Go to full page →

సమర్పణ నమ్మకం MHTel 456

మనం ఇల విరిగి నలిగిన హృదయులం అయినప్పుడు మనకు ఆయన తన్ను తాను కనపర్చుకునే స్థానంలో మనం నిలబడతాం. గతమందు ఆయన కృపలు, దీవెనల కారణంగా ఇంకా ఎక్కువ దీవెనలు ఆయన మనకు అనుగ్రహించాలని వేడుకున్నప్పుడు ఆయన ఆనందిస్తాడు. ఆయనను సంపూర్తిగా విశ్వసించేవారు ఆశించే వాటిని బహుగా నెరవేర్చు తాడు. తన పిల్లలకు ఏమి అవసరమో మానవులకు మేలు చెయ్యటానికి మనం ఎంత దైవిక శక్తి వినియోగిస్తామో ప్రభువైన యేసుకు తెలుసు. ఇతరులకు మేలు చెయ్యటానికి మనం ఉపయోగించేది మన సొంత ఆత్మలను ఉదాత్తం చేసుకునేందుకు ఉపయోగించేది అంతా ఆయన మనకు ఇస్తాడు. MHTel 456.2

మనంతటమనం చెయ్యగలిగిన దానిలో తక్కువ మన కోసం మన ద్వారా ప్రభువు ఏమి చెయ్యగలడో దానిలో ఎక్కువ విశ్వాసం ఉంచాలి. మీరు చేస్తున్నది మీ సొంత పనికాదా; దేవుని పని. మీ చిత్రాన్ని మీ మార్గాన్ని ఆయనకు సమర్పించండి. స్వార్ధం విషయంలో ఒక్క మినహాయింపు ఒక్క రాజీకి పాల్పడవద్దు. క్రీస్తులో స్వేచ్చగా ఉండటమంటే ఏమిటో తెలుసుకోండి. MHTel 456.3

మన వ్యక్తిగత అనుభవంలోకి బైబిలు సత్యాల్ని తర్జుమా చేయ్యకపోతే ప్రతీ సబ్బాతూ కేవలం ప్రసంగాలు వినటం, బైబిలును సొంతంగా చదవటం లేక వచనం వారీగా బైబిలుని విశదీకరించగలగటం మనకు గాని మనం చెప్పేది వినేవారికి గాని ఎలాంటి లబ్ది చేకూర్చదు. మన అవగాహన, మన చిత్తం, మన ప్రేమలు దేవుని వాక్యం అదుపులోకి రావాలి. అప్పుడు పరిశు ద్దాత్మ పని ద్వారా వాక్యంలోని సూత్రాలు జీవిత నియమాలవుతాయి. MHTel 457.1

మీకు సహాయం చెయ్మని ప్రభువును ఆర్దించేటప్పుడు ఆయన దీవెను పొందుతున్నట్లు నమ్మటం ద్వారా రక్షకున్ని ఘనపర్చండి. శక్తి అంతా, వివేకమంతా మన అదుపాజ్ఞల్లో ఉంటాయి. ఆడగటమే మనం చెయ్యాల్సింది. MHTel 457.2

దేవుని వెలుగులో నిత్యం నడవండి, ఆయన ప్రవర్తన దివారాత్రులు ధ్యానించండి. అప్పుడాయన సౌందర్యాన్ని చూసి ఆయన మంచితనంలో ఆనందిస్తారు. మీ హృదయం ఆయన ప్రేమ స్పృహతో వృద్ధి చెందుతుంది. ఆయన నిత్యం మన హస్తాల్లో లేచినట్లు మీరు పైకి లేస్తారు. దేవుడు అనుగ్రహించే శక్తి వెలుగుతో మీరు మరింత అవగాహన చేసుకొని మున్నెన్నడూ సాధ్యమని మీరు భావించని దానికన్నా ఎక్కువ సాధించ గలుగుతారు. MHTel 457.3