Go to full page →

నిస్స్వార్థ జీవితము ద్వారా దేవుని చూపించుట CChTel 201

అధిక సంఖ్యాకులు చేయుచున్న పాపమును, మనలను దేవునికి దూరస్తులను చేసి అనేక ఆధ్యాత్మికపు కల్లోలములను రేపుచున్న పాపమును స్వార్థప్రియత్వమే. ఆత్మోపేక్ష ద్వారానేతప్ప ప్రభువును తిరిగి హత్తుకొనలేము. మనకై మనమేమియు చేయజాలము. కాని దేవుని సహాయము వలన ఇతరులకు మేలు చేయుటకు మనము జీవించి తద్వారా స్వార్థ ప్రీతిని విసర్జిపగలము. దేవుని కొరకు ప్రయోజనకరమైన, నిస్స్వార్థమైన జీవితము జీవించవలెనను ఆసక్తిని ప్రదర్శించుటకు మనము అన్భఊభాగములకు పోనక్కరలేదు. దీనిని మనము మన గృహమందు, సంఘమందు, మన స్నేహితులమధ్య నిర్వహించవలసి యున్నాము. “నేను దినదినము చనిపోవుచున్నాను” అని పౌలు చెప్పగలిగెను. మన దైనందిన కార్యకలాపములలో స్వార్థమునకు దినదినము మరణించుటద్వారా మనము విజేతలము కాగలము. ఇతరులకు మేలు చేయు నాసక్తితో మనము స్వార్థమును విస్మరింపవలెను. అనేకులు పొరుగు వారికి చూపవలసిన ప్రేమలో తమ కర్తవ్యమును నమ్మకముగా జరిగించుటకు బదులు తమ విలాసములలో నిమగ్నులగు చున్నారు. CChTel 201.1

పరమమందెవరును స్వార్థమును గూర్చిగాని, స్వకీయేచ్ఛలనుగూర్చిగాని, తలంచరు. కాని అందరును పవిత్రమైన యధార్థమైన ప్రేమ కలిగి తమచుట్టునున్న మోక్షరాజ్యవాసులను ఆనందపరచ జూచెదరు. నూతన భూమి యందలి సమాజములో మనము ఆనందించగోరెదమేని, ఇక్కడ మనము పరలోక సూత్రములకు కట్టుబడి యుండవలెను. 72T 132, 133; CChTel 202.1

మనకు నిర్దుష్టమైన, నిశ్చితమైన మాదిరి యుండగా తప్పులు చేయుటకు వీలున్న మానవ మాత్రులను మాదిరిగాగొని మనలో మనము ఎక్కువగా పోల్చుకొనుచున్నట్లు నాకు కనపర్చబడెను. ప్రంచముతోగాని, ప్రపంచ మానవుల ఉద్దేశ్యములబట్టిగాని, సత్యమును స్వీకరించకముందు మనమున్న స్థితినిబట్టిగాని, మనము సరిచూచుకొనరాదు. లోకమందు మన విశ్వాసస్థాయి మనము క్రీస్తు వారమైనప్పటికనుండి జీవితములో పురోగమించినచో మన మెట్లుందుమో అను విషయముతో సరిచూచుకొనవలెను. ఇట్లు సరిచూచుకొనుటయే క్షేమము. ఇతర విధములను పోలికలయందు ఆత్మవంచనకలదు. దైవ ప్రజలకు అనుగ్రహింపబడిన దీవెనలు, ఆధిక్యతలు వెలుగుతో వారి నైతిక శీలము, ఆధ్యాత్మిక స్థితి సమానముగా లేకున్నచో వారిని త్రాచుతో తూచి తక్కువగా నున్నట్లు దేవదూతలు నివేదించెదరు. 8IT 406; CChTel 202.2