ఈ కాలానికి ఉద్దేశించిన సత్యాన్ని విశ్వసించే మీరు నిద్ర లేవండి. సత్యం ఎరిగిన వారు దాన్ని ప్రకటించటానికి తోడ్పడేందుకు సాధ్యపడిన ఆర్థిక వనరుల్ని సమకూర్చటం ఇప్పుడు మీ విధి. మన ప్రచురణల విక్రయాలనుంచి వచ్చే ద్రవ్యంలో కొంత గుడ్డి కళ్లు తెరవటానికి, హృదయపు బీటి భూమిని దున్నటానికి తోడ్పడే ప్రచుణల్ని మరెక్కువగా ఉత్పత్తి చేసేందుకు వసతులు కల్పించటానికి ఉపయోగించాలి. టెస్టిమొనీస్, సం. 9, పు. 62. ChSTel 173.2
ప్రస్తుత సమయానికి దేవుని సత్యంతో సాహిత్యం ప్రచురించటానికి అమెరికా, ఐరోపా ఇతర దేశాల్లో కట్టడాలు నిర్మించాలని కొన్ని సంవత్సరాల క్రితం ప్రభువు నాకు ప్రత్యేక ఆదేవం ఇచ్చాడు. ముద్రణాలయాల నుంచి ఆహ్వాన వర్తమానాల్ని హెచ్చరికా వర్తమానాల్ని లోకానికి పంపటానికి తీవ్ర కృషి జరగాలని ఆయన నన్ను ఉపదేశించాడు. మరే విధంగాను చేరలేని కొందరిని మన సాహిత్యం ద్వారా చేరగలుగుతాం. ఈ కాలపు సత్యాన్ని గూర్చి లోకాన్ని చైతన్యపర్చటానికి మన పత్రికలు పుస్తకాల నుంచి ప్రకాశవంతమైన వెలుగు ప్రజ్వలించాలి. టెస్టిమొనీస్, సం. 8, పు. 87. ChSTel 173.3
మన ప్రచురణల్ని వివిధ భాషల్లో ముద్రించి ప్రతీ నాగరిక దేశానికి పంపించాలని దర్శనంలో దేవుడు నాకు చూపించాడు. ఆత్మల విలువతో పోల్చితే డబ్బు విలువ ఏపాటిది? మన ఆదాయంలో ప్రతీ రూపాయి మనది కాదు దేవునిదని, అది దేవుడు మనకిచ్చిన ప్రశస్త ట్రస్టు అని, దాన్ని అనవసరమైన మన వాంఛలకు వ్యర్థం చేయ్యకుండా, మరణిస్తున్న పురుషులు స్త్రీలను రక్షించే దేవుని సేవలో జాగ్రత్తగా ఉపయోగించాల్సిన ద్రవ్యమని మనం పరిగణించాలి. లైఫ్ స్కెచ్చేస్, పు. 214. ChSTel 173.4
ముద్రిత వాక్యాన్ని ఆయా భాల్లోకి అనువదించి దాన్ని భూదిగంతాల వరకు తీసుకు వెళ్ళాలి. టెస్టిమొనీస్, సం. 9, పు. 26. ChSTel 174.1
ఈ ప్రచురణల్ని ప్రతీ భాషలోకి అనువదించాలి. ఎందుకంటే సువార్త లోకమంతటికి ప్రకటించబడాల్సి ఉంది. క్రీస్తు ప్రతీ పనివాడికి దివ్యసామర్ధ్యాన్ని వగ్దానం చేస్తున్నాడు. అది అతడి సేవను విజయవంతం చేస్తుంది. టెస్టిమొనీస్, సం. 9, పు. 34. ChSTel 174.2
మన ప్రచురణలు అన్నిచోట్లకూ వెళ్ళాలి. అవి అనేక భాషల్లో ప్రచురమవ్వాలి. మూడోదూత వర్తమానాన్ని ఈ సాధనం ద్వారాను, సజీవ బోధకుడి ద్వారాను ప్రకటించాలి. ఈ కాలానికి దేవుడిచ్చిన సత్యం తెలిసిన మీరు మేల్కోండి. ది కోపోర్టర్ ఇవేంజిలిస్ట్, పు. 101. ChSTel 174.3
