మన పత్రికలకు చందాలు సేకరించటంలో సహోదరీలు సమర్థంగా పని చేయ్యవచ్చు. ఈ విధంగా వారు అనేకమంది ముందుకి సత్యాన్ని తేగలుగుతారు. రివ్యూ అండ్ హెరాల్డ్, జూన్ 10, 1880. ChSTel 176.2
సత్యాన్ని ప్రచురించటానికి ఇప్పుడు మనకు మంచి సదుపాయాలున్నాయి. అయితే మన ప్రజలు తమకున్న ఆధిక్యతల్ని ఉపయోగించుకోటం లేదు. ప్రతీ సంఘంలోను ఆత్మల్ని రక్షించటంలో తమ సమర్ధతల్ని ఉపయోగించాల్సిన అవసరాల్ని చూడటంగాని గుర్తించటం గాని జరగటం లేదు. మన ఆరోగ్య పత్రికతోసహా మన పత్రికలకు చందాలు పోగుచెయ్యటం మన పుస్తకాల్ని పరిచయం చేయటమన్న విధిని వారు గుర్తించటం లేదు. టెస్టిమొనీస్, సం. 4, పు. 391. ChSTel 176.3