Go to full page →

శిష్యుల సేవ MHTel 107

తన పేరు గల సువార్తను రాసిన లూకా వైద్య మిషనెరీ, లేఖనాల్లో అతడు “ప్రియమైన వైద్యుడు”గా పిలవబడ్డాడు. కొలొస్స 4:14 వైద్యుడిగా అతడి నిపుణతను గూర్చి అపొస్తలుడు పౌలు విని ప్రభువ అతడికి ప్రత్యేకమైన పనిని అప్పగించినట్లుగా గుర్తించి అతణ్ణి వెతికాడు. పౌలు అతడి సహకారాన్ని పొందాడు. కొంతకాలం పౌలు ప్రయాణాల్లో అతడు పౌలుతో వెళ్ళాడు. కొంతకాలమైన తరువాత పౌలు లూకాను మాసిదోనియు లోని ఫిలిప్పీలో విడిచి పెట్టాడు. ఇక్కడ లూకా అనేక సంవత్సరాలు వైద్యుడిగాను సువార్త బోధకుడిగాను సేవ చేసాడు. వైద్యుడుగా తన సేవలో అతడు రోగులకు పరిచర్య చేసాడు అనంతరము వ్యాధి బాధితుల పైకి స్వస్ధత శక్తిని పంపవలసినదిగా దేవునికి ప్రార్ధన చేసాడు. సువార్త వర్తమానానికి ఇలా మార్గం సుగమం చెయ్యటం జరిగింది. వైద్యుడుగా లూకా జయం అన్యుల మధ్య క్రీస్తును ప్రకటించటానికి అతడికి అనేక అవకాశాలు కల్పించింది. మనం శిష్యులు పనిచేసినట్లు పనిచెయ్యాలని దేవుడు సంకల్పించాడు. శారీరక స్వస్థత సువార్త ఆదేశంతో ముడిపడి ఉన్నది. సువార్త సేవలో బోధ స్వస్థత రెంటినీ విడదీయ కూడదు. MHTel 107.1

శిష్యులకు అప్పగించిన పని సువార్త జ్ఞానాన్ని విస్తరింపజెయ్యటం. మానవులకు క్రీస్తు తెచ్చిన శుభవార్తను లోకానికి ప్రకటించే పని వారికి అప్పగించాడు ఆయన. ఆ కాలంలోని ప్రజలకు వారు ఆ శుభవార్తను అందించారు. ఒక్క తరంలోనే సువార్తను ప్రతీ జాతికి అందించటం జరిగింది. MHTel 107.2

లోకానికి సువార్తను అందించే పనిని దేవుడు తన నామమం ధరించన వారికి అప్పగించాడు. లోకంలోని పాపానికి దు:ఖానికి విరుగుడు సువార్త ఒక్కటే. దాని స్వస్థత శక్తిని ఎరిగివారి ప్రథమ కర్తవ్యం మానవులందరికి దేవుని కృపావర్తమానం ప్రకటించటం. ప్రభువగు యెహోవా ఆత్మ నీ మీదికి వచ్చియున్నది. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహవా నన్ను అభిషేకించెను. నలిగిని హృదయము గలవారిని ధృడపర్చుటకును చెరలో నునన్నవారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును”.యెషయా 61:1 MHTel 107.3

సువర్తమానంతో యేసు శిష్యుల్ని పంపినప్పుడు లోకంలో దేవుని పైన దేవుని వాక్యం పైన విశ్వాసం దాదాపు నశించిపోయింది. యెహోవా జ్ఞానం తమకున్నదని చెప్పుకునే యూదు ప్రజలు దైవవాక్యాన్ని పక్కన పెట్టి సాంప్రదాయం మానవ ఊహాగానాలు సమ్మటం మొదలు పెట్టాడరు. స్వార్ధం, హంగు ఆర్భాటం, లాభాపేక్ష వీటి పైనే మనుషుల ఆలోచనలు నిలిచాయి. దేవుని పట్ల భక్తిభావం లేకపోవడంతో, మనుషుల పట్ల ప్రేమ కూడా పోయింది. స్వార్ధం రాజ్యమేలింది. మానవవాళి దు:ఖం భ్రష్టతో సాతాను తన చిత్రాన్ని నెరవేర్చుకుంటున్నాడు. MHTel 108.1

