసంగా ఉంటుంది. వాటన్నిటిని క్రమంలో ఉంచటానికి దుమ్ము పట్టకుండా ఉంచటానికి ఎంత పని అవసరమౌతుంది! ఈ పని ఫ్యాషన్ కి అనుగుణమైన ఇంకా ఇతరత్రా కృత్రిమ అలవాట్లు గృహిణికి అంతులేని పనిని కల్పిస్తాయి. MHTel 315.4

అనేక గృహాల్లో తల్లి అయిన భార్యకు సామన్య విషయ జ్ఞానం కోసం చదవటానికి భర్తకు నేస్తంగా ఉండటానిక పెరుగుతున్న తన బిడ్డల మనస్సులను గ్రహించటానికి సమయం ఉండదు. ప్రశస్త రక్షకుడు తనతో సన్నిహితంగాను తనకు మిత్రుడుగాను ఉండటానికి ఆమెకు సమయం గాని చోటుగాని ఉండదు. క్రమక్రమంగా ఆమె ఇంటి పని బానిసగా దిగజారి ఆమె బలం సమయం ఆసక్తి సమస్తం వినియోగించటంతో నశించే విషయాలతో ముడిపడి ఉంటాయి తన సొంత గృహంలోనే తాను దాదాపు పరదేశిగా ఉన్నట్లు చాలా ఆలస్యంగా తెలుసుకుంటుంది. తన ప్రియ బిడ్డల్ని ఉన్నత జీవితానికి ప్రభావితం చెయ్యటానికి ఒకప్పుడు తనకున్న తరుణాలు ఆమె ఉపయోగించుకోకుండా దాటిపోతాయి. MHTel 316.1

తల్లితండ్రులు దీనికన్నా తెలివైన ప్రణాళిక ప్రకారం నివసించటనాకి తీర్మానించుకోవాలి. శ్రమను తగ్గించి ఆరోగ్యాన్ని వృద్ధిపర్చే సదుపాయాల్ని సమకూర్చటానికి శ్రద్ధ తీసుకోండి: “మిక్కిలి అల్పులైన యీనా సహోదరులలో ఒకనికి మీరు చేసితి గనుక నాకు చేసితిరి” (మత్తయి 25:40) అంటూ క్రీస్తు ఎవరిని స్వాగతించమని చెప్పాడో వారిని అతిధులుగా పరిగణించటానికి ఏర్పాట్లు చెయ్యండి. MHTel 316.2

మీ గృహంలోకి వాడకానికి నిలిచే సులువుగా పరిశుభ్రంగా ఉంచగల తక్కువ ఖర్చుతో తిరిగి కొనగల సామాన్య సాదాసీదా వస్తువులను సమకూర్చుండి. ప్రేమ, సంతృప్తి ఉంటే మంచి అభిరుచిని అనుసరించటం ద్వారా మీ గృహాన్ని అతి సామన్యంగా అయిన ఆకర్షణీయంగా రూపొందిచుకోవచ్చు. MHTel 316.3