మూడోదూత వర్తమానం ప్రకటించబడని స్థలాలకి దైవ ప్రజల్లో అనేకమంది మన ప్రచురణలతో వెళ్లాలి. వేరేవిధంగా సత్యాన్ని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి వీరు సత్యాన్ని అందించాలి. టెస్టిమొనీస్, సం. 9, పులు. 33, 34. ChSTel 174.4
రక్షకుడు త్వరలో వస్తాడన్న వాగ్దానాలు గల ప్రచురణలతో వారు నగరాలకు పట్టణాలకు పల్లెలకు వెళ్లాలి. టెస్టిమొనీస్, సం. 9, పు. 34. ChSTel 174.5
ఇతర దేశాల్లో ప్రచురణలు కొందరి మనసుల పై పనిచేసి దుభిమానాల్ని మూఢనమ్మకాల్ని తొలగించే పనిని అప్పుడే చేస్తున్నాయని దర్శనంలో నాకు చూపించటం జరిగింది. పురుషులు-స్త్రీలు నేటి కాలానికి ఉద్దేశించిన సత్యాన్ని గూర్చిన పత్రికలు, కరపత్రాలు ఆసక్తిగా చదవటం నాకు చూపించటం జరిగింది. వారు తమకు ఆశ్చర్యంగాను నూతనంగాను ఉన్న విషయాల నిదర్శనాల్ని చదువుతున్నారు. తమకు అయోమయంగా ఉన్న సత్యాంశాలు, ముఖ్యంగా నాల్లో ఆజ్ఞలోని సబ్బాతును గూర్చిన వెలుగు స్పష్టమయ్యే కొద్దీ వారు గాఢమైన నూతనమైన ఆసక్తితో బైబిలు తెరిచి చదువుతున్నారు. ఈ విషయాలు అలాగున్నవో లేదో పరీక్షించటానికి వారు లేఖనాల్ని పరిశోధించేటప్పుడు నూతన వెలుగు వారికి అవగాహనను కలిగించింది. ఎందుకంటే దేవదూతలు వారి చుట్టూ గాలిలో తిరుగుతూ వారు ఆ ప్రచుణల్లో చదువుతున్న సత్యాల్ని బైబిలుని ఇంకో చేతిలోను పట్టుకొని ఉండటం చూశాను. కన్నీరు కార్చుతూ, దేవుని ముందు వినయంగా వంగి తమను సత్యంలోకి నడిపించమంటూ ప్రార్ధించారు. వారు అడగక ముందునుంచి వారి నిమిత్తం ఆయన అదేపని చేస్తున్నాడు. వారు తమ హృదయాల్లోకి సత్యాన్ని స్వీకరించినప్పుడు, సత్యంలోని ఐక్యతను చూసినప్పుడు, బైబిలు వారికి ఓ నూతన గ్రంథమయ్యింది. అమితానందభరితులై దాన్ని కౌగిలించుకున్నారు. వారి ముఖాలు పరిశుద్ద సంతోషానందాలతో వికసించాయి. ChSTel 174.6
వెలుగును తామే పొంది ఆనందించటంతో వారు తృప్తి చెందలేదు. వారు ఇతరుల కోసం పనిచేశారు. కొందరు సత్యం కోసం, చీకటిలో ఉన్న సహోదరులకోసం గొప్ప త్యాగాలు చేశారు. ఇతర భాషల్లో కరపత్రాలు పత్రికలు పంచటంలో గొప్ప సేవకు ఈ విధంగా మార్గం సిద్ధమౌతున్నది. లైఫ్ స్కెచ్చేస్, పులు. 214, 215. ChSTel 175.1