సాతాను ప్రతినిధులు మనుషుల్ని స్వాధీనపర్చుకున్నారు. దేవుని నివాసానికి నిర్మితమైన మానవ శరీరాలు దయ్యాలకు అపాసానాలయ్యాయి. మనుషుల జ్ఞానేంద్రియాలు, నరాలు, అవయవాలను అతి నీచ, మోస పూరిత కార్యాలు చేయ్యటానికి దుష్ట దూతలు వినియోగిస్తున్నారు. మనుషుల ముఖాల పై దయ్యాల ముద్ర పడింది. మనుషుల్ని పట్టి పీడిస్తున్న దురాత్మల సమహాల వైఖరులను మానవ ముఖాలు ప్రతిబింబిస్తున్నాయి. MHTel 108.2

నేడు ప్రపంచ పరిస్థితి ఏమిటి? క్రీస్తు రోజుల్లో సంప్రదాయం రబ్బీల మత తత్వవాదం సమాజాన్ని అతలాకుతలం చేసినట్లు, నేడు అదే ఉదృ తితో ఉన్నత విమర్శ ఊహజనిత సిద్ధాంతాలు బైబిలులో విశ్వాసాన్ని నాశనం చెయ్యటం లేదా? దురాశ, అత్యాశ, వినోదం పై ఎనలేని మక్కువ అప్పటి లాగనే నేడు మనుషుల హృదయాలపై బలమైన పట్టు సాధించలేదా? MHTel 108.3

క్రైస్తవులుగా పేరున్న క్రైస్తవ లోకంలో క్రీస్తు సంఘాలుగా చెప్పుకుంటున్న సంఘాల్లో సయితం క్రైస్తవ నియమాల్ని ఎంత తక్కువ మంది పాటిస్తున్నారు. వ్యాపారంలో సాంఘికంగా, గృహ పరిధిలో మత సమాజాల్లో సైతం ఎంత తక్కువ మంది క్రీస్తు బోధనలను తమ దైనందిన జీవిత నియమంగా పాటిస్తున్నారు.“న్యాయమునకు అటంకము కలుగుచున్నది. నీతి దూరమున నిలుచుచున్నది... ధర్మము లోపల ప్రవేశింపనేరదు... చెడు తనము విసర్జించువాడు దోచబడుచున్నాడు” ఇది నిజం కాదా? యెషయా 59:14, 15 MHTel 108.4

మనం “నేరం అనే అంటువ్యాధి” ప్రబలుతున్న సమయంలో నివసిస్తున్నాం . ఇది చూసి అన్ని చోట్లా ఆలోచనాపరులు దైవ భీతిగల మనుషును విభ్రాంతి చెంందుతున్నారు. ప్రబులుతున్న అవినీతి మానవ కలం వర్ణించశక్యం కానిది. రోజు రోజుకు రాజకీయ సంఘర్షణ, లంచగొండి తనం, మోసం తాజాగా బయలుపడుతున్నాయి. హింస, చట్టరాహిత్యం , మానవ వేదన పట్ల ఉదాసీనత, మానవ ప్రాణాల్ని క్రూరంగా, పైశాచికంగా నాశనం చెయ్యటం... వీటిని గూర్చిన కథనాలు ఏనాటి కానాడు వెల్లడవుతున్నాయి. ప్రతీరోజు ఉన్మాదం, హత్యలు, ఆత్మహత్యలు పెరుగు తున్నాయి. మనసును దుర్నీతితో, నింపి శరీరాన్ని అపవిత్ర పర్చి నాశనం చెయ్యటానికి మనుషుల మధ్య సాతాను ప్రతినిధులు తీవ్రంగా పనిచేస్తున్నారన్న విషయాన్ని ఎవరు శంకించగలరు? MHTel 109.1

