Go to full page →

అనవసర విషయములు అలక్ష్యము చేయుట పొదుపు కానేరదు CChTel 312

దేహమును గూర్చితీసికొనకుండుట లేక దానిని దుర్వినియోగపరచి తద్వార ఆయన కది లాభములేకుండనట్లు చేయుటద్వారా దేవుడు గౌరవించ బడడు. రుచిర మైన బలవర్ద కమైన ఆహారము నిచ్చుట ద్వారా శరీరమును పోషించుట ప్రతి గృహస్తుని యొక్క ప్రథమ కర్తవ్యము. అనవసర భోజనము తగ్గించుటకన్న. తక్కువ వెలగల దుస్తూలు గృహ సామాగ్రి కలిగియుండుట మేలు. CChTel 312.4

అతిథులకు విలువ గల ఆహార పానములనిచ్చు నిమిత్తి ము కొందరు గృహస్తులు తమ కుటుంబ భోజనము తగ్గించెదరు. ఇది అవివేకము. అతిధి సత్కార్యము చాల సామాన్యముగ నుండవలెను. కుటుంబావశ్యకతలు ప్రధమ గన్యములు. CChTel 312.5

అవివేకమైన పొదుపు ,అస్వభావికాచారములు ఇవి అవసరమైన చోట ఆశిర్వాదకర ముగ నుండు అతిధి సత్కార్యముచేయలేక పోవుటకు హేతువాగు చున్నది. అదనముగా భోజనము సిద్దము చేయుమని భార్యను భాదించనక్కరలేకుండ మన భోజనము బల్ల కడ ఒక అతిధికి సరిపడ ఆహార ముండ వలెను. CChTel 312.6

పొదుపు అనగా లోభిత్వముకాదు గాని ఎక్కువ పని జరుగ వలసి యున్నది గనుక ద్రవ్యమును జ్ఞానయుతముగా వ్యయము చేయుటయని భావము. 7MH 322; CChTel 312.7

ఆరోగ్యమునకు ,సౌక్యమునకు అవసరమగు వానిని తన ప్రజలు కొల్పొవలెనని దేవుడు కొరడు కాని విలాసమును ,దుర్వ్యయమును ,దంబమును ఆయన ఒప్పుకోనాడు. 8AH 378, 379; CChTel 312.8