Go to full page →

రాజకీయములను గూర్చి ఉద్రిక్తత CChTel 470

మన సంఘములలో గాని పాఠశాలలో గాని బైబిలు బోధించువారు రాజకీయ వ్యక్తులపట్ల తన యిష్టా యిష్టములను వ్యక్తపరచవీలులేదు. ఏలననగా అట్లు చేయుట ద్వారా ఇతరులకు ఉద్రేకము పుట్టించి తత్ఫలితముగా ప్రతి వ్యక్తి తన యిష్ట సిద్ధాంతమును ప్రచారము చేయుటకు దారితీయును. ప్రస్తుతకాల సత్యమును నమ్ముచున్నామని చెప్పుకొనువారిలో రాజకీయ యిష్టా యిష్టములను వ్యక్తపరచుటకిట్లు ఉత్రిక్తపర్చబడువారు కొందరుందురు. దీని పర్యవసానముగా సంఘమందు అనైక్యత చెలరేగును. CChTel 470.1

రాజకీయ సమస్యలను పూడ్చిపెట్టవలెనని దేవుడు తన ప్రజలను కోరుచున్నాడు. ఈ యంశములపై నిశ్శబద్దముగా నుండుట మేలు. దైవవాక్యమందు బలయలుపర్చబడిన పవిత్ర సువార్త నియమముల విషయము తన అనుచరులు ఏకాభిప్రాయము కలిగి యుండవలెనని క్రీస్తు కోరుచున్నాడు. రాజకీయ పక్షములకు ఓటు వేయుట క్షేమకరము కాదు. ఏలనగా ఏ ప్రభుత్వ స్థాపనకు మనము ఓటు వేయుచున్నామో మన మెరుగము. ఏ రాజకీయ పథకమందును మనము పాల్గొనుట క్షేమము కాదు. CChTel 470.2

క్రైస్తవులైన వారు వాస్తవముగా ద్రాక్షావల్లికి తీగలవంటివారై ద్రాక్షావల్లి ఫలించు ఫలములనే ఫలించెదరు. క్రైస్తవ సహవాసమందు వారు సమైక్యముగా కృషి చేసెదరు. వారు రాజకీయలాంఛనములను ధరించక క్రీస్తు లాంఛనమునే ధరింతురు. CChTel 470.3

అట్లయిన మనము చేయవలసినదేమి? రాజకీయముల జోలికి పోకుండుటయే. CChTel 470.4

సాగు చేయుటకు అవసరమైన పెద్ద ద్రాక్ష తోట కలదు. క్రైస్తవులు అవిశ్వాసుల మధ్య పని చేయవలసి యున్నను వారు లోకస్థులవలె కన్పించరాదు. రాజకీయములను గూర్చి ప్రస్తావించరాదు. రాజకీయములలో పాల్గొనరాదు. ఏలనగా అట్లు చేయుట ద్వారా శత్రువు వచ్చి విభేదము, అసమ్మతి కలిగించుటకు వారవకాశమిచ్చెదరు. CChTel 470.5

దైవజనులు రాజకీయముల జోలికి పోరాదు. రాజకీయ సంఘర్షణములలో పాల్గొన రాదు. లోకము నుండి వేరుపడుడి. సంఘములోనికి గాని పాఠశాలలోనికి గాని వివాదమునకు అసమ్మతికి దారితీయు ఉద్దేశ్యములన తేకుడి. స్వార్థపరులగ మానవుల లోనికి పుచ్చుకొన నైతిక విషమే విభేదము. 8G W 391-395; CChTel 470.6