ఈ కీడులతో ప్రపంచం నిండుతుండగా మనుషుల అంతరాత్మపై లేక జీవితాల పై ఏమంత ప్రభావం చూపని విధముగా తరచు నిర్లక్ష్యంగా సువార్తను సమర్పించటం జరుగుతున్నది. అన్ని చోట్ల మనుషులు తమకు లేనిదేదో దాని కోసం తాపత్రయ పడుతున్నారు. పాపం పై తమకు జయా న్నిచ్చే శక్తి కోసం, దుష్టత దాస్యం నుండి తమను విడిపించగల శక్తి కోసం, ఆరోగ్యం జీవితం, సమాధానం తమకివ్వగల శక్తి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు దేవుని వాక్యాన్ని ఎరిగిన అనేకులు దేవున్ని గుర్తించని చోట్ల నివసిస్తున్నారు. వారు దేవుని సన్నిధి కోసం వెంప ర్లాడుతన్నారు. MHTel 109.2

రెండువేల సంవత్సరాల క్రితం లోకానికి ఏది అవసరమయ్యిందో తమ మేలు కోరినవానిగా రక్షకుడు ప్రజలతో కలసి మెలసి ఉన్నాడు. వారి పట్ల సానుభూతి కనపర్చాడు. తమ అవసరాల్లో వారకి పరిచర్య చేసాడు. వారి నమ్మకాన్ని పొందాడు. “నన్ను వెంబడించుడి” అని అప్పుడు వారిని ఆదేశించాడు. MHTel 109.3

వ్యక్తిగత కృషి ద్వారా ప్రజలకు దగ్గరవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రసంగాలకు తక్కువ సమయం,, వ్యక్తిగత పరిచర్యకు ఎక్కువ సమయం ఇచ్చినట్లయితే మరెక్కువ ఫలితాలు కనిపిస్తాయి. బీదవారికి సహాయమందించాలి. రోగులకు చికిత్స ఆలన పాలన జరగాలి. దు:ఖిస్తున్నవారిని ఆత్మీయుల్ని పోగొట్టుకున్న వారిని ఓదార్చాలి. అజ్ఞానులకు ఉపదేశం ఇవ్వాలి. అనుభవం లేనివారికి సలహాలు సూచనలు ఇవ్వాలి. దు:ఖించే వారితో దు:ఖించాలి, సంతోషించే వారితో సంతోషించాలి. ఒప్పింపజేసే శక్తి ప్రార్ధించే శక్తి దేవుని ప్రేమా శక్తి సహాయంతో ఈ సేవ ఫలాలు లేకుండా ఉండదు. ఉండటం సాధ్యం కాదు. MHTel 110.1

వైద్య మిషనెరీ సేవ లక్ష్యం పాప రోగులైన పురుషులకు స్త్రీలకు లోకపాపాలు మోసుకొని పోయే కల్వరి యోధుణ్ణి చూపించటం. ఆయన్ని వీక్షించటం ద్వారా వారు ఆయన రూపానికి మార్పు చెందుతారు. యేసు వంక చూసి జీవించేందుక రోగులను, బాధపడుతున్నవారిని ప్రోత్సహించాలి. శరీర సంబంధమైన, ఆధ్మాత్మికమైన వ్యాధితో బాధపడుతూ నిరాశకు గురి అయిన వారి ముందు పనివారు మహావైద్యుడైన క్రీస్తును నిత్యమూ ఉంచుదురు గాక, శారీరక వ్యాధిని, ఆధ్మాత్మిక వ్యాధిని రెండింటినీ స్వస్థ పర్చగల ఆయనను వారికి చూపించండి. మన బలహీనతలయందు మనతో సహానుభవం గల ఆయన్ని గురించి వారికి చెప్పండి. తమకు నిత్య జీవం సాధ్యపర్చటానికి తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఆయన శ్రద్ధాసక్తులకు తమను అప్పగించుకోవాల్సిందిగా వారిని ప్రోత్సహించండి. ఆయన ప్రేమను గురించి మాట్లాడండి. రక్షించటానికి ఆయన కున్న శక్తిని గురించి చెప్పండి, MHTel 110.2

