Go to full page →

ప్రమాణ స్వీకారము CChTel 469

కొందరు దైవ ప్రజలు ప్రమాణము చేయుటలో పొరపాటు చేయుచున్నట్లు నేను చూచితిని. వారిని బాధించి తమ ప్రభుని ధనమును తీసికొనుటకు సాతానుడు దీనిని పురస్కరించుకొని వర్తించుచున్నాడు. “ఎంతమాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు” అను ప్రభుని మాటలు న్యాయస్థానములందలి ప్రమాణ స్వీకారమునకు చెందవు. “మీమాట ఔనంటే అవును కాదంటే కాదు అని యుండవలెను. వీటిని మించునది దుష్టుని నుండి వచ్చునది.” మత్తయి 5:34, 37. ఇది సాధారణ సంభాషణలకు చెందును. కొందరు ఉత్ప్రేక్షించి చెప్పెదరు. కొందరు ప్రాణము తోడని ఒట్టు పెట్టుకొనెదరు. ఇంక కొందరు ప్రాణముతోడనియు తలతోడనియు అందురు. అనగా తాము జీవించియుండుట ఎంత నిజమో తామాడిన మాటయు నంతే నిజమనియు వారికి శిరస్సుండుట యెంత వాస్తవయో వారి మాటకూడ అంత వాస్తవమని భావము. కొందరు తాము పలికిన మాటలు నిజమనుటకు భూమ్యాకాశములే సాక్షులనెదరు. తాము చెప్పుచున్నది సత్యముకాని పక్షమున దేవుడు తమ్మును నాశనము చేయునుగాక యని పల్కెదరు. ఇట్టి సామాన్య విషయములలో ఒట్టు పెట్టుకొనుట కూడదని క్రీస్తు తన శిష్యులను హెచ్చరించెను. CChTel 469.2

దేశమునందలి చట్టములలో ప్రభువింకను సంబంధము కలదని నేను చూచితిని. యేసు గుడారమందుండగా అడ్డగించునట్టి దేవుని ఆత్మ ప్రభావమును రాజు, ప్రజలు గ్రహించగలిగిరి. ఎక్కువ భాగము ప్రజానీకమును సాతానుడు స్వాధీనపరచుకొనుచున్నాడు. చట్టము లేకున్నచో మనకు ఎక్కువ బాధ కలుగును. అవసరమయినపుడు న్యాయమయిన విధముగ వారు సాక్ష్యమీయవలెనని పొరబడినపుడు తాము చెప్పునది వాస్తవమనియు దానికి దేవుడే సాక్షియనియు దైవ ప్రజలను దైవ వాక్యము నల్లంఘించుట కానేరదు. CChTel 469.3

ప్రమాణము ద్వారా యధార్థముగా సాక్షమీయగల వ్యక్తి భువిపై నున్నచో నతడు క్రైస్తవుడేయని నేను చూచితిని. అతడు దైవముఖ ప్రకాశమందు జీవించువాడు. ఆయన బలమందతడు బలిష్ఠుడగును. ప్రాముఖ్యములగు విషయములు చట్టములద్వారా పరిష్కరించబడవలసి వచ్చినపుడు దేవునికి వచ్చునట్లుగా విజ్ఞప్తి చేయగల వ్యక్తి క్రైస్తవుడే. దేవుడు “నాతోడని ప్రమాణము” చేయునని దూత నాకు చూపెను. 7IT 201-203; CChTel 469.4