Go to full page →

ఆత్మ పరిత్యాగం అవసరం ఎక్కువ MHTel 399

ఆత్మ వంచన, స్వయం సమృదత అందుమూలంగా శక్తికి మూలమైన దేవునికి దూరమవ్వటం మానవుడి గొప్ప ప్రమాదం. మన స్వాభావిక ప్రవృత్తులు దేవుని ఆత్మ వలన సంస్కరించబడకపోతే నైతకి మరణానికి అవి విత్తనాలవుతాయి.దేవునితో ప్రధానంగా అనుసంధాన పడకపోతే స్వార్ధ వాంఛలుస్వార్ద ప్రేమ,పాపం చెయ్యటానికి శోధనల అపవిత్ర పలితాల్ని మనంజయించలేం. క్రీస్తు సహాయాన్ని పొందదటానికి మనం మన అవస రాన్ని గుర్తించాలి.మనల్ని గూర్చిన యదార్ధ జ్ఞానంమనకుండాలి. తాను పాప నిన గ్రహించిన వ్యక్తినే క్రీస్తు రక్షించగలడు. మన పూర్తి నిస్సహాయతను గుర్తించి ఆత్మ విశ్వాసాని పరిత్యజించినప్పుడే మనం దైవిక శక్తిని ఆశ్రయిస్తాం. MHTel 399.5

ఆత్మ పరిత్యాగం చెయ్యటమన్నది క్రైస్తత్వ జీవిత ఆరంభలోనే కాదు. పరలోకం దిశగా ముందుకు వేసే ప్రతీ అడుగుకి దాన్ని నవీకరించుకోవాలి. మన మంచి కార్యా లన్ని మన వెలుపల ఉన్న ఓ శక్తి మీద ఆధారపడి ఉంటాయి. కనుక మన హృదయం నిత్యం దేవుని పై నిలవాలి. నిత్యం చిత్తశు ద్దితో పాపాన్ని ఒప్పుకోవాలి. నిత్యం ఆత్మ ఆయన ముందు తనను తాను తగ్గించుకోవాలి. ప్రమాదాలు మనల్ని చుట్టుముట్టి ఉన్నాయి. మన బలహీ నతల్ని గుర్తించి విశ్వాసంతో మన విమోచకుని హస్తాన్ని పట్టుకు న్నప్పుడే మనం క్షేమంగా ఉండగలం. MHTel 400.1