వైద్య మిషనరీ సేవ సువార్త సేవకు నాంది వాక్య సేవలోను వైద్య మిషనెరీ సేవలోను సువార్తను ప్రకటించి ఆచరణలో పెట్టాలి. వాక్య బోధ వినని వారు లేక మతారాధనలకు హాజరు కానివారు దాదాపు ప్రతీ సమాజంలోనూ పెద్ద సంఖ్యలోనే ఉంటారు. వారికి సువార్త అందజెయ్యా లంటే వారి గృహల్లోకి దాన్ని తీసుకువెళ్ళాలి. తరుచు వారి భౌతికమైన అవసరాల్ని తీర్చటంలో చేయూత ద్వారా మాత్రమే వారి వద్దకు వెళ్ళటానికి మార్గం ఏర్పడవచ్చు. వ్యాధిగ్రస్తులకు సేవలు చేసి దు:ఖంలో ఉన్న పేదలకు ఉపశమనం కలిగించే మిషనెరీ నర్సులు, వారితో ప్రార్ధన చెయ్యటానికి వారికి దైవ వాక్యాన్ని చదివి వినిపించటానికి, రక్షకుని గురించి మాట్లాడ టానికి అనేకమైన తరుణాలు కలుగతాయి. ఆవేశం తమను దిగజార్చినందువల్ల ఆహార పానాలు ఇతర వ్యసనాలకు బానిసలైన నిస్సహాయులతో కలసి వారి కోసం ప్రార్ధన చెయ్యవచ్చు. పరాజయం పొంది నిరుత్సాహం, నిస్పృహాలకు గురి అయిన వారి జీవితాల్లోకి ఆశా కిరణాన్ని తేవచ్చు. MHTel 110.3

అనేకులకు దేవునియందు విశ్వాసం ఉండదు. మానవుడిలో వారి విశ్వాసం నశిస్తుంది. కాని ప్రతిఫలా పేక్ష లేని కార్యాల్లో వెల్లడయ్యే నిస్వార్ధ ప్రేమను వారు అభినందిస్తారు. లోక సంబంధమైన కీర్తి లేక పారితోషికం వంటి ప్రలోభం లేకుండా తమ ఇళ్ళల్లోకి వచ్చి రోగులకు సేవలు చేయ్యటం ఆకలితో బాధపడుతున్నవారికి ఆహారం పెట్టటం, బట్టలు లేనివారికి బట్టలివ్వటం, దు:ఖంలో ఉన్నవారిని ఓదార్చుటం చేస్తూ ఎవరి ప్రేమకు, దయకు ఆ మానవ ప్రతినిధి ఓ దూతో, ఆ ప్రభువును వారు చూపిస్తారు. వారు ఇది చూసినప్పుడు వారి హృదయాలు ద్రవిస్తాయి. కృతజ్ఞత పెల్లుబుకుతుంది. విశ్వాసం రగుల్కొంటుంది. దేవుడు తమను ప్రేమిస్తు న్నాడని వారు గుర్తిస్తారు. ఆయన వాక్యాన్ని బోధించినపుడు వారు వింటారు. MHTel 111.1

విదేశ మిషన్లు సేవలోనే గాని స్వదేశ సువార్త సేవలోనే గాని మిషనెరీలందరూ వారు పురుషులే గాని స్త్రీలే గాని, వ్యాధిగ్రస్తులకు సేవ చెయ్యగలిగితే ప్రజల్ని సులభంగా కలవటం, తమ ప్రయోజకత్వం ఎక్కువ్వటం చూస్తారు. విదేశాలకు మిషనెరీలుగా వెళ్లదలచే మహిళలు ఆ దేశాల్లోని స్త్రీలను కలుసుకోవటానికి ప్రతీ మార్గం మూయబడ్డప్పుడు ఆ మహిళలకు సువార్త అందించటానికి ఇలా అవకాశం లభించవచ్చు. బాధను ఉపశమింపజేసి వ్యాధిని తొలగించే సామన్య చికిత్సలు ఎలాగి వ్వాలో సువార్త పనివారందరు నేర్చుకోవచ్చు. MHTel 111.2