లోకం నుంచి వేరుగా నివసించే తన స్వకీయ జనంగా సెవెంతడె ఎడ్వెంటిస్టుల్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. లోకపు రాళ్లగని నుంచి వారిని సత్యమనే గునపంతో విడదీసి తనతో అనుసంధానపర్చుకున్నాడు. రక్షణ సేవ చివరి భాగంలో వారిని తన ప్రతినిధులుగా చేసుకుని, తనకు రాయబారులుగా ఉండాల్సిందిగా పిలుపునిస్తున్నాడు. మున్నెన్నడు మానవులకివ్వని సత్ససంపదను మున్నెన్నడూ మానవులకివ్వని భయంకర హెచ్చరికల్ని ఆయన వారికి అప్పగించాడు. ఈ కార్యసిద్ధికి మన ప్రచుణాలయాలు మిక్కిలి శక్తిమంతమైన సాధనాల్లో కొన్ని. టెస్టిమొనీస్, సం. 7, పు. 138. ChSTel 172.2
మన ప్రచురణ సేవ దేవుని ఆదేశం మేరకు ఆయన ప్రత్యేక పర్యవేక్ష కింద స్థాపితమయ్యింది. టెస్టిమొనీస్, సం. 7, పు. 138. ChSTel 172.3
గొప్ప శక్తితో ఆకాశంలో నుంచి దిగివచ్చి, లోకాన్ని దేవుని మహిమతో వెలిగించిన ఆ మూడో దూత సేవను చాలా వరకు మన ప్రచురణాలయాల ద్వారా పూర్తి చేయాల్సి ఉన్నాం. టెస్టిమొనీస్, సం. 7, పు. 140. ChSTel 172.4
మన ప్రచుణాలయాలకి ఈ వర్తమానం ఇవ్వాల్సిందిగా దేవుడు నన్ను ఆదేశించాడు, “మా ధ్వజం పైకెత్తండి. మరింత పైకెత్తండి. లోకమంతా వినేందుకు మూడోదూత వర్తమానాన్ని ప్రకటించండి. ‘దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్దులు’ వీరు అని లోకం చూడనివ్వండి. (ప్రకటన 14:12.) మన సాహిత్యం ఈ వర్తమానాన్ని ఓ సాక్ష్యంగా లోకానికివ్వనివ్వండి.” టెస్టిమొనీస్, సం. 9, పు. 91. ChSTel 173.1