Go to full page →

ఆత్మోవేక్షను ఆశానిగ్రహమును అభ్యసించుడి CChTel 282

సృష్టికర్తకు సంపూర్ణమైన సేవ చేయుటకు గాను తమ మానసిక శారీరక ఇంద్రియములను కాపాడుకొనుట దేవునిపట్ల తాము నెరవేర్చవలసిన ఒక విధియని మానవులు గుర్తించునట్లు నేను చేయగలిగినచో ఎంత బాగుండును! క్రైస్తవ గృహిణి తన భర్త యొక్క జంతు తుల్యమైన కామేచ్చలను రెచ్చగొట్టు మాటలను క్రియలను స్వాధీనమందుంచుకోన వలెను. ఈ రీతిగా వెచ్చించుట కనేకులను బలము లేనేలేదు. తమ యౌవనము నుండియు వారు తమ జంతు తుల్యమైన కామేచ్చలను తీర్చుకొనుటద్వారా మనస్సును బలహీనము చేసికొని శరీరతత్వమును నిస్సార మొనర్చు కొనిరి. వారి వివాహనంతర జీవితములో ఆత్మోపేక్ష ,ఆత్మనిగ్రహము దీక్షావాక్యములై యుండవలెను. CChTel 282.4

మానవాళికి క్షేమాభివృద్ది కలిగించుటకు దేవునికి సంపూర్ణ సేవ చేయుటకును మన ఆత్మను పరిశుద్దముగాను శరీరమును ఆరోగ్యవంతముగను వుంచుకొనుటయు దేవుడు మనకిచ్చిన విధ్యుక్త ధర్మమైయున్నది. అపాస్తలుడీ హెచ్చరిక చేయుచున్నాడు :“కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావుకు లోనైన మీ శరీరమందు పాపమును ఎలనియ్యకుడి. ”ఇట్లు మన కాయన హితవుచేయు చున్నాడు ;“మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందును మతముగా నుండును. ”క్రైస్తవులమని పిలుచు కొనువారందరు తమ శరిరములను “సమర్పించుకొనవలెనని ఆయన హెచ్చరించు చున్నాడు. ఆయన ఇంక నిట్లను చున్నాడు. “నేను భ్రస్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాని లోపరచుకొను చూన్నను.” CChTel 283.1

మానవుడు తన కామమును తీర్చుకొనుటకు తన భార్యనొక సాధనముగా నుపయోగించుటకు పవిత్ర ప్రేమ ప్రోత్సహించదు. భోగాసక్తిని పుట్టించునది జంతు తుల్యమైన కామేచ్చయే. అపోస్తలుడు నిర్దేశించిన యీ విధముగా ప్రేమించువారు చాల తక్కువ మంది. ”అటువలె క్రీస్తు కూడ సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్దమైనదిగాను నిర్ధోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన యెదుట దాని పవిత్ర పరచి [అపవిత్రము చేయక ]పరిశుద్ద పరచుటకై తన్నుతాను అప్పగించుకొనెను. “దాపంత్య ” ము నందు ఇట్టి ప్రేమ పవిత్రమైన ,పరిశుద్ధమైన ఒక నియమము. అయితే ,కామేచ్చ హద్దులను పాటించదు ;వివేచన యొక్క అదుపాజ్ఞలకు లొంగి యుండదు. అది ఫలితములను గూర్చి తలంచదు. కారణమును ఫలితములను అది వివేచించదు. CChTel 283.2