Go to full page →

“ఎవరికిని అచ్చియుండవద్దు ” CChTel 311

అనేక కుటుంబములు పెదవిగా నుండుటకు కారణము తమకు డబ్బు వచ్చిన వెంటనే ఖర్చుపెట్టుటయే. CChTel 311.3

సంపాదించకముందే ద్రవ్యమును పుచ్చుకొని వాడు కొనుట ఒక ఉరియైయున్నది. 3AH 392; CChTel 311.4

బైబిలు క్రైస్తవులమని చెప్పుకోను వారు యధార్ధముగా జీవించ వలెనని కూరుట న్యాయమె ,ఒక వ్యక్తీ తానూ చెలించ వలిసిన ఋణమును చెల్లించకున్నచొ ఆతని మూలమును మన ప్రజలందరును నమ్మదగిన వారుగా పరిగణిoచబడు నపాయము కలదు. CChTel 311.5

బైబిలు క్రైస్తవులమని చెప్పుకోను వారు యధార్ధముగా జీవించ వలెనని కూరుట న్యాయమె ,ఒక వ్యక్తీ తానూ చెలించ వలిసిన ఋణమును చెల్లించకున్నచొ ఆతని మూలమును మన ప్రజలందరును నమ్మదగిన వారుగా పరిగణిoచబడు నపాయము కలదు. CChTel 311.6

దైవభక్తి కలదని చెప్పుకోనువారు తాము నమ్ము సిద్ధాంతము ప్రకారము జీవించి తమ అనాలోచిత కార్య చరణము ద్వారా సత్యమును అపకీర్తి కలుగ కుండ చూడవలెను. “ఎవరికిని అచ్చి యుండవద్దు ” అని అపోస్తలుడు హెచ్చరించు చున్నాడు. 45T 179-182; CChTel 311.7

అనేకులు తమ వచ్చుబడి ననుసరించి వ్యయముచేయుట నేర్చుకొనలేదు. పరిస్థి తులనుబట్టి వర్తించుట వారు నేర్చుకోనరు. పదే పదే బదులు పుచ్చుకొని అప్పులో మునిగి తేలెదరు. తత్పర్యవ సానముగా వారు నిరాశా నిస్పృహలకు గురియగుదురు. 5AH 374; CChTel 312.1

అప్పులో పడు విధముగ వ్యవహరించరాదని మీరు గ్రహించ వలెను ,ఒకడు అప్పులో పడి యున్నచో ఆత్మలను పట్టుటకు సాతానుడు అమర్చు ఉచ్చులో ఒక దానియందతడు చిక్కు కొని యున్నాడు. CChTel 312.2

ఇక మీదట అప్పులో పడనని నిర్ధారణ చేసికొనుడి. అప్పులో పడుట కన్నా వెయ్యి అనవసరవస్తూవులను ఉపేక్షించుట మంచిది. మశూచికమును తప్పించు కొనునట్లు అప్పును తప్పించు కొనుడి. 6AH 392, 393; CChTel 312.3