అపొస్తలుడైన పౌలంటున్నాడు. “క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించువారందరు హింసపొందుదురు.” అయితే హింస మత్తుగా నిద్రించటానికి కారణమేంటి? సంఘం లోక ప్రమాణాల్ని అనుసరిస్తుంది గనుక అది వ్యతిరేకతను మేల్కొల్పటం లేదన్నదొక్కటే దానికి కారణం. మన దినాల్లో సాగుతున్న మతం క్రీస్తు ఆయన అపొస్తలుల దినాల్లో ఉన్న పవిత్ర, పరిశుద్ధ, క్రైస్తవ విశ్వాసం వంటిది కాదు. క్రైస్తవమతం పాపంతో రాజీపడుతున్నందుకే, దైవ వాక్యంలోని మహత్తర సత్యాల్ని అలక్ష్యం చేస్తున్నందుకే, సంఘంలో భక్తి అంత తక్కువగా ఉన్నందుకే అది లోకంలో అంతగా వృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తున్నది. తొలినాళ్ల సంఘ విశ్వాసం, శక్తి పునరుజ్జీవం పొందనివ్వండి; అప్పుడు హింస్వాజ్వాలలు తిరిగి రాజుకుంటాయి. ది గ్రేట్ కాంట్రవర్సీ, పు. 48. ChSTel 186.3