Go to full page →

క్షమించబడని పాపము CChTel 202

పరిశుద్ధాత్మకు విరోధముగా చేయు పాపమునగానేమి? పరిశుద్ధాత్ముని కార్యములను మన:పూర్వకముగా సాతానుకు ఆరోపించుటయే. ఉదాహరణకు దేవుని ఆత్మయొక్క ప్రత్యేక కార్యమును ఒకడుచూచెననుకొందము. ఆ కార్యాము లేఖన సమ్మతముగా నున్నట్లు అతనికి నిదర్శనములు కలవు. అది దైవ సంబంధమయినదని పరిశుద్ధాత్మ ఆ వ్యక్తి ఆత్మకు సాక్ష్యమిచ్చును. తదుపరి అతడు శోధనకు లొంగును. అహంకారము, స్వయంసమృద్ది తదితర దుర్గుణములు అతనిని వశపర్చుకొనును. ఇత:పూర్వము పరిశుద్ధాత్ముని శక్తి యని అతడు గుర్తించిన దానిని ఎన్ని నిదర్శనములున్ననను దైవసంబంధమైనది కాదని ఇప్పుడు త్రోసిపుచ్చి అవి సైతాను సంబంధమైనవని అతడు పల్కును. మానవ హృదయముపై పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు పని చేయును. ఆ ఆత్మను మానవులు ఇష్ట పూర్వకముగా విసర్జించి అది సాతాను సంబంధమైనదని పలికినప్పుడు తమతో దేవుని కున్న సంబంధమును వారు త్రెంచుకొనెదరు. దేవుడు సంతోషముతో వారికిచ్చిన నిదర్శనమును పేక్షించుట ద్వారా వారు తమ హృదయములయందు ప్రకాశించుచున్న వెలుగును ఆర్పివేసెదరు. తత్ఫలితముగా వారు చీక టియందు విడువబడెదరు. ఇట్లు క్రీస్తు పలికిన మాటలు నెరవేరును. “నీలోనున్న వెలుగు చీకటియై యుంటే ఆ చీకటి యెంతో గొప్పది.” (ముత్తయి 6:23) పాపము చేసిన వ్యక్తులు కొంతకాలము వరకు దైవ ప్రజలవలెనే కాన్పింతురు. అయితే తమ ప్రవర్తనను, మనస్తత్వము ప్రదర్శించు పరిస్థితులు యేర్పడినప్పుడు వారు సాతాను పక్షము వారనియు అతని నల్ల జెండా క్రింద నున్నారనియు వ్యక్తమగును. 95T 634; CChTel 202.3