Go to full page →

దేవుని స్పష్టమైన ప్రత్యక్షతలు MHTel 409

దేవుని ప్రవర్తన ప్రత్యక్షతల స్పష్టత విషయంలో ఉన్నతస్థాయి మరింత ఉన్నతస్థాయి చేరగలగటం మనకున్న విశేషావకాశం. “దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా” మోషేని ప్రభువు మందలించలేదు. అతడి మనవి అంగీకరించాడు“నా మంచితనమంతయు నీయెదుట కనుపం చెదను; యెహోవా అను నామమును నీ యెదుట ప్రకటించెదను”. అన్నాడు నిర్గమకాండము 33:18, 19 MHTel 409.1

మన మనసును మన గ్రహణ శక్తులను చీకటి చేసేది పాపమే. మన హృదయాల్లో నుంచి పాపాన్ని కడిగివేయబడ్డప్పుడు క్రీస్తు ముఖంలోని దేవుని జ్ఞానం వెలుగు ప్రభావం- ఆయన వాక్యాన్ని వెలుగుతో నింపి, ప్రకృతి ముఖం నుంచి ప్రతిబింబించే మహిమ - ఆయన్ని “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల” వానిగా మరింత సంపూర్తిగా ప్రకటిస్తుంది. నిర్గమ 34:6 MHTel 409.2

మనసు, హృదయం, ఆత్మ ఆయన పరిశుద్ధతా స్వరూపానికి మార్పు చెందేవరకు ఆయన వెలుగులో మనం వెలుగు చూస్తాం. MHTel 409.3

దైవ వాక్యంలో దైవిక హామీని ఇలా వివ్వసించేవారికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. వారి ముందు విశాలమైన సత్య నిధులు, శక్తికి విస్తారమైన వనరులు ఉన్నాయి. బైబిలులో ఉన్నాయని వారు ఊహించన విశేష హక్కులు విధులు వారికి కనిపిస్తాయి. దీనులై విధేయతతో ఆయన ఉద్దేశాలను నెరవేర్చుతూ నడిచేవారందరూ దైవ వాక్యాన్ని ఇంతలంతలుగా గ్రహిస్తారు. MHTel 409.4

“నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి; నాకు శత్రవులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి... నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్దుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు.” కీర్తనలు 119:98-100 MHTel 409.5

విద్యార్ధి తన మార్గదర్శిగా బైబులుని ఎంపిక చేసుకొని నియమానికి ధృడంగా నిలబడాలి. అప్పుడు అతడు ఎంత ఉన్నత సాధననైనా ఆకాంక్షించ వచ్చు. దేవున్ని సర్వాధికారిగా గుర్తించినప్పుడు మానవ స్వభావాన్ని గూర్చిన తత్వాలన్నీ గందరగోళానికి సిగ్గుకు దారి తీస్తాయి. కాని దేవుని వల్ల ఏర్పడ్డ ప్రశస్త విశ్వాసం ప్రవర్తనకు శక్తిని సౌజన్యతను ఇస్తుంది. ఆయన మంచితనాన్ని, కృపను, ప్రేమను గుర్చి ధ్యానించినప్పుడు సత్యాన్ని స్పష్టంగా అవగాహన చేసుకోగలుగుతాం. హృదయ పవిత్రత కోసం స్పష్టమైన ఆలోచన కోసం ఆకాంక్ష ఉన్నప్పుడు పరిశుద్ధం అవుతుంది. పరిశుద్ధ ఆలోచన స్వచ్చమైన వాతావరణంలో నివసించే ఆత్మ వాక్య పఠనం ద్వారా దేవునితో సాన్నిహిత్యం వలన మార్పు చెందుతుంది. సత్యం ఎంతో విశాలమైనది. ఎంతో దీర్ఘమైనది, ఎంతో లోతైనది, ఎంతో వెడల్పయినది గనుక స్వార్ధం మరుగున పడుతుంది. హృదయం మెత్తబడి వినయం, దయ ప్రేమ అదుపులో ఉంటుంది. MHTel 410.1

పరిశద్దు విధేయత కారణంగా సహజ శక్తులు విశాలమౌతాయి. జీవ వాక్య అధ్యయనం పట్ల విద్యార్థుల మనసులు విశాలం సమున్నతం ఉదాత్తం అవుతాయి. దానియేలులా వారు దేవుని మాట వినేవారు చేసేవారు అయితే అతడిలా వారు కూడా సకల విధాల జ్ఞానంలోను పురోగమించవచ్చు. శుద్ద మనస్సు గలవారు గనుక వారు ధృడ మనస్సు గలవారు కావచ్చు.. ప్రతీ మానసిక శక్తి చైతన్యవంతం అవుతుంది. వివేకం శక్తి గల దేవునితో సంబంధమున్నప్పుడు మనుషుడు ఎలా తయారు కాగలడో, ఏమి చెయ్యగలడో తమ ప్రభావ పరిధిలో ఉన్నవారందరు చూడగలిగేటట్లు వారి విద్య వారి క్రమశిక్షణ ఉంటాయి. MHTel 410.2