Go to full page →

పొగాకు ధూమము స్త్రీలకు , పిల్లలకు హానికరము CChTel 440

గంజాయి, చుట్ట లేక పొగాకు వాడు వ్యక్తి యొద్దనుండి వచ్చు దుర్వాసనతో నిండిన గాలిని పీల్చుకొనుటద్వారా స్త్రీలు, పిల్లలు, బాధకు గురియగు చున్నారు. ఇట్టి వాతావరణములో నుండువారు సర్వదా వ్యాది బాధితేలగుదురు. 155T 440; CChTel 440.2

ఊపిరి తిత్తులనుండియు, చర్మరంధ్రములనుండియు బహిష్కరించబడు విషకలితమగు పొగాకు దుర్వాసనను పీల్చుకొనుటద్వారా చిన్న పిల్లల శరీరము విషపూరితమగును. కొంతమంది పిల్లలపై ఈ విషము మందముగా పనిచేయును. అది వారి మెదడుకు, గుండెకు, కాలేయమునకు, ఊపిరితిత్తులకు ముప్పు తెచ్చును. క్రమేపి వారు బలహీనులగుదురు. అయితే కొందరిపైనది చురుకుగాను ప్రత్యక్షముగాను పనిచేసి వారికి మూర్ఛ, పక్షవాయువు, హాఠాన్మరణము తెచ్చును. పొగాకు బానిసయగు ప్రతి వ్యక్తి విడచుగాలి తనచుట్టునున్న వాతావరణము విషదలితము చేయును. 16Te 58, 59; CChTel 440.3

పూర్వికుల అనారోగ్యదాయకములగు అలవాటులు పిల్లలకు యువజనులకు హాని కలిగించును. మానసిక దౌర్యల్యము శారీరక బలహీనత, నరముల వ్యాది, విపరీతవాంఛలు`ఇవి పితరులనుండి పౌతృలకు పిత్రార్జితముగా సంక్రమించుచున్నవి. పిల్లలు ఈ దురభ్యాసములను కొనసాగించుట ద్వారా దుష్పలితములు అధికరించి అనంతములగు చున్నవి. 17M H 328; CChTel 440.4