Go to full page →

వివాహాధిక్యతలు CChTel 282

క్రైస్తవులైనవారు తమ దాంపత్యము యొక్క ప్రతి ఆధిక్యతా ఫలితమును గూర్చి బాగా యోచనచేయవలెను. వారి ప్రతి కార్యమునకు పవిత్ర నియమము పునాదియై యుండవలెను. అనేక సందర్భములలో తల్లిదండ్రులు తమ దాంపత్య ఆధిక్యతలను బలపర్చుకొనిరి. CChTel 282.1

(మరియొక సమయమందు శ్రీమతి వైటమ్మగారు, కుటుంబ బాంధవ్యపు ఆధిక్యతలు, రహస్యమును గూర్చి ప్రస్తావించిరి). CChTel 282.2

న్యాయసమ్మతమైన కార్యమును మితిమీరి చేయుట భయంకరపాపమగును. చాలా మంది తల్లిదండ్రులు తమ వివాహిత జీవితమందు తాము పొందవలసిన జ్ఞానమును పొందక యున్నారు. సాతాను తమను వశపరుచుకొని తమ జీవితములను అదుపు చేయునేమోయను భయము, తద్విషయమైన జాగ్రత్త వారి కుండదు. తమ దాంపత్య జీవితమును అదుపుచేసికొనవలెనని దేవుడు కోరుచున్నాడని వారు గ్రహించకున్నారు. కాని తమ ఇచ్ఛలను అణచుకొనుట మత విషయకమైన విధియని గ్రహించువారు చాల అరుదు. తాము వరించిన వ్యక్తిని వివాహమాడితిరి గనుక తమ తుచ్ఛమైన ఇచ్ఛలను తీర్చుకొనుటలో వివాహము సమర్థించునని వారు వాదింతురు. భక్తిపరులమని చెప్పుకొను స్త్రీ పురుషులు కూడా తమ కామేచ్ఛలను అదుపుచేసికొనరు. తాము వ్యర్థపుచ్చుచున్న శక్తి తమ జీవితమును బలహీనము చేసి తమ శరీర తత్వమంతటికి దౌర్భల్యము చేకూర్చుచున్నదనియు దాని విషయము దేవుడు తమ్మును ఆరా అడుగుననియు వారు తలంచరు. CChTel 282.3