Go to full page →

అమిత శమ్ర MHTel 320

తల్లి శక్తిని జాగ్రత్తగా కాపాడాలి,ఆ మె విలువైన శక్తని కఠినమైన శ్రమలో వ్యయం చేసే బదులు ఆమె చింతలు భారాలు తక్కువ చెయ్యాలి.తాను అవగాహన చేసుకోవాలని తన కుటుంబ సంక్షేమం కోరే భౌతిక చట్టాలను భర్త తరుచు తెలుసుకోడు. జీవనోపాధి పోరాటంలో నిమగ్నమై లేక ధన సంపాదనలో తలమునకలై చింతలు, ఆందోళనలతో సతమతమౌతూ, భార్య పై భారాలు పడి అతి క్లిష్ట సమయంలో ఆమె శక్తిని హరించి, ఆమెను బలహీనపర్చి ఆమెను వ్యాధికి గురి కానిస్తాడు. MHTel 320.3

అనేకమంది భర్తలు తండ్రులు గొర్రల కాపారి విశ్వతనీయత నుంచి పాఠం నేర్చుకోవచ్చు. వేగవంతమైన కష్టభరితమైన ప్రయాణం చేపట్టాల్సిందిగా కోరినప్పుడు యాకోబుకిచ్చిన సమాధానం ఇది. MHTel 320.4

“నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు, గొట్టెలు మేకులు పశు వులు పాలిచ్చుచున్నవి అనియు నా ప్రభువుకు తెలియును. ఒక్క దినమే వాటిని వడిగా తోలిన యెడల ఈ మంద అంతయు చచ్చును.. నా ముందర నున్న మందలను నడుపగలిగిన కొలదిని ఈ పిల్లలు నడువగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చెదను”. ఆదికాండము 33:13,14 MHTel 321.1

జీవిత శ్రమల మార్గంలో భర్త తన ప్రయాణంలోని స్నేహితురాలిని తాను సహించగలిగినంత వరకు “మెల్లగా” నడిపించాలి. భాగ్యం కోసం అధికారం కోసం లోకంలోని రద్దీ పరుగుల నడుమ, అతడు తన పక్క నడవటానికి పిలువబడ్డ ఆమెను ఓదర్చటానికి అదుకోవటానికి తన నడకను ఆపాలి. MHTel 321.2