Go to full page →

గ్రంథ విక్రయం ChSTel 176

అనేకులు విచారంగా ఉంటారు, అధైర్యం చెందుతారు. విశ్వాసం విషయంలో బలహీనంగా ఉంటారు. తమకన్నా ఎక్కువ అవసరాలు, లేమి ఉన్న మరో వ్యక్తికి వారు సహాయం చెయ్యాలి. అప్పుడు వారు దైవశక్తిని పొంది బలో పేతులవుతారు. వారు మన పుస్తకాలు అమ్మటమన్న మంచి పనిలో నిమగ్నమవ్వాలి. ఇలా వారు ఇతరులకు సహాయం చేస్తారు. వారు సంపాదించిన అనుభవం తాము దేవుని సహాయకులన్న భరోసా ఇస్తుంది. వారికి సహాయం చెయ్యమంటూ వీరు దేవునితో విజ్ఞాపన చేసినప్పుడు, వెలుగు కోసం వెదకుతున్న వారి వద్దకు ప్రభువు వీరిని నడిపిస్తాడు. క్రీస్తు వారి పక్కనే ఉండి ఏమి మాట్లాడాలో ఏమి చెయ్యాలో నేర్పిస్తాడు. ఇతరుల్ని ఓదార్చటం వలన వారు ఓదార్పు పొందుతారు. ది కోలపోర్టర్ ఇవేంజిలిస్ట్, పు. 40. ChSTel 176.4