Go to full page →

మార్పు కలిగించే జ్ఞానం MHTel 368

క్రీస్తులో వెల్లడైనట్లు దేవుని గూర్చిన జ్ఞానం రక్షించబడిన వారందరికి ఉండాల్సిన జ్ఞానం, అది ప్రవర్తనను మార్చే జ్ఞానం. అది ప్రవర్తన మార్చే జ్ఞానం స్వీకరించిన ఈ జ్ఞానం ఆత్మను దేవుని స్వరూపంలో తిరిగి సృజిస్తుంది. అది వ్యక్తి అంతటికి దైవికమైన ఓ ఆధ్యాత్మిక శక్తిని అపాదిస్తుంది. MHTel 368.3

“మనమందరమును మనసుకు లేచి ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడు చున్నాము”. 2 కొరి. 3:18 MHTel 368.4

తన సొంత జీవితం గురించి రక్షకుడున్నాడు: “నేను నా తండ్రి ఆజ్ఞలను” గైకొంటున్నాను. యోహాను 15:10“నన్ను పంపిన వాడు నాకు తోడైయున్నాడు; ఆయనికష్టమైన కార్యము నేనుల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచి పెట్టలేదు”యోహాను 8:29 యేసు మానవ స్వభావంలో ఉన్నట్లే తన అనుచరులూ ఉండాలని దేవుడు కోరతు న్నాడు.రక్షకుడు జీవించిన జీవితం ఆయన శక్తిలో మనంజీవించాల్సి ఉన్నాం. MHTel 368.5

పౌలు ఇలా అంటున్నాడు. “ఈ హేతువు చేత, పరలోకమందును, భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి యెదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపర్చబడునట్లు గాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్దులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతుఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తి గలవారు కావలెననియు ప్రార్ధించుచున్నాము” ఎఫెసీయులకు 3:14-19. MHTel 369.1

“మేమును మీ నిమిత్తము ప్రార్ధన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ది పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలె ననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బల పర్చబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్దుల స్వాస్థ్యములో పాలివరగు టకు మనలను చెల్లింపవలెననియు దేవుని బ్రతిమాలు చున్నాము”. కొలొస్సయులకు 1:9-12 MHTel 369.2

ఈ జ్ఞానాన్ని పొందవలసినదిగా దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దీని పక్క తక్కినదంతా వ్యర్ధం, శూన్యం. MHTel 369.3

*****