Go to full page →

32—బిడ్డ MHTel 325

తల్లి అలవాట్లు మాత్రమే కాదు, బిడ్డ శిక్షణ కూడా ఆ హెబ్రీ తల్లితండ్రులకు దూత ఉపదేశంలో చేరి ఉన్నది. ఇశ్రాయేలీలయుల్ని విమోచించాల్సిన బిడ్డ సంసోను తన జననప్పుడు మంచి వంశ పారంపర్యం కలిగి ఉండటం చాలదు. దాని వెంట జాగరూకతో కూడిన శిక్షణ జరగాల్సి ఉంది. పసితనం నుంచి అతడు ఖచ్చితమైన మితానుభవ అలవాట్లులో శిక్షణ పొందాల్సి ఉన్నాడు. MHTel 325.1

స్నానికుడైన యెహోవా విషయంలోన ఇటువంటి ఉపదేశమే ఇవ్వటం జరిగింది. బిడ్డ జననానికి ముందు తండ్రికి పరలోకం నుంచి వచ్చిన వర్తమానం ఇది. MHTel 325.2

“అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షా రసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్దాత్మతో నిండి(కొని)నవాడై” ఉంటాడు లూకా 1:14,15 MHTel 325.3

పరలోకంలో ఉన్న గొప్ప వ్యక్తుల జాబితాలో స్నానికుడైన యోహాను కన్నా ఉత్తముడు ఇంకొక్కడు లేడని రక్షకుడు ప్రకటించాడు. అతడికి నిమితమైన పనికి శారీరక శక్తి సహనం అగత్యమవ్వటమే గాక. మనసు తాలూకు, ఆత్మ తాలూకు అత్యున్నత గుణ లక్షణాలు కూడా అగత్య మౌతాయి. ఈ పనికి సిద్ధబాటుగా సరియైన శారీరక శిక్షణ ఎంత ప్రాముఖ్యమైనదంటే పరలోకంలోని అత్యున్నత దేవదూత ఓ వర్తమానంతో బిడ్డ తల్లితండ్రుల వద్దకు వచ్చేంతటిది. MHTel 325.4

బిడ్డ శారీరక క్షేమానికి హాని కలిగించే దాన్ని ఆశ్రద్ధ చెయ్యకూడదని హెబ్రీ పిల్ల గురించి దేవుడిచ్చిన ఉపదేశం చెబుతున్నది. ఏదీ అప్రాముఖ్యమైనది కాదు. శరీరారోగ్యానికి కీడు చేసే ప్రతీ ప్రభావం మనసుకు ప్రవర్తనకు కూడా కీడు చేస్తుంది. MHTel 325.5

పిల్లల అరంభ దశలో శిక్షణకు చాలా ప్రాముఖ్యమైనది. ప్రవర్తన నిర్మాణానికి జీవిత దిశానిర్దేశానికి అనంతర సంవత్సరాల ఉపదేశం అంతటి కన్నా శైశవంలోను బాల్యంలోను నేర్చుకున్న పాఠాలు, ఏర్పర్చుకున్న ల్జాఅలవాట్లు ఎక్కువ తోడ్పడతాయి. MHTel 325.6

తల్లితండ్రులు దీన్ని పరిగణలోనికి తీసుకోవాలి. పిలల గూర్చిన శ్రద్ద శిక్షణకు సంబంధించిన నియమాలు వారు అవగాహన చేసుకోవాలి. వారు తమ పిల్లల్ని శారీరకమైన, మానసికమైన, నైతికమైన ఆరోగ్యంలో పెంచటానికి సమరుధలై ఉండాలి. తల్లితండ్రులు ప్రకృతి చట్టాలను అధ్యయనం చెయ్యాలి. మానవ శరీర యంత్రాగంతో వారు పరిచయం ఏర్పర్చుకోవాలి. వివిధ అవయవాల విధులు, వాటి సంబధం ఆధారం వారు అవగాహన చేసుకోవటం అవసరం. శరీర శక్తులతో మానసిక శక్తుల సంబంధాన్ని వాటిలోని ప్రతీది ఆరోగ్యవంతగా పని చెయ్యటానికి అవసర మైన పరిస్థితులను వారు అధ్యయనం చెయ్యాలి. అటువంటి సిద్ధబాటు లేకుండా తల్లితండ్రులవ్వటం పాపం. MHTel 326.1

నేడు మిక్కిలి నాగరికమైన భాగ్యవంతమైన దేశాల్లో సయితం పెచ్చరిస్తు ఉన్న మరణాలు, వ్యాధి క్షీణత వెనుక ఉన్న కారణాలను గురించి చాలా తక్కువగా ఆలోచించటం జరుగుతున్నది. మానవ జాతి క్షీణిస్తున్నది. మూడింట ఒక వంతు శిశు మరణాలు సంభవిస్తున్నాయి. పురుష స్థాయికి స్త్రీ స్థాయికి చేరిన వారిలో అధిక సంఖ్యాకులు ఏదో రూపంలో వ్యాధికి గురి అవుతున్నారు. కాని బహు కొద్దిమంది మాత్రమే మానవ జీవిత హద్దును చేరగలుగుతున్నారు. MHTel 326.2

శిశు మరణాల్ని గూర్చిన గణాంకం 1095లో ఈ పుస్తకం రాయబడ్డప్పుడు ఖచ్చితమే, నవీన విజ్ఞానశాస్త్రం.సరియైన శిశు సంరక్షణ శిశువులు చిన్న పిల్లల మరణాల్ని చాలా వరకు తగ్గించాయి ప్రచురణ కర్తలు. MHTel 326.3

మానవ జాతికి దు:ఖం తెస్తున్న కీడుల్లో ఎక్కువ భాగాం నివారించవచ్చు. వాటిని నివారించే శక్తి చాలా మేరకు తల్లితండ్రుల వద్ద ఉన్నది. చిన్న పిల్లల్ని తీసుకుపోయేది “మార్మికమైన దేవశక్తి” కాదు. దేవుడు వారి మరణాన్ని కోరడు. ఇక్కడ ప్రయోజకత్వానికి, ఆనందం పరలోకానికి తర్బీతు చెయ్యటానికి తల్లితండ్రులకు ఆయన వారిని ఇస్తాడు. తల్లితండ్రులు తమ పిల్లలకు మంచి వారసత్వం ఇవ్వటానికి తాము చెయ్యవలసింది చేసి ఆ మీదట సరియైన యాజమాన్యం వలన వారి జననానికి తప్పుడు పరిస్థితులు ఏవైనా ఉంటే వాటిని సరి చెయ్యటానికి ప్రయత్నిస్తే లోకం ఎంత గొప్ప మేలి మలుపు చూసేది ! - MHTel 326.4